AP Political News Jan 15th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

15 Jan, 2024 07:11 IST|Sakshi

AP Elections Political Latest Updates Telugu..

08:15 PM, Jan 15, 2024
చంద్రబాబుపై బైరెడ్డి సిద్దార్థ రెడ్డి సెటైర్లు..

  • చంద్రబాబు మోసాలను ప్రజలు గమనించాలి. 
  • అనైతిక పొత్తులతో కుట్రలు చేస్తున్నారు. 
  • సీఎం జగన్‌పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరిలకు అసూయ ఉన్నాయి
  • రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు లేదు
  • రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యేందుకు చంద్రబాబుకు నలుగురు ష్యూరిటీ ఇచ్చారు
  • టీడీపీ బాబు ష్యూరిటీ..భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు హాస్యాస్పదం

06:30 PM, Jan 15, 2024
ఎన్నికల వేళ పచ్చ బ్యాచ్‌తో జాగ్రత్త..

  • టీడీపీ పెయిడ్‌ బ్యాచ్‌ దిగింది.
  • ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. 
  • ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం
  • మౌత్‌ పబ్లిసిటీ కోసం టీడీపీ దొంగదారులు. 
     

04:40 PM, Jan 15, 2024
ప్రజాక్షేత్రంలోకి సీఎం జగన్‌

  • ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టడానికి సన్నద్ధమవుతున్న సీఎం వైఎస్ జగన్
  • 2024 ఎన్నికల సాంగ్‌ను విడుదల చేసిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా 
  • సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా పాట 
  • మాట ఇస్తే దాని కోసం ఎంత వరకైనా పోరాడే వ్యక్తే జగన్ అని పాటలో వివరణ
     

04:40 PM, Jan 15, 2024
ఆక్ పాక్ కరివేపాక్.. టీడీపీలో ఆ ఐదుగురికి చెక్‌

  • రఘురామరాజు, కోటంరెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి, శ్రీదేవి టికెట్‌లపై టీడీపీలో చర్చ
  • వీళ్లను భరించడం కష్టమని పార్టీ సీనియర్ల టాక్
  • ఒకవేళ టికెట్ ఇచ్చి గెలిచినా.. ఎన్నాళ్లుంటారో తెలియని పరిస్థితి అంటున్న సీనియర్లు
  •  టీడీపీలో సుదీర్ఘకాలం నుంచి ఉంటున్న నాయకులకే టికెట్లు ఇవ్వాలని పెరుగుతున్న డిమాండ్
  • అధికార పార్టీ తరిమేసిన వాళ్లకు మనం ఎందుకు టికెట్లు ఇవ్వడం అంటూ అభ్యంతరాలు
  • గద్దె రామ్మోహన్ రావు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి అయితే మంచిదంటున్న ఎమ్మెల్యే అభ్యర్థులు
  • అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలంటున్న టీడీపీ సీనియర్లు

04:00 PM, Jan 15, 2024
టీడీపీ పచ్చ కామెర్లకు మందు లేదు..

  • పచ్చ కామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. 
  • ప్రతీ విషయాన్ని తప్పుగా చూపే ప్రయత్ని టీడీపీది. 
  • పరనిందతో పగ్గం గుడుపుకునే పచ్చ బ్యాచ్‌ మరోసారి ఓవరాక్షన్‌
  • షూస్‌ వేసుకుని టెంకాయ కొట్టే వ్యక్తి చంద్రబాబు హిందూ సంప్రదాయం గురించి చెబుతున్నారు. 

03:45 PM, Jan 15, 2024
టాప్‌లో నిలిచిన ఏపీ

  • ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచిన ఏపీ
  • వరుసగా మూడో ఏడాది టాప్‌లో ఏపీ
  • కార్యరూపం దాల్చుతున్న గ్లోబర్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ ఒప్పందాలు
  • జీఎస్‌డీపీ వృద్ధిరేటులోనూ మనేమే టాప్‌

03:00 PM, Jan 15, 2024
ఊరు మారింది.. సామాన్యుడి కామెంట్స్‌

  • చంద్రబాబు హయాంలో పేదవాడిని పట్టించుకున్న నాథుడే లేడు
  • పేదవాళ్ల కోసమే పనిచేస్తున్న సీఎం జగన్‌
  • నేడు కార్పోరేట్‌ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానం.
  • పేదల ఇంటి వద్దకే ప్రభుత్వ వైద్య సేవలు
  • ఏపీలో పూర్తిగా మారిపోయిన స్కూల్స్‌
  • పండుగకు ఇంటికి వచ్చి స్కూల్స్‌ను చూసి పాత విద్యార్థుల భావోద్వేగం
  • ఇది కదా మార్పు అంటే అని సీఎం జగన్‌పై ప్రశంసలు
     

02:15 PM, Jan 15, 2024
గిడుగు రుద్రరాజు రాజీనామా

  • ఏపీ పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు రాజీనామా
  • కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గేకు రాజీనామా లేఖ పంపిన రుద్రరాజు
  • త్వరలోనే ఏపీకి కొత్త పీసీసీ చీఫ్‌ను నియమించనున్న ఏఐసీసీ

01:45PM, Jan 15, 2024

  • పెనమలూరులో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం:మంత్రి జోగిరమేష్
  • పార్టీ విజయానికి శక్తి వంచనలేకుండా కృషి చేస్తా
  • 90 శాతం ప్రజలు జగనన్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు
  • 2024 ఎలక్షన్‌లో 150 పైగా సీట్లు గెలుస్తాం
  • నియోజవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లి అందరిని కలుస్తున్నా
  • గతంలో కంటే అధిక మెజారిటీతో నియోజవర్గంలో గెలుస్తా

12:05AM, Jan 15, 2024
అందుకే పార్టీ పనులు చూసుకుంటున్నా: వైవీ సుబ్బారెడ్డి

  • ఒంగోలు లోక్‌సభకు పోటీ చేయనని సీఎం జగన్‌కు చాలాసార్లు చెప్పా
  • పోటీ చేసేవాడినే అయితే 2019లోనే పోటీ చేసేవాడ్ని
  • ప్రత్యక్ష రాజకీయాలకు గ్యాప్‌ రావడంతోనే పార్టీ పనులు చూసుకుంటున్నా
  • పోటీ విషయంలో జగన్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటా
  • సీనియర్‌ నేతలు పార్టీని వీడడానికి వాళ్ల వ్యక్తిగత కారణాలే
  • సీట్ల మార్పు విషయంలో జగన్‌ స్పష్టంగా ఉన్నారు
  • సిట్టింగ్‌లు అభ్యర్థులతో అడ్జస్ట్‌ కావడానికి కొంత సమయం పడుతుంది
  • త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి
  • బీసీలకు ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శ సరికాదు
  • కాంగ్రెస్‌తో షర్మిల చేరితో మాకు ఎలాంటి నష్టం లేదు
  • షర్మిలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసేదేమీలేదు

10:50AM, Jan 15, 2024
టీడీపీ – సేనకు బై..  వైఎస్సార్‌ సీపీకి జై

  • వైఎస్సార్‌సీపీలో చేరిన తూర్పు గోనగూడెంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు
  • వారికి  కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
  • ఇతర పార్టీల నుంచి అనేక మంది వైఎస్సార్‌సీపీలోకి వస్తున్నారు: జక్కంపూడి రాజా 
  •  ఎన్నికల తేదీ నాటికి నియోజకవర్గంలో ఈ చేరికలు మరింత ఎక్కువగా ఉంటాయి
  • ఆ రెండు పార్టీలూ దాదాపు ఖాళీ అయినా ఆశ్చర్యపడనవసరం లేదు
  • నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1,158 కోట్లతో అభివృద్ధి
  • రాష్ట్రంలో కుల మత వర్గ రాజకీయాలతో సంబంధం లేకుండా, అర్హతే ప్రామాణికంగా సీఎం జగన్‌ ప్రభుత్వం సంక్షేమం
     

10:00AM, Jan 15, 2024
రాజకీయాల్లో రఘురామ పాత్ర ముగిసినట్లేనా?

  • రఘురామను పట్టించుకోని జనం
  • ఎంపీగా గెలిచిన నాలుగేళ్ళ తరువాత   సొంత నియోజకవర్గం నర్సాపురం వచ్చిన రఘురామ
  • ఆయనకోసం ఎక్కడా ఎదురు పడని క్యాడర్‌, అభిమానులు
  • రాజకీయంగా అయన పాత్ర ముగిసినట్లేనా?
  • టీడీపీ అనుకూల మీడియాలో వ్యాఖ్యానాలు చేసుకోవడానికి మాత్రమే పనికొస్తారనే చర్చ.
  • కనీసం ఈసారి ఎమ్మెల్యే టికెట్‌ కూడా దక్కదని నరసాపురం ప్రజల మాట

09:00AM, Jan 15, 2024
చంద్రగిరిలో ఓట్లపై అపోహలొద్దు:ఆర్డీవో నిషాంత్‌రెడ్డి

  • 2019తో పోల్చుకుంటే ఐదేళ్లలో 17  వేల ఓట్లు పెరిగాయి
  • ఓటర్ల జాబితాను వందశాతం పారదర్శకంగా రూపొందిస్తున్నాం
  • చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకూ 105ఫిర్యాదులు
  • వీటికి రాజకీయ నేతలతో చర్చించి పరిష్కరించాం
  • ఓటర్ల జాబితాలో చిన్న పొరపాటు కూడా లేకుండా తనిఖీలు చేయడానికి 10 కమిటీలను ఏర్పాటు చేశాం

8:50AM, Jan 15, 2024
అమరావతిపై దత్తపుత్రుడి ప్రేమ!

  • అమరావతి నుంచే పాలన అంటున్న చంద్రబాబు అండ్‌ పవన్‌
  • సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న క్రమంలో వీరిద్దరి నోట.. అమరావతి మాట
  • అమరావతిపై తమకు ఇంకా ‘మోజు’ తగ్గలేదనే సంకేతాలు


8:30AM, Jan 15, 2024
ఆ ఇద్దరిది అపవిత్ర కలయిక ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌

  • చంద్రబాబు, పవన్‌ల కలయిక అత్యంత అపవిత్రమైనది
  • బాబు, పవన్‌లు పండుగలను సైతం రాజకీయం చేస్తున్నారు
  • 2014లో ఒక విధంగా వారు కలయిక జరిగితే, 2019లో కలిసి ఉండి మరో విధంగా విడిపోయారు
  • 2024లో మళ్లీ కలిసి తేడా రాజకీయాలు చేస్తున్నారు
  • 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు పాలన చూశాం
  • 2019 నుంచి సీఎం జగన్‌ పాలన కూడా చూశాం
  • ప్రజలు ఎవరిని తరిమేస్తారో 80 రోజుల్లోనే తేలనుంది
  • ఈసారి టీడీపీ, జనసేనలను ప్రజలు భోగి మంటల్లో వేస్తారు


8:15AM, Jan 15, 2024
నా ప్రాణానికి ఏదైనా జరిగితే లోకేశ్‌దే బాధ్యత: రాయపాటి రంగారావు

  • తనను కిరాయి మూకలతో హతమార్చేందుకు టీడీపీ రూ.50 లక్షల  చందాలు  వసూలు చేసింది
  • దీనిపై గుంటూరు ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేశా
  • ఈనెల 13న గుంటూరు రీజినల్‌ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు వచ్చిన క్రమంలో ఈ చందాలు వసూలు చేశారు
  • వైజాగ్‌ నుంచి ఓ వ్యక్తి ఫోన్‌ చేసి , చంద్రబాబుపై విమర్శలు మానుకోవాలని బెదిరించారు
  • లేకపోతే అంతు చూస్తామని బెదిరించారని చెప్పారు


7:52AM, Jan 15, 2024
రాజ్యసభలో టీడీపీ అడ్రస్‌ గల్లంతే..

  • ఏప్రిల్‌ 2తో పూర్తికానున్న టీడీపీ సభ్యుడు ‘కనకమేడల’ పదవీకాలం
  • వైఎస్సార్‌సీపీ సభ్యుడు వేమిరెడ్డి, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్‌ల పదవీకాలం ముగిసేదీ అప్పుడే
  • రాష్ట్ర కోటాలో ఖాళీ అయ్యే ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి ఆఖరు లేదా మార్చిలో ఎన్నికలు
  • అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఈ మూడూ వైఎస్సార్‌సీపీ ఖాతాలోకే
  • దీంతో రాష్ట్ర కోటాలోని 11 స్థానాలు వైఎస్సార్‌సీపీ పరం
  • చివరికి రాజ్యసభలో ఉనికే లేకుండాపోనున్న టీడీపీ
  • 41 ఏళ్లలో టీడీపీకి రాజ్యసభలో సభ్యత్వం లేకుండాపోవడం ఇదే తొలిసారి

07:10AM, Jan 15, 2024
రేపు బాబుకి జడ్జిమెంట్‌ డే

  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో 16న సుప్రీం కోర్టు తీర్పు!
  • స్కిల్‌ కేసులో అరెస్ట్‌ అయ్యి 52 రోజలు జైల్లో ఉన్న చంద్రబాబు
  • మధ్యాహ్నాం ఒంటి గంటకు తీర్పు వెల్లడించిన ద్విసభ్య ధర్మాసనం
  • 17ఏ తనకు వర్తిస్తుందని చంద్రబాబు వాదన
  • వర్తించదని ఏపీ సీఐడీ వాదనలు
  • వాదనలు విని.. తీర్పు రిజర్వ్‌ చేసిన బెంబ్‌​

07:05AM, Jan 15, 2024
ఇది కదా అసలైన అభివృద్ధి

  • జగనన్న పాలనలో మన ఊరు మారింది..  
  • ఏపీ ప్రజల జీవితాలు మారాయి
  • అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి
  • ఊరు.. జిల్లా.. మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందింది
  • ఇది కదా అసలైన అభివృద్ధి అంటే..!  

07:00AM, Jan 15, 2024
బలం సరిపోవట్లేదు.. బీజేపీ కావాలి

  • చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీలో ప్రధానంగా బీజేపీని ఒప్పించడంపై చర్చ
  • ప్రస్తుతం తమకున్న బలం పూర్తిస్థాయిలో ఓట్లు కురిపించలేదని ఒక నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు-పవన్
  • ఢిల్లీకి వెళ్లి బీజేపీని ఒప్పించే బాధ్యతను పవన్ కళ్యాణ్‌కు అప్పగించిన చంద్రబాబు
  • అడిగినని ఎంపీ సీట్లు ఇచ్చేందుకు తాము సుముఖంగా ఉన్నట్టు చెప్పాలని సూచించిన చంద్రబాబు
  • ఈసారి పొత్తు తర్వాత నమ్మకంగా ఉంటామని ఢిల్లీ పెద్దలకు హామీ ఇవ్వాలని సూచన
  • ఉమ్మడి మేనిఫెస్టో కు సిద్ధమని అలాగే బిజెపి సూచించే అంశాలను కూడా అందులో పెట్టేందుకు రెడీ అని అంగీకారానికి వచ్చిన చంద్రబాబు
  • పొత్తుకు బీజేపీ ఓకే అంటే మొదటి జాబితాలోనే బీజేపీ నేతల పేర్లు ప్రకటించేందుకు సిద్ధమంటున్న చంద్రబాబు
  • ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు వస్తే.. ఉమ్మడి సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలనే దానిపై చర్చ 
  • ఎన్నికల సమీపిస్తున్నాయి ఇక మ్యానిఫెస్టో తొందరగా విడుదల చేయాలని చర్చ
  • ఈ నెలలోనే కనీసం మినీ మేనిఫెస్టో విడుదల చేయాలని లక్ష్యం
  • వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటుపై తెలుగుదేశం జనసేన మధ్య కొలిక్కిరాని చర్చలు

whatsapp channel

మరిన్ని వార్తలు