కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మహాభారతం బహూకరణ

27 Mar, 2023 01:46 IST|Sakshi
మంత్రి కిషన్‌రెడ్డికి మహాభారత పర్వాలను అందిస్తున్న అన్నం మహిత, తండ్రి నరసింహారావు

కారంచేడు: మండలంలోని స్వర్ణ గ్రామానికి చెందిన సూక్ష్మకళాకారిణి అన్నం మహిత ఆదివారం కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డిని కలిసి తాను స్వయంగా తయారు చేసిన మహాభారతంలోని 18 పర్వాలు, 700 శ్లోకాలను పెన్సిల్‌ మొన (లిడ్స్‌)పై చెక్కి సిద్ధం చేసిన కళాకండాలను అందించారు. హైద్రాబాద్‌లోని బర్కత్‌పూర్‌లో మంత్రి కిషన్‌రెడ్డి క్యాంపు కార్యాలయానికి వెళి వాటిని బహూకరించారు. తాను మహాభారత 18 పర్వాలను పెన్సిల్‌ లిడ్స్‌పై లిఖించడాన్ని ప్రధాని నరేంద్రమోదీకి బహూకరించాలని ఉందని, ఆయన అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని విజ్ఞప్తి చేశానని మహిత సాక్షికి తెలిపింది. నైపుణ్యంతో పెన్సిల్‌ మొనలపై లిఖించిన సూక్ష్మ కళను చూసి ఆయన మహితను అభినందించారు. తప్పకుండా త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దగ్గరకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చినట్లు మహిత తెలిపింది. ఆమె వెంట ఆమె తండ్రి అన్నం నరసింహారావు ఉన్నారు.

మరిన్ని వార్తలు