కేంద్రానికి కేటీఆర్‌ లేఖ.. అది తెలుగువారి బాధ్యత అంటూ కామెంట్స్‌

2 Apr, 2023 12:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కింది. తాజాగా మంత్రి కేటీఆర్‌.. కేంద్రానికి బహరంగ లేఖ రాశారు. లేఖలో మోదీ సర్కార్‌ నిర్ణయాలను టార్గెట్‌ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, కేటీఆర్‌ లేఖ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

కాగా, కేటీఆర్‌ లేఖలో..‘వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కుట్రలు ఆపాలంటూ హితవు పలికారు. కార్పొరేట్‌ మిత్రులకు కట్టబెట్లే పన్నాగాలు మానండి. వర్కింగ్‌ క్యాపిటల్‌, ముడిసరుకు కోసం నిధులు సమీకరణ పేరిట స్టీల్‌ ప్లాంట్‌ తాళాలను ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పే కుట్ర కేంద్రం చేస్తోంది. తన కార్పొరేట్‌ మిత్రులకు రూ.12.5లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన ప్రధాని మోదీ.. స్టీల్‌ ప్లాంట్‌ పట్ల ఇదే ఔదార్యం ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. కేంద్రమే ఈ వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం ఆర్థిక సాయం అందించాలి. వైజాగ్‌ ఉక్కు తెలుగువారి హక్కు.. దీన్ని కాపాడుకోవడం తెలుగువారి బాధ్యత. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను బీఆర్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది’ అని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు