Today Gold And Silver Prices: ఈ రోజు బంగారం ధరలు - ఇలా ఉన్నాయి

28 Mar, 2024 11:56 IST|Sakshi

2024 ప్రారంభంలో వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. ఫిబ్రవరి, మార్చిలో భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం గ్రామ్ బంగారం ధర రూ. 7000 దగ్గరకు చేరుకునే దిశగా పరుగులు పెడుతోంది. ఈ రోజు (మార్చి 28) దేశంలో బంగారం ధరలు ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడలలో మాత్రమే కాకుండా.. గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.61850 (22 క్యారెట్స్), రూ.67460 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ. 350, రూ. 380 వరకు పెరిగింది.

చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధరలు 350 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 380 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 61850 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 67460 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 61850 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 67460 రూపాయలకు చేరింది. నిన్న రూ. 200 నుంచి రూ. 220 వరకు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు రూ. 350, రూ. 380 వరకు పెరిగాయి.

వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. గత రెండు రోజులుగా తగ్గిన ధరలు ఈ రోజు మళ్ళీ పెరిగాయి. దీంతో వెండి ధర ఈ రోజు (మార్చి 28) రూ. 77500 (కేజీ) వద్ద ఉంది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Election 2024

మరిన్ని వార్తలు