సామాజిక న్యాయం సీఎం జగన్‌ చేసి చూపించారు: మంత్రి కారుమూరి

16 Nov, 2023 19:19 IST|Sakshi

సాక్షి, కోనసీమ జిల్లా: కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగింది. మధ్యాహ్నం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుండి‌ బైకు ర్యాలీ ప్రారంభమైంది. ఎనిమిది కిలోమీటర్లు మేర బస్సు యాత్ర సాగింది. సాయంత్రం కొత్తపేటలో జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడారు.

సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసి చూపించారని మంత్రి కారుమూరు నాగేశ్వరావు అన్నారు. అన్ని వర్గాలకు రాజ్యాంగ బద్ధమైన పదవులు ఇచ్చారన్నారు. టీడీపీ-జనసేన పొత్తుపై మంత్రి మాట్లాడుతూ, పైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిశారని కిందిస్థాయిలో ఏ ఒక్క కార్యకర్త కలవలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నేరుగా ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని, ఇంతకంటే ఏం కావాలని పేద వర్గాలు అంటున్నాయని మంత్రి పేర్కొన్నారు.

జైలు ఊచలు లెక్కపెట్టిన చంద్రబాబు.. కంటి ఆపరేషన్ అని చెప్పి బయటకు వచ్చాడు. ఇప్పుడు గుండెకాయ రోగం వచ్చిందట అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, నాడు -నేడు వంటి కార్యక్రమాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాల పిల్లలు అభివృద్ధిని సూచిస్తున్నాయి. ఎంతోమందికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చి డాక్టర్లు, ఇంజనీర్లు చేసిన ఘనత వైఎస్సార్‌కు దక్కుతుంది. ఆయనకంటే నాలుగు అడుగులు ఎక్కువ వేసిన ఘనత ఆయన కుమారుడు జగన్‌కే దక్కుతుందని మంత్రి కారుమూరి అన్నారు.

నాడు నేడుతో మారిన స్కూళ్ల రూపురేఖలు: మార్గాని భరత్‌
మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ తీసుకొచ్చారని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. రాష్ట్రంలో పేద వర్గాల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.. మరి చంద్రబాబు మనవడిని ఎక్కడ చదివిస్తున్నాడో చంద్రబాబు చెప్పాలి. నాడు-నేడుతో  ఏడున్నర దశాబ్దాల స్కూళ్ల పరిస్థితిని సీఎం జగన్ మార్చేశారని మార్గాని పేర్కొన్నారు.
చదవండి: జగ్గంపేటలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చ

మరిన్ని వార్తలు