స్పీకర్‌ నాకు తండ్రిలాంటి వారు.. హుందాగా వ్యవహరించాలి: ఈటల రాజేందర్‌

7 Sep, 2022 15:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాస్వామ్యం ముసుగులో సీఎం కేసీఆర్‌ రాచరిక పాలన చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు, ఇప్పటికీ ఛాలెంజ్‌ చేస్తున్నానని, తనను ఎక్కడి నుంచి పోటీ చేయమంటారో సీఎం చెప్పాలని డిమాండ్‌ చేశారు. చావుకి అయిన సిద్ధపడతాను కానీ రాజీపడనని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నష్టం మీద సందర్శనకు ప్రతిపక్షాలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ తనకు తండ్రి లాంటి వారని ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ప్రజల సమస్యల మీద స్పీకర్‌ చర్చ జరపాలని కోరారు. స్పీకర్‌ సభ అధిపతి అని, అందరి హక్కులు కాపాడాలని సూచించారు. అత్యుననతమైన పదవిలో ఉండే వ్యక్తి స్పీకర్‌, పార్టీలకు అతీతంగా సభ్యలకు అవకాశం కల్పించడం శాసన సభ స్పీకర్ పని అని అన్నారు. ఇప్పటి వరకు తనకు నోటీసులు అందలేదని, నోటీసులు వస్తే అప్పుడు సమాధానం చెప్తానన్నారు

‘నలుగురు సీఎంల దగ్గర పని చేశా. ఎప్పుడు ఇలా వాళ్లు వ్యవహరించలేదు. స్పీకర్ ఇటువంటి చర్యలకు పాల్పడలేదు. హుందాగా బతికిన వ్యక్తి స్పీకర్‌. అలాంటి వ్యక్తిని అగౌరవపరిచింది మీరు. నేను కాదు. మీరే క్షమాపణలు చెప్పాలి. మా హక్కులను కాలా రాసే స్పీకర్‌ను నేను మర మనిషి అన్నాను. మేము ఏంటనేది ప్రజలు డిసైడ్ చేస్తారు మీరెవరు. శాసన సభ సమావేశాలు ఉన్నాయని ముందస్తుగా సమచారం లేదు. మేము స్పీకర్‌కు దీని మీద కాల్ చేసి అడిగాం. అణచివేతకు అన్యాయానికి గురైన వారి పక్షాన బీజేపీ నిలబడతుంది.’ అని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు.
చదవండి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు