రాజకీయాలను దిగజార్చిన కేసీఆర్‌

24 Sep, 2023 01:52 IST|Sakshi
కొత్తగూడెంలో విలేకరులతో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

బీఆర్‌ఎస్‌లో సోమన్న చేరికతో అది స్పష్టమైంది: ఈటల

చుంచుపల్లి: ఎన్ని అడ్డదారులైనా తొక్కి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సీఎం కేసీఆర్‌ రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. శనివారం ఆయన కొత్తగూడెంలో విలేకరులతో మాట్లా డారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని ప్రలోభా లకు గురిచేసి తమ వైపు తిప్పుకునే సంస్కృతి బీఆర్‌ఎస్‌లో కొనసాగుతోందని, ప్రలోభాలకు లొంగకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

‘ఎవడిపాలైందిరో తెలంగాణ’ అనే పాటతో రాష్ట్ర ప్రజలను ఆలోచింపజేసిన సోమన్న.. గతంలో ఈ ప్రభుత్వంతో కొట్లాడారని, అలాంటి వ్యక్తి నేడు గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యాడని, నాయకులను, ప్రజాగాయకుల ను ఎలా లొంగదీసుకుంటున్నారో దీన్ని బట్టే అర్థం అవుతోందని ఈటల వ్యాఖ్యానించారు.

ఈ ప్రభుత్వ హయాంలో వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి 17 పేపర్లు లీక్‌ అయ్యాయని, ఫలితంగా ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలు ఆగమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కేసీఆర్‌ కుటుంబంలో ఐదు పదవులు ఉన్నాయని, అవి కూడా అత్యంత కీలకమైన శాఖలని గుర్తుచే శారు. కాగా, బీజేపీకి సంబంధించి అసెంబ్లీ ఎన్ని కల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చురుగ్గా సాగుతోందని, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో దరఖాస్తుల పరిశీ లన జరుగుతోందని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు