‘ఎలక్షన్‌ కింగ్‌’ పద్మరాజన్‌.. 238 సార్లు ఓడినా మళ్లీ బరిలోకి..!

28 Mar, 2024 11:55 IST|Sakshi

ఓటమి.. గెలుపునకు తొలిమెట్టు.. గెలుపునకు నాంది.. ఇట్లా ఏవేవో చెబుతుంటారు. కానీ, ఓటమిని అంగీకరించాలంటే పెద్దమనసే ఉండాలి. అలా.. ఆయన ఓటమిని ఆస్వాదిస్తూ ముందుకు పోతున్నారు. ఒక్కసారిగా కాదు.. 238 సార్లు!!

దేశంలో ఎన్నికలు ఏవైనా ఆయన పోటీ చేస్తారు. ఎన్నిసార్లు ఒడినా లెక్కచేయకుండా ఎన్నికల్లో పోటీ చేస్తునే ఉంటారు. ఇప్పటివరకు రాష్ట్రపతి ఎన్నికల నుంచి లోకల్‌ ఎన్నికల వరకు బరిలో దిగుతూ వచ్చారు. పలు ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన 238 సార్లు ఓటమి పాలయ్యారు. అవన్నీ లెక్క​ చేయని.. 65 ఏళ్ల  ఆ వ్యక్తి 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తూ వార్తల్లో నిలిచారు.

తమిళనాడుకు చెందిన టైర్లు రిపేర్‌ చేసే షాప్‌ ఓనర్‌ కే. పద్మరాజన్‌. ఆయన దక్షిణ తమినాడులోని మెట్టూరు పట్టణానికి చెందినవారు. అయితే  ప్రతి ఎన్నికలో తాను పోటీ చేస్తున్నందుకు అందరూ నవ్వేవారని తెలిపారు. కానీ, ఓ సామాన్యుడు ఎన్నికల్లో భాగంకావటంపైనే తన దృష్టి ఉంటుందని అంటున్నారు. అయితే ఎన్నికల్లో  పోటీచేసే అందరూ విజయాన్ని కాంక్షిస్తారు. కానీ, నేను అలా కాదు. నేను పోటీలో పాల్గొనటమే నా విజయంగా భావిస్తాను. నేను ఓడిపోతున్నాని తెలిసిన మరుక్షణం.. ఆ ఓటమి ఆనందంగా స్వాగతిస్తానని తెలిపారు.

స్థానికంగా ‘ఎలక్షన్‌ కింగ్‌’అని పిలువబడే పద్మరాజన్‌.. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోటీ చేయటం గమనార్హం. 1988 నుంచి పలు ఎన్నికల్లో పోటీ చేస్తున్న పద్మరాజు.. అటల్ బిహారీ వాజపేయి, మన్మోహన్‌ సింగ్‌, నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీలపై పోటీ చేశారు. ఎన్నికల్లో విజయం ప్రాధాన్యం కాదని, ప్రత్యర్థి ఎవరు? అనేది తాను అస్సలు పట్టించుకోని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తూ ఎన్నిసార్ల ఓడిపోవటానికైనా సిద్ధమని తెలిపారు.

ఇలా ఎన్నికల్లో పోటీ చేయటం అంత సులభం కాదన్నారు. తాను ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వేల రూపాయాలు పొగొట్టుకున్నానని తెలిపారు. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయాలంటే సెక్యూరిటీ డిపాజిట్‌ రూ. 25వేలు. ఎన్నికల్లో  పోల్‌ అయ్యే ఓట్లలో 16 శాతం ఓట్లు పడకపోతే పెట్టిన సెక్యూరిటీ డిపాజిట్‌ గల్లంతు అవుందని అన్నారు

అయితే తాను ఒక్కసారి గెలిచాని..కానీ అది ఎన్నికల్లో కాదన్నారు. దేశంలోనే పలు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవటంలో లింకా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాధించటంలో విజయం సాధించానని తెలిపారు. అయితే తాను 2011లో కొంతలో కొంత మెరుగైన ప్రదర్శన కనబరిచినట్లు తెలిపారు. అప్పుడు మెట్టూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసి 6,273 ఓట్లు దక్కించుకున్నానని అన్నారు. విజేతకు 75 వేల ఓట్లు వచ్చాయని  తెలిపారు. ఆ ఎన్నికలో కనీసం ఒక్క ఓటు కూడా వస్తుందని అనుకోలేదన్నారు.

పద్మరాజు టైర్‌ రిపేర్‌ షాప్‌ నడపటంతో పాటు హోమియోపతి ఔషదాలు తయారీ, లోకల్‌ మీడియా ఎడిటర్‌గా కూడా పని చేస్తున్నారు. అయితే ఎన్ని ఉద్యోగాలు, పనులు చేసినా... ఎన్నికల బరితో దిగటమే తనకు చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. అయితే చాలా మంది ఎన్నికల్లో పోటీ చేయటానికి వెనకడుగు వేస్తారని.. అలాంటి వారికి ప్రేరణ ఇస్తూ, అవగాహన కల్పించటమే తన విధి అని చెప్పుకొచ్చారు. తన చివరి శ్వాస వరకు ఎన్నికల్లో పోటీ చేస్తునే ఉంటానని తెలిపారు. తాను పోటీచేసే ఎన్నికల్లో విజయం సాధిస్తే షాక్‌ అవుతానని తెలిపారు.

ఏడు దశల్లో జరిగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో తాను తమిళనాడులోని ధర్మపురి పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. ఆయన నామినేన్‌ కూడా వేశారు. అయితే తమిళనాడు ఉ‍న్న మొత్తం 39 పార్లమెంట్‌ స్థానాలకు ఈసారి ఒకే విడతలో లోక్‌సభ పోలింగ్‌ జరగనుంది.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers