కిక్కెక్కింది.. నిద్ర ముంచుకొచ్చింది.. అట్లుంటది మనతోని!

18 Nov, 2023 01:40 IST|Sakshi

పెద్దపల్లి: మందు బాబులూ.. ఒక్కక్షణం ఆలోచించండి.. మనం బయటకు వెళ్తే మళ్లీ ఇంటికొచ్చే దాకా మన కుటుంబం కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తూ ఉంటుంది. ఏదైనా జరగరానిది జరిగి ప్రాణాలు పోతే వాళ్లకు దిక్కెవరు? ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. జిల్లా కేంద్రంలోని అయ్యప్పగుడి చౌరస్తావద్ద రోడ్డుపై ఓ వ్యక్తి ఇలా గాఢనిద్రలో పడుకున్నాడు. చిత్తుగా మద్యం తాగడంతో మత్తు ఆవరించింది.

ఆ కిక్కుతో ఒళ్లు మరిచి ఇలా నడిరోడ్డుపై నిద్రలోకి జారుకున్నాడు. ఎన్నికల వేళ.. ఎవరు పిలిచి మద్యం తాగించారో లేక.. సొంతంగా కొనుగోలు చేసి తాగాడో తెలియదు కానీ.. రాజీవ్‌రహదారి సిగ్నల్స్‌ పక్కనే రోడ్డుపై నిద్రపోతున్నాడు.. వాహనాల రద్దీ అధికంగా ఉంది. వాహనదారులు ఏమరుపాటుగా ఉంటే.. ప్రాణాలే పోవచ్చు. కానీ ‘సాక్షి’ చొరవ చూపింది. రోడ్డు నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, పెద్దపల్లి

మరిన్ని వార్తలు