ప్రమాణం చేద్దామా?.. దామచర్లకు బాలినేని సవాల్‌

8 Nov, 2023 15:57 IST|Sakshi

సాక్షి, ప్రకాశం జిల్లా: జిల్లాలో జరిగే అన్ని మీటింగ్‌లకు నన్ను  పిలిచారని, మీడియా వాళ్లు అనవసరంగా ప్రతీది రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కి అబద్ధాలు మాట్లాడటం అలవాటు. కాంట్రాక్టర్ల దగ్గర ఎవరు డబ్బులు తీసున్నారో ప్రమాణం చేద్దామా?. చీము, నెత్తురు, సిగ్గు ఉంటే నా ఛాలెంజ్‌కు స్పందించు’’ అంటూ సవాల్‌ విసిరారు. కొత్తపట్నం బ్రిడ్జి మెటీరియల్‌ కొనుగోలుకు నేను  రూ.40 లక్షలు ఇచ్చా. నోటికి వచ్చినట్లు మాట్లాడితే పద్దతిగా ఉండదు’’ అని బాలినేని హెచ్చరించారు.
చదవండి: తుస్సుమనిపించిన పవన్‌.. ఎందుకంత వణుకు? 

మరిన్ని వార్తలు