లోకేష్ పాదయాత్ర కంటే చంద్రబాబు పాపపరిహార యాత్ర చేపడితే బాగుంటుంది

27 Jan, 2023 16:41 IST|Sakshi

నెల్లూరు: టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రపై సెటైర్లు వేశారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వైఫల్యం చెందిన వ్యక్తి చేసే పాదయాత్రే యువగళం అని ఎద్దేవా చేశారు. ప్రజలతో ఏమాత్రం సంబంధంలేని, ప్రజా సమస్యలు తెలియని  వ్యక్తి లోకేష్ అని విమర్శించారు. అతను చెపట్టిన యువగళం, వికసించే గళం కాదన్నారు.

యువగళం పేరుతో చంద్రబాబు ఉద్రిక్తతలకు ప్రేరేపిస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయని కాకాణి పేర్కొన్నారు. పాదయాత్ర పేరుతో జరగబోయే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనిస్తామని చెప్పారు.  చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్‌ను  చివరి అస్త్రంగా వదిలాడని, టీడీపీకి మరోసారి భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు.

లోకేష్ పాదయాత్రను చూసి భయపడే పరిస్థితి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదు, రాదు అని కాకాణి అన్నారు. లోకేష్ పాదయాత్ర చేపట్టడం దానిపై స్పందించాల్సి రావటం దౌర్భాగ్యంగా భావిస్తున్నానని చెప్పారు. లోకేష్ యువగళం పాదయాత్ర కంటే చంద్రబాబు పాపపరిహార యాత్ర చేపడితే ఇంకా బాగుంటుందని వ్యాఖ్యానించారు.
చదవండి: పప్పు సుద్ద లోకేష్ పాదయాత్రతో టీడీపీ అధికారంలోకి వచ్చే సీనుందా?

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు