ఇద్దరి అరెస్టు

20 Oct, 2023 01:30 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న సారాతో ఎస్‌ఈబీ సిబ్బంది

880 లీటర్ల సారా, కారు సీజ్‌

పార్వతీపురం టౌన్‌: సారా రవాణాను అరికట్టేందుకు పార్వతీపురం మండలంలోని రంగాలగూడ గ్రామ సమీపంలో ఎస్‌ఈబీ సీఐ ఉపేంద్ర ఆధ్వర్యంలో గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 880 లీటర్ల సారాతో ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ ఉపేంద్ర మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రంలోని అలమండ నుంచి పార్వతీపురం మైదాన ప్రాంతానికి సారా రవాణా అవుతోందన్న ముందస్తు సమాచారంతో దాడులు నిర్వహించామని తెలిపారు. కొమరాడ మండలం పూడేసు గ్రామానికి చెందిన ఆరిక నరేష్‌, పార్వతీపురం పట్టణానికి చెందిన సిరిపురపు నారాయణ ఒడిశా రాష్ట్రం నుంచి అక్రమంగా సారా రవాణా చేస్తుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. వారికి సారా సరఫరా చేసిన ఒడిశా రాష్ట్రంలోని అలమండకు చెందిన బెవర శరత్‌పై కూడా కేసు నమోదు చేశామని, నరేష్‌, నారాయణలను రిమాండ్‌ నిమిత్తం పార్వతీపురం జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. దాడుల్లో ఎస్సై వీవీ రమణ, సిబ్బంది పాల్గొన్నారు.

100 మద్యం సీసాలతో ఇద్దరి అరెస్టు

గంట్యాడ: మండలంలోని బుడతనాపల్లి గ్రామం వైపు అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు కొఠారుబిల్లి జంక్షన్‌ సమీపంలో పోలీసులు ఇద్దరు వ్యక్తులను మద్యం సీసాలతో పట్టుకున్నారు. మండలంలోని లక్కిడాం గ్రామానికి చెందిన బండ రామకృష్ణ, బాడంగి మండలానికి చెందిన తోట దుర్గారావు కొఠారుబిల్లి జంక్షన్‌ నుంచి బైక్‌పై అక్రమంగా 100 మద్యం సీసాలు తరలిస్తుండగా గోకులం లేవుట్‌ సమీపంలో బంగారమ్మ గుడి దగ్గర పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు హెచ్‌సీ జె. శ్రీనివాసరావు తెలిపారు.

మరిన్ని వార్తలు