కార్వీ గ్రూప్‌ సంస్థ రిజిస్ట్రేషన్‌ రద్దు

29 Mar, 2024 15:08 IST|Sakshi

కార్వీ గ్రూపునకు చెందిన కార్వీ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (కేఐఎస్‌ఎల్‌) రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్లు సెబీ ప్రకటించింది. మర్చంట్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలను కేఐఎస్‌ఎల్‌ నిర్వహిస్తోంది. 

గతేడాది మార్చిలో సెబీ ఈ సంస్థలో తనిఖీలు నిర్వహించింది. కానీ ఎటువంటి కార్యకలాపాలు కొనసాగడం లేదని గుర్తించింది. వ్యాపార బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన సాధనా సంపత్తి లేదని కూడా నిర్థారించింది. 

సంస్థ డైరెక్టర్‌ ఒకరు సెక్యూరిటీస్‌ మార్కెట్‌ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో పాటు మర్చంట్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన ఇతర నియమ నిబంధనలు సైతం పాటించడం లేదని, పైగా రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్‌ చేయడానికి ఫీజు చెల్లించలేదని తేలింది. తత్ఫలితంగా ఈ సంస్థకు ఉన్న సర్టిఫికేట్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ‘సెబీ’ వెల్లడించింది.

ఇదీ చదవండి: అలర్ట్‌.. రెండు రోజుల్లో ముగియనున్న గడువు

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers