Dec 22nd: AP పొలిటికల్‌ అప్‌డేట్స్‌

22 Dec, 2023 18:53 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో రసవత్తర రాజకీయం

ఎన్నికల్లో సింగిల్‌గా వస్తోన్న YSRCP

పొత్తుల కోసం TDP, జనసేన ఆరాటం

తెలుగుదేశం, జనసేనల మధ్య చిచ్చు రేపిన లోకేష్‌ వ్యాఖ్యలు

సీఎం సీటింగ్‌ షేర్‌ లేదు, అవకాశం వస్తే బాబే సీఎం అంటోన్న లోకేష్‌

కాపుల్లో సెగ రేపిన లోకేష్‌ వ్యాఖ్యలు

ఇంకెన్నాళ్లు జెండా పట్టుకుని సలాం కొట్టాలంటూ ఆగ్రహం

AP Elections Political Latest Updates Telugu

6:41PM, శుక్రవారం, Dec 22, 2023

నారా లోకేష్‌కు ఎలాంటి ఎమోషన్స్ లేవు: మంత్రి ఆర్‌కే రోజా

  • పిల్లలు బంగారు భవిష్యత్ కు బాటలు వేస్తూ ట్యాబ్‌లు పంపిణీ చేస్తుంటే దీన్ని వక్రీకరిస్తున్నారు
  • అశ్లీల వీడియో చూసే అలవాటు లోకేష్‌కు  ఉంది కాబట్టి, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు
  • నారా లోకేష్ ఎలాంటి ఎమోషన్స్ లేవు, తారక రత్న చనిపోయిన పట్టించుకోలేదు
  • జగనన్న పాదయాత్ర చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా 4వేల కిలో మీటర్లు, 400 రోజు అని చెప్పి 40 కి.మీ కూడా కంటిన్యూగా నడవలేదు200 రోజులు అని చెప్పి 200 సార్లు బ్రేక్ తీసుకున్నాడు లోకేష్
  • ఫెయిల్యూర్ పొలిటీషియన్ లోకేష్
  • 4 కోట్ల లోకల్ ఓటర్లు, 4 నాన్ లోకల్ లీడర్స్కు మధ్య రానున్న ఎన్నికలు జరగ బోతున్నాయి
  • పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణను ప్రజలు తరిమి కొడతారు

6:15PM, శుక్రవారం, Dec 22, 2023
చంద్రబాబు, పవన్‌కు మంత్రి అంబటి కౌంటర్‌

  • ఒకడు ప్యాకేజీ కోసం @పవన్‌ కల్యాణ్‌
  • ఒకడు పుత్రుడి కోసం @చంద్రబాబు
  • ఒకే ఒక్కడు ప్రజల కోసం @సీఎం జగన్‌

4:15PM, శుక్రవారం, Dec 22, 2023

లోకేష్‌ది జంపింగ్‌ జపాంగ్‌ యాత్ర: పేర్ని నాని

  • లోకేష్‌ది అట్టర్‌ ఫ్లాప్‌ యాత్ర
  • రాజకీయ లబ్దికోసమే లోకేష్‌ యాత్ర
  • మేనమామ కొడుకు చనిపోతే లోకేష్‌ కనీసం ఆసుపత్రికి కూడా వెళ్లలేదు
  • లోకేష్‌యాత్ర చేసిన కిలోమీటర్లన్నీ దొంగలెక్కలే
  • సాయంత్రం సూర్యడు దిగిపోయాక లోకేష్‌ బయటకు వస్తారు
  • ఈ అట్టర్‌ ఫ్లాప్‌ సినిమాకి పవన్‌ కళ్యాణ్‌, బాలకృష్ణలు. వీళ్లను పెట్టి దీన్ని పెద్ద సినిమా అంటారు
  • చంద్రబాబు పాపపు సొమ్ముతో లోకేష్‌ యాత్ర చేశారు
  • చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఏదైనా నెరవేర్చారా?
  • హామీలను గాలికొదిలేసి చంద్రబాబు అడ్డంగా దోచుకున్నారు
  • ఎప్పటికప్పుడు ప్రజలకు ఎరవేయటం చంద్రబాబు అలవాటు
  • ఇప్పుడు కొత్తగా హామీలు ఇవ్వడం మొదలుపెట్టారు
  • చంద్రబాబు ఎన్ని తప్పుడు మాటలు, మోసాలైనా చేస్తారు
  • తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలనేదే చంద్రబాబు  ఆలోచన
  • ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన బాబును పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదు?
  • అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు
  • సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని విమర్శించారు
  • అలా విమర్శించినవారే మూడురెట్టు ఎక్కువ సంక్షేమం అందిస్తామంటున్నారు

3:22 PM, శుక్రవారం, Dec 22, 2023
కర్నూలులో సైకిల్‌ సీన్‌ రివర్స్‌

  • చంద్రబాబు, లోకేష్‌ తీరుపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆగ్రహం
  • యువగళం సభకు హాజరుకాని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
  • కర్నూలు ఎంపీ, ఆలూరు అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న కోట్ల కుటుంబం
  • తమకు టికెట్‌ ఇవ్వకుండా చంద్రబాబు దాటవేస్తున్నాడన్న భావనలో కోట్ల

3:03 PM, శుక్రవారం, Dec 22, 2023
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో కీలక పరిణామం

  • ఏపి హైకోర్టు: IRR కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై కీలక పరిణామం
  • దర్యాప్తు అధికారులకు లోకేష్ రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారని కోర్టులో మెమో ఫైల్ చేసిన సీఐడీ
  • చంద్రబాబు కేసులు విచారిస్తున్న అధికారులపై లోకేష్ రెడ్ బుక్ చూపించి బెదిరిస్తున్నట్టు కోర్టులో మెమో ద్వారా తెలిపిన సీఐడీ
  • ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని కోరిన సీఐడీ
  • కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు కు ఏపీ హైకోర్టు ఆదేశం
  • తదుపరి విచారణ రేపటికి వాయిదా

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అక్రమ మలుపుల కేసు @ హైకోర్టు

  • CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు
  • టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు
  • కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే
  • లింగమనేని కుటుంబంతో క్విడ్‌ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్‌ క్యాపిటల్‌లో భూములు
  • స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మూడుసార్లు మార్పు
  • అలైన్‌మెంట్‌ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్‌ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకో
  • 2015 జూలై 22, 2017 ఏప్రిల్‌ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు
  • ఇన్నర్‌ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు
  • అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం
  • ఇన్నర్‌రింగ్‌ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్‌మెంట్‌
  • కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని
  • కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం
  • లింగమనేని రమేశ్‌ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం
  • సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు

2:00PM, శుక్రవారం, Dec 22, 2023
చంద్రబాబుకు మతిస్థిమితం లేదని మేము ఎప్పట్నుంచో చెబుతున్నాం: మంత్రి మేరుగ

  • నిన్న చంద్రబాబు రాష్ట్రంలో 7వేల కోట్ల క్రైస్తవ ఆస్తులు కాజేస్తున్నమని ఆరోపణ చేశారు
  • మా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు
  • క్రైస్తవ ఆస్తుల కోసం వెంపర్లాడింది చంద్రబాబు, బాబు నాయకులు
  • రాజకీయంగా తన మనుగడ కోసం చంద్రబాబు మాట్లాడుతున్నారు
  • గుంటూరు,విజయవాడలో ఎన్ని  క్రైస్తవ ఆస్తులు అమ్ముకున్నారో రండి మేము చూపిస్తాం
  • ఎన్నికలు వస్తున్నాయనినోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు
  • చంద్రబాబు ఓ గజదొంగ..మా మీద దాడులు,అఘాయిత్యాలు చేయించారు
  • చంద్రబాబు హయాంలో దళితుల పై జరిగిన దాడులు ఎన్నో ఉన్నాయి
  • దళితులపై చంద్రబాబు  అమానుషంగా కేసులు పెట్టారు,వైఎస్ జగన్ ఆ కేసులు ఎత్తివేశారు
  • చంద్రబాబు నువ్వు మనిషివా,మానవత్వం ఉందా?
  • చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు
  • క్రైస్తవ ఆస్తులు పై చర్చకు ఎక్కడి రమంటే వస్తా
  • రాజధాని ప్రాంతంలో మా పేదలకు ఇళ్ల ఇస్తామంటే కేసులు పెట్టారు
  • నాడు-నేడు కింద స్కూల్స్,సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ బాగు పరిచిన చరిత వైఎస్ జగన్‌ది
  • దళితులు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఉంది

1.33 PM, శుక్రవారం, Dec 22, 2023
AP ఎన్నికలకు రెడీ :

  • రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తోన్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం
  • సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్ వ్యాస్ సహా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిర్దేశ్ కుమార్ లతో కూడిన ఏడుగురు బృందం
  • సీఎస్, డీజీపీలతో పాటు  అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం
  • ఎన్నికల సన్నద్దతపై పవర్ పాయింట్ కలెక్టర్ల ప్రెజెంటేషన్
  • 2024 ఓటర్ల జాబితాల రూపకల్పన తో పాటు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్షలు
  • జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత పరిస్థితిపై కలెక్టర్ల నివేదికలు
  • రేపు సీఎస్, డీజీపీలతో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతోనూ భేటీ కానున్న ఈసీ బృందం

1.05 PM, శుక్రవారం, Dec 22, 2023
లోకేష్‌ ఇష్టానుసారంగా చేసిన వ్యాఖ్యలపై CID సీరియస్‌

  • విజయవాడ : లోకేష్ వ్యాఖ్యలపై ఎసిబి కోర్టులో మెమో దాఖలు చేసిన సిఐడి
  • లోకేష్ కోర్టు ధిక్కార వ్యాఖ్యలు చేశారని,  ఆధారాలతో సహా ACB కోర్టు ముందు ఉంచిన CID
  • లోకేష్ కి NBW వారెంట్ జారీ చేయాలని‌ పిటీషన్ లో పేర్కొన్న CID
  • యువగళం‌ ముగింపు సంధర్బంగా పలు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • కేసు దర్యాప్తుని ప్రభావితం చేసేలా లోకేష్ వివాదాద్పద వ్యాఖ్యలు
  • కోర్టు ఆదేశాలని దిక్కరించేలా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ పిటీషన్ లో పేర్కొన్న సిఐడి
  • చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన లోకేష్‌
  • చంద్రబాబుకి రిమాండ్ విధించడం తప్పని తేల్చేసిన లోకేష్
  • ACB న్యాయమూర్తికి దురుద్దేశాలని ఆపాదించే విధంగా లోకేష్ వ్యాఖ్యలున్నాయంటూ మెమోలో పేర్కొన్న  సిఐడి
  • చంద్రబాబుపై స్కిల్ స్కామ్, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ స్కామ్
  • సిఎం హోదాలో నాడు చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్న CID
  • నాడు తమ అభ్యంతరాలని బాబు పట్టించుకోలేదని న్యాయమూర్తి ఎదుట 164 సిఆర్ పిసి క్రింద ఉన్నతాధికారుల వాంగ్మూలం
  • ఆ వాంగ్మాలాలు ఇవ్వడాన్ని లోకేష్ తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం
  • అధికారులు 164 CrPC క్రింద వాంగ్మూలం ఎలా ఇస్తారని హెచ్చరికలు జారీ చేసిన లోకేష్‌
  • రెడ్ బుక్ లో పేర్లు రికార్డు చేశానంటూ తరచూ బెదిరింపులకు దిగుతోన్న లోకేష్‌
  • భవిష్యత్తులో వారి సంగతి తేలుస్తానంటూ లోకేష్ హెచ్చరిక
  • దర్యాప్తు సంస్థ విధివిధానాలను ఎలా తప్పుబడుతారంటున్న న్యాయ నిపుణులు
  • 164 CrPC క్రింద వాంగ్మూలం నమోదు చేయడం న్యాయ విచారణ ప్రక్రియలో భాగం
  • సాక్షులని బెదిరించి కేసు దర్యాప్తుని పక్కదారి పట్డించాలని లోకేష్ దురుద్దేశంగా మెమోలో పేర్కొన్న సిఐడి
  • గతంలో లోకేష్ కి జారీ చేసిన 41 ఎ  నోటీసులలో పేర్కొన్న షరతులకి విరుద్దమన్న సిఐడి

12.42 PM, శుక్రవారం, Dec 22, 2023
మీడియా ఇంటర్వ్యూల్లో లోకేష్‌ చెప్పిందేంటీ?

  • జనసేన - తెలుగుదేశం పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్తాయి
  • ఈ కూటమి ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఒక్కరే ఉంటారు
  • ఎన్నికల్లో గెలిస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతాడు
  • ఈ విషయంలో ఎలాంటి సందేహం, అనుమానం అవసరం లేదు
  • అస్సలు పవన్ కళ్యాణ్‌తో మాకు ముఖ్యమంత్రి పదవి అంటే CM సీట్ షేరింగ్ అనే కాన్సెప్టే లేదు
  • ఈ విషయం పవన్‌ కళ్యాణ్‌కు ముందే చెప్పాం
  • అన్నీ అర్థం చేసుకున్నాకే పవన్‌ పొత్తు విషయాన్ని ప్రకటించాడు
  • అదే విషయాన్ని వేర్వేరు సభల్లో కూడా పవన్‌ ప్రకటించాడు
  • అనుభవజ్ఞుడి నాయకత్వం అవసరం ఉందని పవనే తెలిపాడు

12.22 PM, శుక్రవారం, Dec 22, 2023
పవన్‌ కళ్యాణ్‌కు హరిరామజోగయ్య బహిరంగ లేఖ

  • లోకేష్ వ్యాఖ్యలు నేపథ్యంలో పవన్ కల్యాణ్‌కి ప్రశ్నలు సంధించిన హరిరామ జోగయ్య
  • లోకేష్ అశిస్తున్నట్టు చంద్రబాబునే పూర్తి కాలం సీఎం చెయ్యడానికి మీ ఆమోదం ఉందా...?
  • మీరే సీఎం కావాలని కలలు కంటున్న జన సైనికుల కలలు ఏం కావాలి..?
  • యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి రావాలని కలలు కంటున్న మీ జన సైనికుల కలలు ఏమవ్వాలి..?
  • ఈ ప్రశ్నలకు మీ జనసైనికులు సంతృప్తికరమైన సమాధానం ఎప్పుడు చెప్తారు..?
  • రాజ్యాధికారం చేపట్టే విషయంలో మీ వైఖరి ఎంటో జనసైనికులకు అర్థమయ్యేలా సమాధానం ఎప్పుడు చెప్తారు..?

12.10 PM, శుక్రవారం, Dec 22, 2023
చంద్రబాబు పేదల రక్తం పీల్చే వ్యక్తి: కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపాశేషు

  • ప్రజల కోసం తన రక్తాన్ని ధారపోసే వ్యక్తి సీఎం జగన్‌
  • చంద్రబాబు, లోకేష్, పవన్‌లకు ఈ రాష్ట్ర ప్రజల గురించి అవసరం లేదు 
  • అర్జంట్‌గా అధికారంలోకి రావాలన్నదే వారి ఆలోచన
  • తన వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే చూసుకునే వ్యక్తి పవన్‌ కళ్యాణ్
  • జనసేన శ్రేణుల సమస్యలు కూడా పవన్‌కు అవసరం లేదు
  • పవన్‌కు కావాల్సిందల్లా కేవలం చంద్రబాబు,లోకేష్ బాగోగులే
  • జనసేన పార్టీ పెట్టించింది చంద్రబాబేనని మేం ఎప్పుడో చెప్పాం
  • జన సైనికులు అప్పుడు నమ్మలేదు.. ఇప్పుడు బాధపడుతున్నారు
  • పవన్ సీనియర్ టీడీపీ కార్యకర్తలా తయారయ్యాడు
  • పవన్ చేస్తున్న పనులతో జన సైనికులు అవమానంతో కుమిలిపోతున్నారు
  • చంద్రబాబు లేకపోతే తన మనుగడ సాగదని పవన్ ఆలోచన
  • పవన్ తన పక్కన లేకపోతే జనం రారేమోనని చంద్రబాబు భయం
  • చంద్రబాబు,లోకేష్,పవన్ ను నమ్మే పరిస్థితిలో జనం లేరు
  • యువగళం ముగింపు సభ అట్టర్ ప్లాఫ్‌
  • చంద్రబాబే సీఎం అభ్యర్ధని ఓ ఇంటర్యూలో లోకేష్ స్పష్టంగా చెప్పాడు
  • పవన్‌ను ప్యాకేజ్ స్టార్ అంటే మమ్మల్ని అందరూ విమర్శించారు
  • లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఎవరు సమాధానం చెబుతారు
  • పవన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే
  • జన సైనికులు,కాపు సామాజికవర్గ పెద్దలు ఆలోచన చేయాలి
  • భారతదేశంలో ఎవరూ చేయలేనంత గొప్పగా సీఎం జగన్‌ సంస్కరణలున్నాయి
  • చంద్రబాబు, పవన్, లోకేష్ చేస్తున్న రాజకీయం చూస్తుంటే సిగ్గేస్తోంది
  • ప్రజల రక్తాన్ని పీల్చి కోట్లు సంపాదించిన వ్యక్తి చంద్రబాబు
  • ఆ సంపద కోసం ఆశపడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్
  • చంద్రబాబుకి పవన్ అమ్ముడుపోయాడు
  • తెలంగాణ ఎన్నికల్లో ఎనిమిదిచోట్ల పోటీచేసి తుస్సుమన్న పవన్ పార్టీ
  • తనను నమ్ముకున్నవారిని ఇంకా పిచ్చోళ్లను చేసే ప్రయత్నంలో పవన్ ఉన్నాడు
  • కాపులకు ప్రాధాన్యం కల్పించింది వైఎస్సార్ కుటుంబమే
  • కాపులను రోడ్ల పై ఈడ్చి తన్నించిన చరిత్ర చంద్రబాబుది
  • కాపులకు కొమ్ముకాసిందెవరో.. అమ్ముకున్నదెవరో తెలుసుకోండి
  • ఛాలెంజ్ చేసి చెబుతున్నా.. కాపులను పవన్.. చంద్రబాబుకు అమ్మేశాడు
  • సీఎం జగన్‌ 2వేల కోట్లు కాపు నేస్తానికి ఖర్చు చేశారు
  • పవన్ కు దమ్ముధైర్యం ఉంటే తనకు ఎన్ని సీట్లిస్తారో ప్రకటించాలి
  • అచ్చెన్నాయుడికి టిక్కెట్ ఇవ్వనని చెప్పే దమ్ము చంద్రబాబుకి ఉందా?
  • సమర్ధవంతమైన వ్యక్తిని ప్రకటించే దమ్ము జగన్ మోహన్ రెడ్డికే ఉంది
  • సీఎం జగన్‌ సింహంలా సింగిల్ గానే వస్తాడు...175 సీట్లలో గెలుస్తారు

