ఇదీ తెలంగాణ మంత్రుల బయోడేటా

8 Dec, 2023 04:27 IST|Sakshi

జూపల్లి కృష్ణారావు 
పుట్టిన తేదీ:  ఆగస్టు 10, 1955
స్వస్థలం: పెద్దదగడ, చిన్నంబావి మండలం (వనపర్తి జిల్లా)
విద్యార్హత: బీఏ
తల్లిదండ్రులు: జూపల్లి రత్నమ్మ – శేషగిరిరావు 
భార్య, పిల్లలు: జె.సుజన, వరుణ్, అరుణ్‌
రాజకీయ నేపథ్యం: బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి కొంతకాలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 
ఎమ్మెల్యే: కొల్లాపూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి 1999 (కాంగ్రెస్‌), 2004 (స్వతంత్ర), 2009 (కాంగ్రెస్‌), 2012 ఉపఎన్నిక, 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
మంత్రి: 2009 నుంచి  వైఎస్‌ రాజశేఖరరెడ్డి, రోశయ్య కేబినెట్‌లలో ఆహార, పౌరసరఫరాలు, తూనికలు – కొలతలు, వినిమయ వ్యవహారాల శాఖల మంత్రిగా, ఆ తర్వాత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ, ధర్మాదాయ, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో కేసీఆర్‌ కేబినెట్‌లో తొలుత ఐటీ, పరిశ్రమలు, ఆ తర్వాత పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా పనిచేశారు.

కొండా సురేఖ  
పుట్టిన తేదీ: 19 ఆగస్టు 1965 
స్వస్థలం: వంచనగిరి, గీసు కొండ మండలం (వరంగల్‌ జిల్లా)
విద్యార్హత: బీకాం        
తల్లిదండ్రులు: తుమ్మ రా«ద – చంద్రమౌళి
భర్త: కొండా మురళీధర్‌ రావు మాజీ ఎమ్మెల్సీ
కూతురు: సుష్మితాపటేల్‌
రాజకీయ నేపథ్యం: 1995లో వంచనగిరి ఎంపీటీసీగా రాజకీయ జీవితం ప్రారంభించి గీసుకొండ ఎంపీపీ నుంచి మంత్రి దాకా ఆమె ప్రస్థానం కొనసాగింది. 
ఎమ్మెల్యే: శాయంపేట సెగ్మెంట్‌ నుంచి 1999, 2004 (కాంగ్రెస్‌), పరకాల నుంచి 2009 (కాంగ్రెస్‌), వరంగల్‌ తూర్పు నుంచి 2014 (టీఆర్‌ఎస్‌), 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 
మంత్రి: 2009 వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో శిశు మహిళా సంక్షేమ అభివృద్ధిశాఖ మంత్రి. 
పార్టీ పదవులు: పీసీసీ సభ్యురాలు, కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ కోశాధికారి, ఏఐసీసీ సభ్యురాలు.

కెప్టెన్‌ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
పుట్టిన తేదీ: జూన్‌ 20, 1962
స్వస్థలం: తాటిపాముల, తిరుమలగిరి మండలం (సూర్యాపేట జిల్లా)
విద్యార్హత: నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ నుంచి బీఎస్సీ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. (సీనియర్‌ కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌  కలిగి ఉన్నారు)
తల్లిదండ్రులు: ఉషాదేవి– పురుషోత్తంరెడ్డి
భార్య: పద్మావతి (కోదాడ ఎమ్మెల్యే)
రాజకీయ నేపథ్యం: రాష్ట్రపతి భవన్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి 1994లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  
ఎమ్మెల్యే: 1999, 2004లో కోదాడ నుంచి, 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు 
మంత్రి: ఉమ్మడి ఏపీలో కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు.
ఎంపీ: 2019 లోక్‌సభఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎన్నిక
పార్టీ పదవులు: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, టీపీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.

తుమ్మల నాగేశ్వరరావు
పుట్టిన తేదీ: మే 20, 1953, స్వస్థలం: గండుగులపల్లి, దమ్మపేట మండలం  (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)
తల్లిదండ్రులు: మాణిక్యమ్మ– లక్ష్మయ్య, విద్యాభ్యాసం: బీకాం 
భార్య: భ్రమరాంబ, కుమారుడు యుగంధర్, కుమార్తెలు డాక్టర్‌ జగన్మోహిని, చంద్రిక
రాజకీయ నేపథ్యం: టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా, టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా పనిచేశారు. తాజాగా కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ హయాంలో ఉమ్మడి ఏపీలో చిన్ననీటి పారుదల శాఖ, ప్రొహిబిషన్, భారీ, మధ్యతరహా నీటి పారుదలశాఖ, ఎక్సైజ్, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా పనిచేశారు. 
ఎమ్మెల్యే: 1985, 1994, 1999 (సత్తుపల్లి), 2009 (ఖమ్మం), 2016 (పాలేరు), 2023 (ఖమ్మం) 
మంత్రి: ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు, కేసీఆర్‌ కేబినెట్‌లలో
ఎమ్మెల్సీ: టీఆర్‌ఎస్‌ నుంచి  2015లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 

ధనసరి అనసూయ (సీతక్క)
పుట్టిన తేదీ: జూలై 9, 1971
స్వస్థలం: జగన్నపేట,  ములుగు మండలం (ములుగు జిల్లా)
విద్యార్హత : ఎల్‌ఎల్‌బీ, ఆదివాసీల జీవనం – సంప్రదాయాలు – నైపుణ్యంపై పరిశోధన చేసి ఉస్మానియూ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు. 
తల్లిదండ్రులు: సమ్మక్క–సారయ్య, భర్త, పిల్లలు: రామన్న, సూర్య (కుమారుడు)
రాజకీయ నేపథ్యం: 10వ తరగతి పూర్తయ్యాక 1988లో విప్లవోద్యమంలో చేరిక. సీపీఐ (ఎంఎల్‌) జనశక్తిలో చేరిక, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జనశక్తి దళ లీడర్‌గా ప్రధాన భూమిక. 1997లో సాధారణ క్షమాభిక్ష పథకం కింద పోలీసులకు లొంగిపోయారు. 2001లో టీడీపీలో చేరారు. 
ఎమ్మెల్యే: ములుగు అసెంబ్లీ సెగ్మెంట్‌కు 2009 (టీడీపీ), 2018, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యే.
పార్టీ పదవులు: తెలుగు మహిళా రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ,  ప్రస్తుతం ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పుట్టిన తేదీ: అక్టోబర్‌ 28, 1965, 
స్వస్థలం: నారాయణపురం, కల్లూరు మండలం(ఖమ్మం జిల్లా) 
తల్లిదండ్రులు: స్వరాజ్యం– రాఘవరెడ్డి, విద్యాభ్యాసం: బీఏ 
భార్య: మాధురి, కుమారుడు హర్షారెడ్డి, కుమార్తె సప్నిరెడ్డి 
రాజకీయ నేపథ్యం: 2013లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2014లో ఖమ్మం లోక్‌సభ స్థానంలో వైఎస్సార్‌ సీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2016 బీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన 2014 సెప్టెంబర్‌ 1 నుంచి 2019 వరకు రవాణా, పర్యాటక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది జూలై 2న రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా నియమితులయ్యారు. 
ఎంపీ:  2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచారు. 
ఎమ్మెల్యే: 2023 పాలేరు సెగ్మెంట్‌కు కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే అయ్యారు.

సీలారపు దామోదర రాజనర్సింహ 
పుట్టిన తేదీ: డిసెంబర్‌ 5, 1958  
స్వస్థలం: జోగిపేట (సంగారెడ్డి జిల్లా) 
విద్యార్హత: ఇంజనీరింగ్‌ 
తల్లిదండ్రులు: జానాబాయి– రాజనర్సింహ (మాజీ మంత్రి) 
భార్య, కూతురు: పద్మిని, త్రిష 
రాజకీయ నేపథ్యం: వారసత్వంగా రాజకీయాల్లో వచ్చారు. ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు.  
ఎమ్మెల్యే: అందోల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 1989, 2004, 2009, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  
మంత్రి: 2006 వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య కేబినెట్‌లోనూ పనిచేశారు. 2010–2014 వరకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.   
పార్టీ పదవులు: సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యుడు    

పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌
పుట్టిన తేదీ: డిసెంబర్‌ 9, 1967
స్వస్థలం: కరీంనగర్‌
విద్యార్హత: ఎంఏ, ఎల్‌ఎల్‌బీ 
తల్లిదండ్రులు: మల్లమ్మ–సత్తయ్యగౌడ్‌
భార్య, పిల్లలు: మంజుల, పృథ్వీ, ప్రణవ్‌
రాజకీయ నేపథ్యం: ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీకి కాంగ్రెస్‌ అనుబంధ విభాగమైన ఎన్‌ఎస్‌యూ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2005–09 మధ్యకాలంలో మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ పనిచేశారు. 
ఎంపీ: 2009 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ ఎంపీగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచారు. ఎమ్మెల్యే: 2023 ఎన్నికల్లో హుస్నాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 
పార్టీ పదవులు: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 
పుట్టినతేదీ: మే, 23 1965
స్వస్థలం: బ్రాహ్మణవెల్లెంల, నార్కట్‌పల్లి మండలం (నల్లగొండ జిల్లా)
విద్యార్హత: ఇంజనీరింగ్‌ (సివిల్‌)
తల్లిదండ్రులు:  సుశీలమ్మ–పాపిరెడ్డి
భార్య, పిల్లలు: భార్య సబిత, కూతురు శ్రీనిధిరెడ్డి, కుమారుడు ప్రతీక్‌రెడ్డి (కుమారుడు 2011లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు)  
రాజకీయ నేపథ్యం: 1986–1993 వరకు ఎస్‌ఎస్‌యూఐ నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్‌గా, 1993– 1998 వరకు యువజన కాంగ్రెస్‌ రాష్ట్రనేతగా పనిచేశారు. 
ఎమ్మెల్యే: నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి 1999, 2004, 2009, 2014, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
మంత్రి: వైఎస్‌.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో.
ఎంపీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీగా గెలిచారు. 

దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
పుట్టిన తేదీ: జూన్‌ 6, 1969
స్వస్థలం: మంథని (పెద్దపల్లి జిల్లా)
విద్యార్హత: ఢిల్లీ యూనివ ర్సిటీ నుంచి న్యాయశాస్త్రం, హెచ్‌సీయూ నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ 
తల్లిదండ్రులు : జయశ్రీ – దుద్దిళ్ల శ్రీపాదరావు (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌)
భార్య, పిల్లలు: శైలజ రామయ్యర్‌ (సీనియర్‌ ఐఏఎస్‌), ఆదిత శ్రీపాద, అనిరుధ్‌ శ్రీపాద 
రాజకీయ నేపథ్యం:  దుద్దిళ్ల శ్రీపాదరావును నక్సలైట్లు హత్య చేయడంతో ఆకస్మికంగా రాజకీయాల్లోకి వచ్చారు. 
ఎమ్మెల్యే: మంథని అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున 1999, 2004, 2009, 2018, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 
విప్‌: ఉమ్మడి ఏపీలో 2004–2009 వరకు 
మంత్రి: 2009–14లో వైఎస్‌.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లలో ఉన్నత విద్యా శాఖ, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖల మంత్రిగా పనిచేశారు. 
పార్టీ పదవులు:  ఏఐసీసీ సెక్రటరీ 

మల్లు భట్టి విక్రమార్క 
పుట్టిన తేదీ: జూన్‌ 15, 1961 
స్వస్థలం: స్నానాల లక్ష్మీపురం, వైరా, ఖమ్మం జిల్లా.
విద్యార్హత: ఎంఏ
తల్లిదండ్రులు: మాణిక్యమ్మ – అఖిలాండ
భార్య, పిల్లలు: నందిని, కుమారులు సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య
రాజకీయ నేపథ్యం: మధిర సెగ్మెంట్‌ నుంచి 2009 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఆయన సోదరులైన మల్లు అనంతరాములు, మల్లు రవిలు నాగర్‌కర్నూల్‌ నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు. అనంతరాములు పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 
ఎమ్మెల్సీ: ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున 2007లో ఎమ్మెల్సీగా గెలిచారు. 
ఎమ్మెల్యే:  మధిర  నుంచి 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున వరుసగా గెలిచారు. 
ఉమ్మడి ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌: 2009 నుంచి 2011 
ఉమ్మడి ఏపీ డిప్యూటీ స్పీకర్‌: 2011 నుంచి 2014 వరకు 
సీఎల్పీ నేత: 2019 నుంచి 2023  
పార్టీ పదవులు: పీసీసీ కార్యదర్శి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ 

>
మరిన్ని వార్తలు