కాంగ్రెస్‌ వల్లే బీజేపీ గెలుస్తోంది: ఒవైసీ

22 Nov, 2023 13:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ వల్లే కేంద్రంలో బీజేపీ గెలుస్తూ వస్తోందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆయన మీడియాతో ముఖాముఖి నిర్వహించారు. 

‘‘కాంగ్రెస్‌ వల్లే బీజేపీ కేంద్రంలో గెలుస్తోంది. కానీ, బీజేపీ విజయానికి నన్ను బాధ్యుడిగా కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది. బీజేపీ విజయానిని నేను ఎలా బాధ్యుడ్ని అవుతాను. పైగా సోషల్‌ మీడియాలోనూ కాంగ్రెస్‌ నాపై దుష్ప్రచారం చేస్తోంది.   టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితం ఆరెస్సెస్‌తోనే మొదలైంది. గాంధీభవన్‌ రిమోట్‌ ఇప్పుడు ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చేతిలో ఉంది అని ఒవైసీ ఎద్దేవా చేశారు. ఏదిఏమైనా సరే బీజేపీతో తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారాయన.  

బీఆర్‌ఎస్‌కు బహిరంగ మద్దతు ప్రకటించిన ఎంఐఎం.. హైదరాబాద్‌లో పలు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల్ని నిలిపింది. ‘‘ ఈ ఎన్నికల్లో మా సత్తా చాటుతాం. మా స్థానాల్ని మేం తిరిగి కైవసం చేసుకుంటాం. జూబ్లీహిల్స్‌లో ఈసారి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాం’’ అని అన్నారాయన. 

మరిన్ని వార్తలు