బాబుపై రాళ్ల దాడి అవాస్తవం

14 Apr, 2021 03:11 IST|Sakshi

హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత

నెహ్రూనగర్‌ (గుంటూరు): తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబు రాళ్ల దాడి అంటూ ఆరోపణలు చేస్తున్నారని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. గుంటూరులో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు రాళ్ల దాడిచేసే అవసరం లేదని తేల్చిచెప్పారు. చంద్రబాబు చెప్పినదంతా అవాస్తవమని పేర్కొన్నారు.

ప్రజలు నమ్మకపోవడంతో రాళ్ల దాడి పేరుతో ప్రజల నుంచి సానుభూతి పొంది ఓట్లు వేయించుకునే ఉద్దేశంలో ఉన్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు సీబీఐ పరిధిలో ఉందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సీబీఐ కోరితే రాష్ట్ర పోలీసు యంత్రాంగం సహకరిస్తుందని స్పష్టం చేశారు. వైఎస్‌ వివేకా హత్య కేసును కేంద్రంలో ఉన్న బీజేపీ త్వరితగతిన తేల్చాలని కోరారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు