వైఎస్సార్‌ స్ఫూర్తితో పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర చేపట్టా: భట్టి

9 Nov, 2023 16:00 IST|Sakshi

సాక్షి, ఖమ్మం జిల్లా: వైఎస్సార్‌ స్ఫూర్తితో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టానని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆయన నామినేషన్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ రాష్ట్ర సంపదను బీఆర్‌ఎస్ ప్రభుత్వం దోచుకుంటుందని మండిపడ్డారు. దుర్మాగుడు, లూటి చేసే నాయకుడు రాష్ట్రాన్ని పాలించాడు. పదేళ్లగా బీఆర్‌ఎస్‌ దోచుకున్న సొమ్మును ప్రజలకు పంచుతాం.. నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది’’ అని భట్టి పేర్కొన్నారు.

6 గ్యారంటీలను అమలు చేసే బాధ్యత రేవంత్ రెడ్డి, భట్టి తీసుకున్నారు. గట్టిగా వరద రాకపోయినా మేడిగడ్డ కుంగిపోయింది. ఎప్పుడో కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు చెక్కు చెదరలేదు.. ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. అనేక మాయమాటలతో పదేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నారు. ఇక మీ ఆటలు సాగనివ్వం’’ అని భట్టి ధ్వజమెత్తారు.

‘‘ఐదేళ్లు సీఎల్పీ నేతగా అలుపెరగకుండా తిరిగాను.. ప్రజల పక్షాన పోరాడాను. ఈ రాష్ట్రం  అందరిదీ.. ఈ సంపద అందరికి చెందాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జెండాలతో పనిలేకుండా అందరికి సంక్షేమ పథకాలు అందిస్తాం’’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
చదవండి: నన్ను జైలుకు పంపుతారా?.. ఐటీ దాడులపై పొంగులేటి రియాక్షన్‌ 

మరిన్ని వార్తలు