11.44 AM, శుక్రవారం, Dec 22, 2023
పవన్‌కు రాజకీయాలు, సిద్ధాంతాలపై  క్లారిటీ లేదు: ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు 

  • మొన్నటి దాకా లెఫ్ట్ అన్నారు.. ఇప్పుడు రైట్ అంటున్నారు
  • తెలంగాణలో పవన్ కళ్యాణ్ అట్టర్ ప్లాఫ్ అయ్యారు
  • ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ అట్టర్ ప్లాఫ్ కావడం ఖాయం
  • తెలంగాణలో పవన్ కళ్యాణ్, బీజేపీ.. బీసీ సీఎంను ప్రకటించారు
  • మరి ఏపీలో కూడా పవన్ చంద్రబాబు బీసీని సీఎంను చేస్తామని ప్రకటిస్తారా?
  • వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సీపీఐ, సీపీఎంతో కలిసి పొత్తు పెట్టుకుంటాం
  • ఈ అంశంపై త్వరలోనే ఏఐసీసీ పెద్దలతో స్ట్రాటజీ మీటింగ్ ఉంది 
  • సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచురిని కలుస్తాం 
  • తెలంగాణలో కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేశాయి
  • ఏపీలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి ఇండియా కూటమిగా పోటీ చేస్తాం 
  • దేశంలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోంది
  • పార్లమెంట్‌లో ఎంపీల సస్పెన్షన్ దీనికి నిదర్శనం
  • దీనికి నిరసనగానే జంతర్ మంతర్‌లో ధర్నా కు దిగాం

10.42 AM, శుక్రవారం, Dec 22, 2023
బాలయ్య మిస్సింగ్‌.. ‘ఆంధ్రజ్యోతి’పై భగ్గుమన్న ఫ్యాన్స్‌

  • యువగళం ముగింపు సభలో బాలకృష్ణ పాల్గొన్నప్పటికి ఆయన పేరు, ఫోటో ప్రచురించలేదని ఆగ్రహం
  • కావలి ట్రంక్ రోడ్డులో ఆంధ్రజ్యోతి పేపర్‌ను తలగబెట్టిన బాలకృష్ణ ఫ్యాన్స్
  • ఆంధ్రజ్యోతి యాజమాన్యం బాలకృష్ణ పట్ల వివక్షత చూపుతోందని అభిమానుల ఆగ్రహం

10.12 AM, శుక్రవారం, Dec 22, 2023
పవన్‌ నియోజకవర్గంపై కన్‌ఫ్యూజన్‌

  • మళ్లీ రెండు నియోజకవర్గాలు కావాలంటోన్న పవన్‌ కళ్యాణ్‌
  • ఇదే విషయాన్ని చంద్రబాబు, లోకేష్‌లకు చెప్పిన పవన్‌ కళ్యాణ్‌
  • గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన పవన్‌
  • గాజువాకలో 16753 ఓట్ల తేడాతో పవన్‌ ఓటమి
  • భీమవరంలో 8357 ఓట్ల తేడాతో పవన్‌ ఓటమి
  • ఈ సారి మళ్లీ గాజువాకలో పోటీ చేస్తానంటోన్న పవన్‌ కళ్యాణ్‌
  • విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలిచిందని గుర్తు చేస్తోన్న పవన్‌
  • ఈ సారి కలిసి పోటీ చేస్తాం కాబట్టి తనకు గాజువాకలో అవకాశం ఉంటుందంటున్న పవన్‌
  • ఇదే విషయాన్ని రివర్స్‌లో  చెబుతోన్న తెలుగుదేశం నాయకులు
  • తమకు బలమున్న చోట పవన్‌కు అవకాశం ఎందుకు ఇవ్వడమంటోన్న టిడిపి సీనియర్లు
  • తనకు మాటిచ్చారు కాబట్టి గాజువాక ఇవ్వాల్సిందేనంటోన్న పవన్‌
  • పవన్‌కు అదే హామీ ఇచ్చి లోకేష్‌ సభకు రప్పించానని సీనియర్లకు నచ్చజెబుతోన్న చంద్రబాబు
  • గాజువాకలో మరోసారి ఓటమి తప్పదంటున్న టిడిపి సీనియర్లు
  • ఈ సారి రెండో నియోజకవర్గంగా పిఠాపురం అయితే బాగుంటుందన్న పవన్‌
  • పిఠాపురంలో 14,992 ఓట్ల మెజార్టీతో గెలిచిన YSRCP అభ్యర్థి దొరబాబు పెండెం
  • పిఠాపురంలో కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి తనకు అడ్వాంటేజ్‌ అంటోన్న పవన్‌
  • తెలుగుదేశం అభ్యర్థి వర్మకు ఎసరు పెట్టేందుకు జనసేన ఇన్‌ఛార్జ్‌గా తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌
  • తంగెళ్ల గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తే పవన్‌ పోటీకి అనుకూలంగా ఉంటుందని జనసేన ప్లాన్‌

08.49 AM, శుక్రవారం, Dec 22, 2023
వేడేక్కుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాజకీయం

  • అభివృద్ధి, సంక్షేమం మంత్రంతో ముందుకెళ్తోన్న సీఎం జగన్‌
  • సింగిల్‌గా పోటీ చేయలేక దిక్కులు చూస్తోన్న టిడిపి, జనసేన
  • పొత్తుల తక్కెడలో కొట్టుమిట్టాడుతోన్న చంద్రబాబు, పవన్‌
  • నిన్నంతా సీట్ల లెక్కలో తలమునకలయిన బాబు, పవన్‌
  • పవన్‌ లెక్క 50/5, చంద్రబాబు లెక్క 25/2

     

7.19 AM, శుక్రవారం, Dec 22, 2023
చంద్రబాబుది దిగజారుడు రాజకీయం: డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి   

  • జనాకర్షణ కోసం పవన్‌కళ్యాణ్, బాలకృష్ణతో సభలు  
  • ఎంతమంది వచ్చినా వైఎస్సార్‌సీపీ గెలుపును ఆపలేరు 
  • అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రా­న్ని లూటీ చేసి.. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు
  • అధికార దాహంతో అలమటిస్తూ.. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు
  • తన కుమారు­డు చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపుసభకు పవన్‌కళ్యాణ్‌ వస్తేనే కానీ నిర్వహించుకోలేని దుస్థితికి టీడీపీ దిగజారిపోయింది
  • యువగళం సభకు జనసమీకరణ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి ట్రైన్‌లు, బస్సుల్లో కార్యకర్తలను తరలించిన విషయం అందరికీ తెలిసిందే
  • జనాకర్షణ కోసం బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌ను సభలకు ఆహ్వానించారు
  • ఎన్ని పార్టీలు, ఎంతమంది కలిసి వచ్చినా 2024 జరగబోయే ఎన్నికల్లో సీఎం జగన్‌ సారథ్యంలోని వైఎస్సార్‌సీపీ గెలుపు తథ్యం
  • ఉద్యోగావకాశాలు కల్పిస్తాం, రైతులకు మేలు చేస్తాం, ప్రజలకు ఉపకారం చేస్తామని చెబుతున్న ప్రతిపక్ష టీడీపీ నాయకులు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదు?
  • జాబు కావాలంటే  బాబు రావాలి.. ఇంటికో ఉద్యోగమంటూ యువతను మభ్యపెట్టిన చంద్రబాబు తన కొడుకు నారా లోకేశ్‌కు రాజకీయ ఉద్యోగం ఇప్పించుకున్నారే తప్ప సామాన్య నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించలేదు

7.14 AM, శుక్రవారం, Dec 22, 2023
ఆ నలుగురూ నాన్‌లోకల్‌.. ఇక్కడ రాజకీయాలతో ఏం పని: మంత్రి ధర్మాన  ప్రసాదరావు 

  • రాష్ట్రం విడిపో­యి పదేళ్లయినా ఆ నలుగురూ వేరే రాష్ట్రం­లోనే నివాసం
  • మన రాష్ట్రంలో రాజకీయా­లు చేసేందుకు వారికి అర్హత లేదు
  • చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్, బాలకృష్ణ వేరే రాష్ట్రంలో ఉంటూ.. ఇక్కడకు ఎందుకు వచ్చారు?
  • వారిలో ఇద్దరు వ్యాపారాలు చేసుకుంటున్నారని,  మరో ఇద్దరు సినిమాలు చేసుకుంటున్నారు
  • ఒడిశా, తమిళనాడు, తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి అవుతామంటే ఒప్పుకుంటామా?
  • విద్యార్థులకు అందిస్తున్న ట్యాబ్‌లపై ఈనాడు దుష్ప్రచారం

7.00 AM, శుక్రవారం, Dec 22, 2023
ఈనాడు.. ఇంత దిగజారుడు రాతలా?: సీఎం జగన్‌ మండిపాటు 

  • అది పేపరా.. పట్టిన పీడా?
  • మీ పిల్లలు, మనవళ్లకేమో ఇంగ్లీషు మీడియం చదువులు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లా?
  • మేం పేద పిల్లలకు ఇస్తుంటే చెడిపోతారా? 
  • నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలపై తప్పుడు కథనాలా?
  • మీ పిల్లలు, మీ మనవళ్ల చేతిలోనేమో ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఉండొచ్చు! స్మార్ట్‌ ఫోన్లు కూడా ఉండొచ్చు!
  • కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం అవి ఉండకూడదా? ఇది సరైన పోకడేనా
  •  ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, చంద్రబాబు, దత్తపుత్రుడు.. వీరంతా ఎంత దిగజారి మాట్లాడుతున్నారో మీ అందరికీ తెలుసు
  • పేద పిల్లలకు ట్యాబ్‌లు ఇవ్వనే ఇవ్వకూడదని వారంతా అంటున్నారు
  • ట్యాబ్‌లు చేతిలో ఉంటే పిల్లలు చెడిపోతున్నారని రాస్తున్నారు
  • మన ప్రభుత్వ బడులలో చదువుకునే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలపై తప్పుడు రాతలు రాస్తున్నారు
  • ఏవేవో వీడియోలు చూస్తున్నారని, ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతున్నారని, చెడిపోతున్నారని పిల్లలకు ట్యాబ్‌లు ఇవ్వొద్దని ప్రతి రోజూ పనిగట్టుకుని నాపై విమర్శలు చేస్తున్నారు

6.55 AM, శుక్రవారం, Dec 22, 2023
ఈసీ బృందం రెండు రోజుల పర్యటన..

  • కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం నేటి నుంచి రెండు రోజుల పాటు ఏపీలో పర్యటన
  • రెండు రోజుల పాటు సీఎస్‌, డీజీపీలతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ బృందం సమావేశం 
  • సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్‌ వ్యాస్‌ సహా డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ హిర్దేశ్‌ కుమార్‌లతో కూడిన ఏడుగురు సభ్యులు బృందం రాష్ట్రంలో పర్యటన
  • రెండు రోజుల పాటు 2024 ఓటర్ల జాబితాల రూపకల్పనతో పాటు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్ష 
  • జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత పరిస్థితిపై కలెక్టర్లు నివేదికలు సమర్పించనున్నారు.
  • ఈ నెల 23వతేదీన సీఎస్, డీజీపీలతో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతోనూ ఈసీ బృందం భేటీ
>
మరిన్ని వార్తలు