జంగ్‌ తెలంగాణ: ఖానాపూర్‌లో నువ్వా-నేనా-ఆయనా?

1 Dec, 2023 11:51 IST|Sakshi

హీటెక్కించిన విమర్శలు.. హోరెత్తించేలా ప్రచారాలు.. ఎవరికి వారే ఓటర్లను ప్రసన్నం తంటాలు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమా.  అభివృద్ధి తామే చేశామని.. మరో అవకాశం ఇస్తే ఇంకా చేస్తామని, చేసిందేమీలేదని.. తమకు అధికారం ఇస్తే సిసలైన అభివృద్ధి చూపిస్తామని.. ఇలా హామీల మీద హామీలతో ‘సై’ అంటూ ఎన్నికల సమరంలో దూకారు. మరి ఖానాపూర్‌ నియోజకవర్గంలో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో.. ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారో చూడాలి.. 

ఉమ్మడి ఆదిలాబాద్‌ పరిధిలోని నిర్మల్‌ జిల్లాలో ఉంది ఖానాపూర్‌ నియోజకవర్గం. ఇక్కడ ఈసారి ఎన్నికల్లో  సిట్టింగ్‌ ఎమెల్యేను కాదని.. కేటీఆర్‌ సన్నిహితుడు, ఫారిన్‌ రిటర్నీ అయినా భూక్యా జాన్సన్‌ రాథోడ్‌ నాయక్‌కు టికెట్‌ ఇచ్చింది బీఆర్‌ఎస్‌ అధిష్టానం. ఇక ప్రతిపక్షం కాంగ్రెస్‌ నుంచి వెడ్మ బొజ్జు, బీజేపీ నుంచి ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ బరిలో ఉన్నారు. 

ఖానాపూర్‌ నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,06,985.. మహిళా ఓటర్లు 1,10,667.. ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు 13 మంది.. సర్వీస్‌ ఎలక్టోర్లు 416.. మొత్తంగా 2,18,081 ఓటర్లు ఉన్నారు. ఖానాపూర్‌లో 2018 ఎన్నికల్లో 80.87 శాతం పోలింగ్‌ రికార్డ్‌ కాగా.. ఈసారి మాత్రం 77.46 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది.   ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం కావడంతో.. ‘అభివృద్ధి’తో పాటు మారిన రాజకీయ సమీకరణాలు ఇక్కడి ఓటర్లపై ప్రభావం చూపించి.. అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపించేలా ఉన్నాయి.

మరిన్ని వార్తలు