బీసీలకు చంద్రబాబు ఊచకోత

29 Mar, 2024 15:35 IST|Sakshi

సాక్షి, విజయవాడ: సామాజిక న్యాయాన్ని కేవలం మాటల్లోనే కాక చేతల్లోనూ సీఎం జగన్‌ చేసి చూపించగా, చంద్రబాబు మాత్రం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తూ వారికి వెన్నుపోటు పొడించారు. లోక్‌సభ సీట్లలో బీసీలకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. టీడీపీ కూటమిలో 25లో కేవలం 6 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారు. వైఎస్సార్‌సీపీ 20 ఆన్ రిజర్వ్ సీట్లలో 11 బీసీలకు కేటాయించగా, టీడీపీ 20 ఆన్ రిజర్వ్ సీట్లలో కేవలం 6 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించింది.

బీసీ జనాభా అధికంగా ఉన్న సీట్లలో చంద్రబాబు సొంత వర్గానికి సీట్ల కేటాయించారు. తాజాగా 4 లోక్‌సభ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించగా, టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం జాబితాలో బీసీలకు తీరని ద్రోహం చేసిన చంద్రబాబు.. కాపులకు 17 లోక్ సభ సీట్లలో ఒక్క సీటు కూడా కేటాయించలేదు.

కాగా, సీఎం జగన్‌ 50 శాతం సీట్లు బడుగు బలహీన వర్గాలకు కేటాయించారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు కలిపి 200 మొత్తం సీట్లకు 100 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చి తాను విశ్వసనీయతకు మారుపేరని మరోమారు చాటుకున్నారు. జనబ­లమే గీటురాయిగా అభ్యర్థులను ఎంపిక చేశారు. సామాజిక సమతూకం పాటించారు. బీసీలకు, మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చారు.

తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెనుకబడిన వర్గాల వారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే తాను మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన మాటను సీఎం జగన్‌ నిబబెట్టుకున్నారు. మొత్తం 175 శాసనసభా స్థానాల్లో 48 మంది బీసీలకు అవకాశం కల్పించారు.  మొత్తం 25 లోక్‌సభ సీట్లలో బీసీలకు 11 సీట్లు ఇచ్చారు. భవిష్యత్తులోనూ తాను బడుగు, బలహీనవర్గాల వెన్నంటే ఉంటానని, వారే నా బలం.. నా బలగం అని చాటిచెప్పారు.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers