ఈవీఎంలలో సమస్యలు.. సీఈవోకు లేఖ రాసిన కాంగ్రెస్‌

30 Nov, 2023 14:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఒక్కోచోట ఓటు వేయడానికి కనీసం 10 సెకన్ల సమయం పడుతోందని ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ క్రమంలో జిల్లా ఎన్నికల అధికారులకు, స్టేట్‌ ఎన్నికల కమిషన్‌కు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే, ఈవీఎంల విషయమై సీఈవో వికాస్‌రాజ్‌.. డీఈవోలతో కోఆర్డీనేట్‌ అయ్యారు. మరోవైపు.. ఈవీఎంల మొరాయింపుపై సీఈవో వికాస్‌రాజ్‌కు కాంగ్రెస్‌ లేఖ రాసింది. ఈ క్రమంలో ఈవీఎంలలో ఉన్న సమస్యలను పరిష్కరించేలా చూడాలని కోరారు. లేనిపక్షంలో పోలింగ్‌ కేంద్రాలలో పోలింగ్‌ సమయాన్ని పెంచాలని కాంగ్రెస్‌ నేతలు సీఈవోను కోరారు. 

ఇదిఆల ఉండగా.. హైదరాబాద్‌లో మందకోడిగా పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేవలం 21 శాతం పోలింగ్‌ నమోదు.. అత్యధికంగా  మెదక్‌లో 51 శాతం పోలింగ్‌ నమోదైంది. కాగా, తెలంగాణవ్యాప్తంగా 37 శాతం పోలింగ్‌ జరిగినట్టు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. కాగా, సాయంత్రం పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు