AP Political News Jan 24th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

24 Jan, 2024 07:03 IST|Sakshi

AP Elections Political Latest Updates Telugu..

7:44 PM, Jan 24, 2024
ఉత్తరాంధ్రలో అభివృద్ధి షర్మిలకు కనిపించడం లేదా?: వైవీ సుబ్బారెడ్డి

  • షర్మిలకు మేము చేసిన అభివృద్ధి చూపించడానికి సిద్ధం
  • ఉద్ధానంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది ఎవరు?
  • చంద్రబాబు చూపించారా.. కాంగ్రెస్ పార్టీ చూపించిందా..?
  • ఏళ్ల తరబడి ఉద్దానంలో ఉన్న సమస్యకు సీఎం జగన్ పరిష్కారం చూపించారు
  • చంద్రబాబు జనసేన మేనిఫెస్టోను ప్రజలు ఎవరూ నమ్మరు
  • మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచి తొలగించిన ఘనుడు చంద్రబాబు
  • చంద్రబాబు ఎన్ని హామీలు అమలు చేశారో ప్రజలందరికీ తెలుసు
  • రాజీనామా చేసే ముందు గంటా ఆలోచించుకోవాలి
  • రాజీనామా చేసిన తర్వాత ఎప్పుడు ఆమోదిస్తే గంటాకు ఎందుకు?
  • స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి ఇప్పుడు గంటా గగ్గోలు పెడితే ఎలా?
  • రాజధానిపై గ్రాఫిక్స్ చూపించిన చంద్రబాబు గురించి ఎందుకు షర్మిల మాట్లాడటం లేదు?
  • విశాఖ రాజధాని కాకుండా కోర్టులో కేసులు వేసింది చంద్రబాబే
  • అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది చంద్రబాబు కాదా?

7:13 PM, Jan 24, 2024
తిరిగి మేం అధికారంలోకి రావడం ఖాయం: సీఎం జగన్‌ 

  • నా వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నా
  • తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం
  • విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చాం
  • వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించాం
  • మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చాం
  • మా ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు నిదర్శనం ఇది:
  • కాంగ్రెస్‌ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్‌ ఆడుతుంది
  • విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు
  • రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు
  • అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు

7:05 PM, Jan 24, 2024
ఇది మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత: సీఎం జగన్‌

  • ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం
  • వివక్ష లేకుండా, అవినీతి లేకుండా అర్హత ఉన్నవారికి డీబీటీ ద్వారా పథకాలు అందించాం
  • డీబీటీ అన్నది ఒక విజయవంతమైన అంశం
  • అయితే విద్య, వైద్యం, మహిళా సాధికారితల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం
  • అన్నిటికంటే మించి వివక్ష లేకుండా పారదర్శకతతో ప్రత్యక్ష నగదు బదిలీ అమలు చేశాం
  • కచ్చితంగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం
  • ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు,
  • వాటి అమలు గురించీ కూడా విపక్షాలు మాట్లాడలేవు
  • ఇదే బడ్జెట్‌ గతంలోనూ ఉంది..ఇప్పుడూ ఉంది
  • కాని మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు
  • కాని ఈ ప్రభుత్వం మాత్రమే ఇవన్నీ చేయగలిగింది
  • చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది నాకు లేనే లేదు
  • చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరింది
  • ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్‌ విధించింది
  • అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుంది.?
  • సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా?
  • వాటిని చూసి కన్విన్స్‌ అయితేనే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి
  • రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల ఉనికి పెద్దగా లేదు
  • పోటీ మా పార్టీకి, టీడీపీ- జనసేన కూటమికి మధ్యే ఉంటుంది
  • ప్రతి పార్టీ కూడా సర్వేలు చేస్తుంది
  • వాటి ఫలితాల ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తుంది
  • ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు
  • కాని కొందరు స్థానిక నాయకుల విషయంలో ప్రజలకు కొంత అసంతృప్తి ఉంది
  • అంతేకాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కొన్ని మార్పులు చేశాం
  • చివరిదశలో మార్పులు చేసి అయోమయం సృష్టించే కన్నా, ముందుగానే నిర్ణయిస్తున్నాం
  • జాతీయ రాజకీయాలు విషయంలో మా విధానం స్పష్టం:
  • రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేం రాజీపడబోం
  • ప్రజల ప్రయోజనాల విషయంలోనే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్తున్నాం:
  • కాంగ్రెస్‌ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్‌ ఆడుతూ ఉంటుంది
  • అది ఆ పార్టీ సంప్రదాయంగా గమనిస్తున్నాం
  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు
  • విభజించి రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పాలించాలనుకుంది
  • అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు
  • నేను కాంగ్రెస్‌నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్నకు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు
  • వారు పాఠాలు నేర్వలేదు
  • కాంగ్రెస్‌ పార్టీ ఏపీ సారథ్య బాధ్యతలు మా సోదరికి ఇచ్చారు
  • కాని అధికారం అనేది దేవుడు ఇచ్చేది
  • దేవుడ్ని నేను బలంగా నమ్మతాను ఆయనే అన్నీ చూస్తాడు

6:08 PM, Jan 24, 2024
సీఎం జగన్‌ పాలనలో ఏపీ సుభిక్షంగా ఉంది: మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు

  • మన రాష్ట్రంలో పేదరికం గతంలో 12 శాతం ఉండేది.. జగన్ సీఎం అయ్యాక 6 శాతానికి తగ్గింది. 
  • చంద్రబాబు హయాంలో మనరాష్ట్ర  విద్యా వ్యవస్థ 15 స్థానంలో ఉండేది 
  • సీఎం జగన్ ఏపీ విద్యా వ్యవస్థను మూడో స్థానానికి తీసుకొచ్చారు 
  • పేదవారి పిల్లలు కూడా ఉన్నతమైన ఉద్యోగాల్లో చూడాలన్నదే సీఎం జగన్ ధ్యేయం  
  • జగన్‌ను రాష్ట్రంలో అందరు తమ కుటుంబ సభ్యుడుగా భావిస్తున్నారు 
  • షర్మిలకు ఏపీలో సంక్షేమం, అభివృద్ధి కనిపించడం లేదు  
  • షర్మిలమ్మా... గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి మీ అన్న జగన్
  • గడప వద్దకే సంక్షేమ ఫలాలు  అందిస్తున్న వ్యక్తి మీ అన్న జగన్ అని తెలుసుకో..
  • నాలుగున్నరేళ్ల తరువాత ఇక్కడకొచ్చి  విమర్శించడం సరికాదు
  • షర్మిల.. టీడీపీ వాళ్లు రాసిచ్చిన రాతలు మాట్లాడుతున్నారు

5:17 PM, Jan 24, 2024
విజయవాడ సెంట్రల్ లో వంగవీటి రాధా వర్సెస్ బోండా ఉమా

  • విజయవాడలో వంగవీటి రాధా, బోండా ఉమా వర్గాల మధ్య సోషల్ మీడియా వార్
  • వంగవీటి రాధాను టీడీపీ నమ్మడంలేదంటూ 3 రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్టులు 
  • ఈ పోస్టుల వెనుక ఉమా వర్గీయులే ఉన్నారని రాధా వర్గం ఆరోపణ 
  • తాజాగా బోండా ఉమా టార్గెట్ గా సోషల్ మీడియాలో కౌంటర్ పోస్టులు 
  • రాధా వర్గమే చేసినట్లుగా భావిస్తున్న బోండా ఉమా వర్గం 
  • నమ్మాలంటే ఏం చేయాలంటూ ఉమాకు వ్యతిరేకంగా కౌంటర్ పోస్టులు వైరల్

5:05 PM, Jan 24, 2024
విశాఖ: ఈనెల 27న భీమిలిలో వైఎస్ఆర్ సీపీ బహిరంగ సభ

  • ఏర్పాట్లను పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి, తలశిల రఘురాం, మంత్రి అమర్నాథ్ 
  • బహిరంగ సభ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి 
  • బహిరంగ సభలో సీఎం జగన్ దిశానిర్ధేశం చేస్తారు 
  • బహిరంగ సభకు సుమారు 2 లక్షల మంది హాజరవుతారని భావిస్తున్నాం
  • భీమిలి సభతో పాటు రాష్ట్రంలో మరో 4 సభలు నిర్వహిస్తాం: వైవీ సుబ్బారెడ్డి

4:21 PM, Jan 24, 2024
గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

  • గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణుల ఓవరాక్షన్
  • సీఎం జగన్ పై అసభ్య పోస్టులు పెట్టిన NRI, టీడీపీ కార్యకర్త యశస్వి 
  • NRI యష్ కోసం వచ్చిన తెలుగు యువత విద్యార్థి నేతలు 
  • అనుమతి లేదని అడ్డుకున్న సీఐడీ పోలీసులు 
  • సీఐడీ పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం 
  • సీఐడీ అధికారులను దూషించిన టీడీపీ నాయకులు

3:49 PM, Jan 24, 2024
శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు 

  • నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీ దేవి వర్గం.. టిక్కెట్ ఆశావాహ అభ్యర్థి  గోండు శంకర్ మధ్య వివాదం
  • నియోజకవర్గ ఇంచార్జ్‌కి  తెలియకుండా.. శ్రీకాకుళం పట్టణంలో.. ఇంటింటికి శంకరన్న కార్యక్రమం ప్రారంభించిన గొండు శంకర్ 
  • గొండు శంకర్‌ను అడ్డుకున్న టీడీపీ పట్టణ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, పట్టణ టీడీపీ నేతలు 
  • పట్టణ టీడీపీకి సమాచారం లేకుండా పార్టీ కార్యక్రమం ఏంటంటూ  గొండు శంకర్‌ని నిలదీసిన టీడీపీ నేతలు 
  • సొంత కార్యక్రమం ఏదైనా ఉంటే  పార్టీ జెండా లేకుండా చేయాలంటూ  గొండ శంకర్‌కు చెప్పిన టీడీపీ నేతలు 
  • టీడీపీ నేతలు నిరసనతో వెనుదిరిగిన గొండు శంకర్

3:37 PM, Jan 24, 2024
టీడీపీ హయాంలో పథకాలు కొందరికే దక్కేవి: సజ్జల రామకృష్ణారెడ్డి

  • వైఎస్సార్ ఆశయాలు.. ఆలోచనలకు అనుగుణంగా పెట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ
  • అణగారిన వర్గాలతో అసోసియేట్ అవ్వడమే ప్రధాన లక్ష్యం
  • సీఎం జగన్‌.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారు
  • పథకాలు, సంస్కరణల్లో సీఎం జగన్‌ బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారు
  • అణగారిన వర్గాలనుపైకి తీసుకువచ్చే ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల భాగస్వామ్యం కావాలి
  • గత ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల కోసం ఖర్చు చేసిందేమీ లేదు
  • సంపన్నులతో పోటీ పడే స్థాయికి అన్ని వర్గాలనూ తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్‌కే దక్కింది
  • సచివాలయ ఉద్యోగాల్లో 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే దక్కాయి
  • మేనిఫెస్టోలో లేనివి కూడా సీఎం జగన్‌ అమలు చేశారు
  • టీడీపీ హయాంలో పథకాలు కొందరికే దక్కేవి. సీఎం జగన్‌ అర్హులైన వారిని వెతికి మరీ ఇచ్చారు
  • ఈ నాలుగున్నరేళ్లలో జరిగినంత సంక్షేమం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరగలేదు
  • ఎన్నికలు రాబోతున్నాయ్‌. మీ భవిష్యత్తులు మారాలంటే.. మీరంతా ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  • ఏ చిన్న తేడా జరిగినా పేదలకు జరుగుతున్న మంచి దూరమైపోతుంది
  • మీడియాను మేనేజ్‌ చేస్తే సరిపోతుందని కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి
  • ఏమీ జరగడం లేదని ప్రచారం చేస్తున్నారు.
  • ప్రభుత్వం చేస్తున్న మంచికి.. అభివృద్ధికి పబ్లిసిటీ అవసరం లేదని సీఎం భావించారు
  • కొత్తగా రూపుదిద్దుకుంటున్న పోర్టులు రాష్ట్రం రూపురేఖలు మార్చేస్తాయి
  • 11 మెడికల్ కళాశాలల ద్వారా  దేశానికి కావాల్సిన వైద్యులను ఏపీ అందించబోతోంది
  • అంబేద్కర్‌కు హిమాలయాలంత విగ్రహం పెట్టినా సరిపోదు
  • అంతర్జాతీయ స్థాయిలో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం రూపుదిద్దుకుంది
  • అంబేద్కర్ విగ్రహం గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకుంటుంది
  • అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తుంది. విజయవాడలో కొండ పై అమ్మవారు.. కొండ కింద అంబేద్కర్ కనిపిస్తారు
  • దళితుల నుంచి మరింత మేధావులు రావాలనేదే సీఎం జగన్‌ ఆలోచన
  • ఆయన చేపట్టిన యజ్ఞంలో మీరంతా భాగస్వామ్యం కావాలని కోరుతున్నా

2:51 PM, Jan 24, 2024
మండపేట టీడీపీలో అసమ్మతి

  • రాజమండ్రిలో ఓ హోటల్లో సమావేశమైన మండపేట టీడీపీ సీనియర్ నేతలు.
  • సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు వ్యతిరేకంగా అంతర్గత సమావేశం
  • తమతో సంప్రదించకుండా మండపేట ఎమ్మెల్యే స్థానానికి జోగేశ్వరరావు పేరు చంద్రబాబు బహిరంగ సభలో ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్న నేతలు
  • క్యాండిట్ నిర్ణయించే ముందు మా నిర్ణయం కూడా తీసుకోవాలి లేదంటే పార్టీ నష్టపోతుంది
  • ఇప్పటివరకు నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అంటే  అది మావల్లే
  • అధిష్టానం నిర్ణయాన్ని మార్చుకోవాలి
  • నియోజకవర్గంలో జోగేశ్వరరావుతో పాటు జనసేన లీలా కృష్ణ కూడా ఉన్నాడు
  • నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు మమ్మల్ని గౌరవించడం లేదు
  • స్థానిక ఎమ్మెల్యేకి క్యాడర్ మీద గౌరవం లేదు నమ్మకం లేదు
  • రాజమండ్రిలో అంతర్గతంగా సమావేశమై భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తున్నాం: టీడీపీ సీనియర్ నేత బాలకృష్ణ

2:42 PM, Jan 24, 2024
షర్మిల దుష్టశక్తుల ట్రాప్‌లో పడింది: ఎంపీ మిథున్‌రెడ్డి

  • జగనన్న చెల్లెలుగా షర్మిలపై గౌరవం ఉంది
  • వైఎస్సార్‌ పేరు ఎఫ్ఐఆర్‌లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ
  • నాడు షర్మిల కాంగ్రెస్‌ పార్టీని తప్పుపట్టారు
  • రాజశేఖర్ రెడ్డి పేరు ఎఫ్ఐఆర్‌లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ
  • 16 నెలలు అన్నను జైల్లో పెట్టిన పెట్టిన పార్టీకి కొమ్ము కాస్తుంది
  • చంద్రబాబు లైన్‌లోనే షర్మిల మాట్లాడుతుంది
  • షర్మిలను చూస్తే జాలి వేస్తుంది
  • మణిపూర్  ఘటనలపై పార్లమెంట్‌లో బీజేపీని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నిలదీసింది
  • గత ఐదేళ్ల పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ జగనన్న నెరవేర్చారు
  • మేము మీకు మేలు చేసి ఉంటేనే ఓటు వేయండి అని ధైర్యంగా చెబుతున్నారు జగనన్న.
  • ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాలు కలిపి ఎన్నికల సన్నాహక సభ ఏలూరులో నిర్వహించబోతున్నాం
  • చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాకు సముచిత స్థానం కల్పిస్తాము
  • ఎమ్మెల్యే పార్టీ లైను దాటి ఎప్పుడు ప్రవర్తించలేదు

1:45 PM, Jan 24, 2024
ఇది సీఎం జగన్‌ పాలన అంటే..

  • తెలంగాణలో ప్రభుత్వ పథకాల కోసం ఆధార్‌ సెంటర్ల వద్ద ప్రజల ఇబ్బందులు
  • కానీ, ఏపీలో మాత్రం గడప వద్దకే ప్రభుత్వ పథకాలు
  • వలంటీర్ల సాయంతో తీరిన ఇబ్బందులు

1:35 PM, Jan 24, 2024
ఈనాడుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైర్

  • ఈనాడు పత్రికపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైర్
  • కావాలనే ఎల్లో మీడియా నాపై అసత్య ప్రచారం చేస్తోంది
  • ధర్మవరం ప్రజల సమస్యల్ని తీర్చేందుకు గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేపట్టాను
  • భూకబ్జాలు, సెటిల్మెంట్ ఇసుక దందా ఆరోపణలు అవాస్తవం
  • అధికారికంగా భూమి కొనుగోలు చేసి ఫాం హౌస్ నిర్మిస్తే తప్పేంటి?
  • పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరీ ర్యాలీలు పొలిటికల్ స్టంటే
  • రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వెళ్లటం హాస్యాస్పదం
  • వైఎస్ఆర్ పేరును సీబీఐ ఎఫ్ఐఆర్‌లో చేర్చిన విషయం షర్మిలకు గుర్తులేదా?
  • చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగంగానే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

1:28 PM, Jan 24, 2024
ఎమ్మెల్యే టికెట్‌ నాదంటే దేహశుద్ధి చేస్తాం

  • కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు 
  • ఆలూరు నియోజకవర్గం టీడీపీలో కోవర్టులు ఎక్కువగా ఉన్నారు
  • ఆలూరు టీడీపీ టికెట్ ఆశావాధులపై సంచలన వ్యాఖ్య లు చేసిన టీడీపీ యువ నాయకుడు కోట్ల రఘురెడ్డి
  • ఎమ్మెల్యే టికెట్ నాదే అని ప్రచారం చేసుకుంటే దేహశుద్ధి చేస్తాం
  • ఎమ్మెల్యే టికెట్  కోట్ల సుజాతమ్మ దే
  • కొందరికి రాజకీయం అంటే నాలుగు చావులు, ఆరు పెళ్లిళ్లు కాదు

1:00 PM, Jan 24, 2024
విశాఖ వెస్ట్ టీడీపీలో ముసలం

  • ఎమ్మెల్యే గణబాబుకు తిరిగి టికెట్ ఇవ్వరాదంటూ సొంత పార్టీ కార్యకర్తల ఫిర్యాదు
  • టీడీపీ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు కార్యకర్తలు ప్రజల సమస్యలపై పనిచేయడం లేదు
  • ప్రజా సమస్యలు పట్టించుకోకుండా బడా షోరూం కట్టుకున్న నాయకుడు గణబాబు
  • జనాభా ప్రాతిపదికగా ఈ సీటు కాపులు లేదా యాదవులకు కేటాయించాలని డిమాండ్‌

12:40 PM, Jan 24, 2024
భువనేశ్వరీకి మళ్లీ గుర్తొచ్చిన నిజం

  • తూర్పుగోదావరి జిల్లాలో ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి పర్యటన
  • చంద్రబాబు అరెస్టుకు మనస్తాపంతో చనిపోయారంటూ ప్రచారం
  • బాధితుల కుటుంబాలకు పరామర్శ అంటూ భువనేశ్వరి పర్యటనలు
  • జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో పడాల వీరబాబు కుటుంబానికి పరామర్శ 
  • వీరబాబు కుటుంబానికి రూ.3 లక్షల చెక్కు అందించిన భువనేశ్వరి 

12:15 PM, Jan 24, 2024
దమ్ముంటే పోటీ చేయొచ్చు కదా బుచ్చయ్య?

  • రాజ్యసభ ఎన్నికలపై గోరంట్ల బుచ్చయ్య ఓవరాక్షన్‌
  • రాజ్యసభకు అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీ ఎమ్మెల్యేలే మమ్మల్ని అడుగుతున్నారంటూ అబద్దాలు
  • అభ్యర్థిని నిలబెడితే టీడీపీకి ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు మాతో సంప్రదిస్తున్నారంటూ చెత్త కామెంట్స్‌
  • బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీలో విస్మయం
  • అసెంబ్లీ టికెట్‌కే దిక్కులేని బుచ్చయ్యకు రాజ్యసభ మీద దృష్టి పడిందా?
  • ప్రస్తుతమున్న అసెంబ్లీలో ఏం బలముందని టీడీపీ అభ్యర్థిని పెడుతుంది?
  • ఎన్నికల వేళ ఓడే సీటు కోసం ఎవరైనా పోటీ చేస్తారా?


ఆర్కే పోటీ చేసే స్ధానం త్వరలో తెలుస్తుంది: మాణిక్కం ఠాగూర్‌

  • కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాలకు అభ్యర్ధులను నిర్ణయిస్తుంది
  • ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉంది
  •  అప్లికేషన్లు మధుసూధన్ మిస్త్రీ ఆధ్వర్యంలోని స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తుంది
  • నిజమైన కాంగ్రెస్‌లోకి మాజీలు రావాలని పిలుస్తున్నాం
  • ఆర్కే పోటీ చేసే స్ధానం త్వరలో తెలుస్తుంది
     

12:00 PM, Jan 24, 2024
ఏపీలో కాంగ్రెస్‌ అభ్యర్థుల అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం

  • కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అభ్యర్ధులకు అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం
  • అభ్యర్ధుల నుంచి అప్లికేషన్లు స్వీకరించిన మాణిక్కం ఠాగూర్
  • మొదటి అప్లికేషన్ మడకశిర నుంచి సుధాకర్
  • రెండవ అప్లికేషన్ గుంటూరు తూర్పు నుంచి మస్తాన్ వలీ
  • మూడవ అప్లికేషన్ బద్వేల్ నుంచి కమలమ్మ

11: 40 AM, Jan 24, 2024
అక్కడ పోటీ చేయాలంటే బాబు, లోకేశ్‌కు భయం: వెల్లంపల్లి

  • సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు లేదు
  • చంద్రబాబు, లోకేష్, పవన్‌లు ఏ ప్రాంతం నుండి పోటీ చేస్తారో వారికే తెలియదు
  • చంద్రబాబుకు కుప్పంలో పోటీ చేయాలంటే భయం
  • లోకేశ్‌కు మంగళగిరిలో పోటీ చేయాలంటే భయం
  • పవన్‌కు గాజువాకలో పోటీ చేయాలంటే భయం
  • సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఆరు అడుగుల వ్యక్తి ఒకడున్నాడు
  • బోండా ఉమా ఎందుకు పనికిరాడు..
  • బద్ధకానికి నిలువెత్తు నిదర్శనం బోండా ఉమా
  • బోండా ఉమాకి దమ్ముంటే సెంట్రల్ నియోజకవర్గంలో నాతో పాటు పర్యటించాలి
  • రోడ్డు మీద ధర్నాలు పెట్టి పదిమంది సన్నాసులను వేసుకుని తిరుగుతున్నాడు.
  • బోండా ఉమా లాంటి పెత్తందారుల పరిపాలన ప్రజలకు అవసరం లేదు.
  • సీఎం జగన్ సంక్షేమ పథకాలు మా పార్టీకి శ్రీరామరక్ష.

11:15 AM, Jan 24, 2024
అభివృద్ధి అంటే గ్రాఫిక్స్ కాదు: దేవినేని అవినాష్‌

  • ప్రజా సమస్యల పరిష్కారమే సీఎం జగన్ ప్రభుత్వ అజెండా
  • అభివృద్ధి అంటే గ్రాఫిక్స్ కాదు
  • రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిని గ్రాఫిక్స్‌లో చూపించింది చంద్రబాబే
  • అభివృద్ధి అంటే ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన
  • డివిజన్‌లోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలు పూర్తి చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది
  • కళ్లుండి కూడా చూడలేని గుడ్డివారే రాష్ట్ర అభివృద్ధిపై ప్రశ్నిస్తారు
  • రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గాన్ని మౌలిక సదుపాయాలతో మా ప్రభుత్వం అభివృద్ధి చేసింది
     

10:00 AM, Jan 24, 2024
సీఎం జగన్‌కే మా ఓటు..

  • సీఎం జగన్‌ హయాంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి
  • తెల్లవారుజామునే పెన్షన్‌లు ఇస్తున్నారు. 
  • మంచి చేసే సీఎం జగన్‌కే ఓటు వేస్తాం
  • చంద్రబాబు, పవన్‌ను మేము నమ్మం: సామాన్యులు

8:15AM, Jan 24, 2024
పక్క రాష్ట్రం నాయకులే చంద్రబాబుకు స్టార్‌ క్యాంపెయినర్లు: సీఎం జగన్‌

  • చంద్రబాబు సీఎం జగన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌
  • పక్క రాష్ట్రంల నాయకులే చంద్రబాబుకు స్టార్‌ క్యాంపెయినర్లు
  • పథకాలు అమలు చేయకపోయినా, అభివృద్ధి జరగకపోయినా బాబుకు భజన చేసేందుకు రెడీ అయ్యారు
  • ప్రజలను దోచుకున్నా పట్టించుకోలేదు. 

7:43 AM, Jan 24, 2024
టీడీపీలో విజయవాడ సెంట్రల్‌ వార్‌

  • విజయవాడలో వంగవీటి రాధా, బోండా ఉమా వర్గాల మధ్య సోషల్‌ మీడియా వార్‌
  • టీడీపీ సెంట్రల్‌ సీటు విషయంలో ఇరు వర్గీయుల మధ్య ముదురుతున్న పోరు
  • సోషల్‌ మీడియాలో పోటాపోటీగా వ్యతిరేక పోస్టులు
  • వంగవీటి రాధను టీడీపీ నమ్మడం లేదంటూ మూడు రోజుల కిందటే సోషల్‌మీడియాలో పోస్టులు
  • ఈ పోస్టుల వెనుక ఉమా వర్గీయులే ఉన్నారంటూ రాధా వర్గం ఆరోపణ 
  • తాజాగా బోండా ఉమా టార్గెట్‌గా కౌంటర్‌ పోస్టులు
  • నమ్మాలంటే ఏం చేయాలంటూ ఉమాకు వ్యతిరేకంగా కౌంటర్‌ పోస్టులు వైరల్‌
  • రాధా వర్గమే చేసినట్లు భావిస్తున్న బోండా ఉమా వర్గం
  • ఉమా, రాధా వర్గాల కోల్డ్‌ వార్‌తో హీటకెక్కిన రాజకీయం

7:10 AM, Jan 24, 2024
చంద్రబాబు స్క్రిప్ట్‌ చదువుతున్న షర్మిల..

  • సీఎం జగన​ అధికారంలోకి వచ్చాక మొదట ఫోకస్‌ చేసింది రాజధానిపైనే.
  • కానీ, కోర్టుల చుట్టూ తిరుగుతూ వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ అడ్డుకుంది చంద్రబాబే. 
  • పోలవరానికి సంబంధించి సీఎం జగన్‌ వచ్చిన తర్వాతే 10,720 కుటుంబాలకు పునరావాసం.
  • చంద్రబాబు కమీషన్లు కోసం పోలవరంలో ఘోర తప్పిదాలు.
  • చంద్రబాబు చేసిన అన్నీ ఇన్నీ కావు. 

7:00 AM, Jan 24, 2024
పీకే క్లారిటీ.. పచ్చ బ్యాచ్‌ గుండె బద్దలు

  • నిజంగా పచ్చ బ్యాచ్‌ గుండె బద్ధలయ్యే వార్త ఇది
  • వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ తమ పార్టీతో పని చేస్తారని ఎల్లో బ్యాచ్‌ గంపెడు ఆశలు
  • చంద్రబాబుతో కలిసి పని చేసేది లేదని కుండబద్ధలు కొట్టేసిన పీకే
  • చంద్రబాబు, లోకేష్‌తో పీకే భేటీ కావడాన్ని బాహుబలి, కేజీఎఫ్‌ రేంజ్‌లో ఎలివేషన్స్‌ ఇచ్చుకుంటూ వస్తోంది ఎల్లో మీడియా
  • ఈ మేరకు బాబు కోసం.. టీడీపీ కోసం పీకే పని చేస్తారని.. ప్రస్తుతం చర్చలు కూడా జరుగుతున్నాయంటూ ఊహాజనిత కథనాలు
  •  తాజాగా ఓ ఫేస్‌ టు ఫేస్‌ ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ కిషోర్‌ దీనిపై స్పష్టత
  • చంద్రబాబు తన కోసం ఎన్నికల్లో పని చేయమని అడిగాడు.. అందుకు తాను కుదరదని చెప్పా

6:55 AM, Jan 24, 2024
సైకిలెక్కితే సైడ్‌ట్రాకే!

  • టీడీపీలో చేరి చతికిలపడ్డ ‘సీమ’ హేమాహేమీలు..
  • కోట్ల, భూమా కుటుంబాలకు గెలుపు పూర్తిగా దూరం
  • గౌరు, బుడ్డాతో పాటు వరదరాజులరెడ్డి, ఆదినారాయణరెడ్డి పరిస్థితీ అంతే
  • టీడీపీని నమ్మి చేరిన పలువురికి టికెట్‌ నిరాకరణ
  • ఒకప్పుడు సీమ రాజకీ­యాల్లో పేరొందిన ఆ రాజకీయ నేతలు
  • చంద్ర­బాబు పంచన చేరి వంచనకుగురై చతికిలప­డ్డారు
  • సైకిలెక్కి తప్పుచేశామని, బాబు నిండాముంచేశా­రని తెరవెనుక గగ్గోలు
  • కోట్ల.. భూమా.. గౌరు.. బుడ్డా కుటుంబాలకు చెందిన రాజ­­కీయ నాయకులతోపాటు నంద్యాల వరద­రాజు­­లరెడ్డి, దేవగుడి ఆదినారాయణరెడ్డి ఒక­ప్పుడు కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలో బలమైన నేతలు
  • చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మి టీడీపీలో చేరితే ‘సీమ’ రాజకీయాల్లో తెరమరుగయ్యే స్థితికి చేరారు
  • చంద్రబాబును నమ్మి వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మరికొంతమంది కనీసం టికెట్‌ దక్కించుకోలేక మోసపోయారు
  • వీరిలో కొందరు తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు
  • చంద్రబాబు మోసం గ్రహించి ‘సీమ’లో టీడీపీ పని ఖతమైందని తెలుసుకున్న కొందరు..
  • ఆ పార్టీలో ఉండి ఓడిపో­వ­డం కంటే మౌనంగా ఉండటం మంచిదనే నిర్ణయా­నికి వచ్చారు
  • ఈసారి తాము కోరిన టికెట్‌ ఇవ్వక­పోతే పోటీనుంచి తప్పుకోవాలనే భావనలో మరికొందరు

6:45 AM, Jan 24, 2024

స్కిల్‌ స్కాం కేసు.. ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా

  • స్కిల్‌ స్కాం కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో విచారణ ఈనెల 29కి వాయిదా 
  • స్కిల్‌ స్కాం కేసులో అప్రూవర్‌గా మారతానన్న ఏసీఐ ఎండీ శిరీష్‌ చంద్రకాంత్‌ షా
  • చంద్రకాంత్‌ షా పిటిషన్‌పై విచారణ అనంతరం వాయిదా వేసిన కోర్టు.
  • చంద్రకాంత్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ను వాయిదా వేసిన ఏసీబీ కోర్టు. 
  • కౌంటర్‌ దాఖలు సమయం అడిగిన చంద్రబాబు లాయర్లు. 
  • స్కిల్‌ కేసులో బాబుకు అత్యంత సన్నిహితుడైన ఏ-22 యోగేష్‌ గుప్తా నిధుల తరలింపులో కీలక పాత్ర 

6:40 AM, Jan 24, 2024
లోకేష్ అరెస్టుకు అనుమతి కావాలన్న సీఐడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ

  • విచారణను ఈనెల 30కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 
  • 41ఏ నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరించారని సీఐడీ పిటిషన్
  • రెడ్ బుక్‌లో ప్రభుత్వాధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41A నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ వ్యవహరిస్తున్నారని సీఐడీ పిటిషన్ 
  • విచారణ తర్వాత 30కు కేసును వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

6: 30 AM, Jan 24, 2024
హమ్మ.. ఎల్లో మీడియా..! ఇంత కుతంత్రమా.?

  • ఆస్థాన విద్వాంసుడు జడ శ్రవణ్‌ను పక్కనబెట్టిన ఎల్లోమీడియా
  • ఇటీవల అమరావతి విషయంలో చంద్రబాబును నిలదీసిన శ్రవణ్‌
  • చంద్రబాబు, లోకేష్‌ వల్లే అమరావతి రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరాలతో ప్రకటించిన శ్రవణ్‌
  • మూడు పంటలు పండే భూములను అన్యాయం చేశారని ఆవేదన
  • ఎప్పుడయితే చంద్రబాబును ప్రశ్నించాడో.. అప్పటినుంచి జడ శ్రవణ్‌ను దూరం పెట్టిన ఎల్లోమీడియా
  • ఇదే విషయాన్ని మీడియాకు వివరించిన మాజీ జడ్జి రామకృష్ణ
  • చంద్రబాబును తిట్టగానే శ్రవణ్‌ను దూరం చేస్తారా? ఎల్లో మీడియాకు మాజీ జడ్జి రామకృష్ణ ప్రశ్న

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega