పవన్‌, చంద్రబాబు కలయికపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కామెంట్స్‌

9 Jan, 2023 16:13 IST|Sakshi

సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కలయికపై శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పందించారు. వారిద్దరూ ఎప్పుడూ వేరు కాదని.. ఒక్కటే అని తాము భావిస్తున్నట్లు బైరెడ్డి ఉద్ఘాటించారు. ఇద్దరు వచ్చినా, ఇంకెంతమంది కలిసొచ్చినా గెలిచేది సీఎం జగన్‌ అని స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో 175కు 175సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్తే తెలుస్తుందన్నారు. ఎవరెవరికి ఎన్ని పథకాలు, ఎన్ని నిధులు ఇచ్చామో మా వద్ద లెక్కలు ఉన్నాయి. ఇతర పార్టీ నేతల వద్ద ఉంటే చర్చకు రండి అని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు.

చదవండి: (ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ)

మరిన్ని వార్తలు