తుమ్మల చెప్పినట్టు చేస్తే రేవంత్‌రెడ్డి నామినేషన్‌ రిజెక్ట్‌ చేయాలి : పువ్వాడ

13 Nov, 2023 16:16 IST|Sakshi

సాక్షి,ఖమ్మం : తన నామినేషన్‌ తిరస్కరించాలని ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ఫిర్యాదుపై మంత్రి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌ కుమార్‌ స్పందించారు. తుమ్మల చెప్పినట్లు చేస్తే ముందుగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో వేసిన నామినేషన్‌ రద్దు చేయాలన్నారు. ఖమ్మంలో పాత రుగ్మతలు ఇంకా కంటిన్యూ అవుతున్నా‍యని, తుమ్మలకు అధర్మ పోరాటం అలవాటని పువ్వాడ విమర్శించారు. ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో పువ్వాడ సోమవారం మీడియాతో మాట్లాడారు.

‘నా నామినేషన్‌ను తిరస్కరించాలని ఖమ్మం నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారికి తుమ్మల ఫిర్యాదు చేశారు. తుమ్మల ఫిర్యాదుకు ఎన్నికల అధికారులు సమాధానం ఇచ్చారు. ఆయన చెప్పగానే నా  నామినేషన్‌ తిరస్కరిస్తారా. తుమ్మల చెప్పినట్టు చేస్తే మంచోళ్ళు, చెయ్యకపోతే చెడ్డోళ్ళు. అఫిడవిట్‌లో తప్పులు ఉంటే నోటీస్ ఇస్తారు నాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. నాకు అన్ని అర్హతలు ఉన్నాయని అధికారులు సమాధానం ఇచ్చారు. డిపెండెన్స్ లేనప్పుడు ఎందుకు పెట్టాలి. గతంలో నా కుమారుడుకి పెళ్లి జరగలేదు.. ఇప్పుడు పెళ్లయింది. 

అఫిడవిట్ అనేది ఆస్తులు, లావాదేవీలు ఉంటే చూపించాలి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండు చోట్ల నామినేషన్ వేశారు. కొడంగల్‌లో అతని నామినేషన్‌లో ఏడు కాలాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా చెయ్యాలంటే ముందుగా రేవంత్ రెడ్డి నామినేషన్ రద్దు చెయ్యాలి. రిటర్నింగ్ ఆఫీసర్ తప్పు చేస్తే కోర్టుకు వెళ్లొచ్చు కానీ బెదిరించడం ఏంటి. మీకు సలహా ఇచ్చింది ఎవరో. మీ సమయం, నా సమయం వృథా చేశారు. అధర్మం పోరాటం కాదు ధర్మ పోరాటం చెయ్యాలి. అబద్దపు ప్రచారం చెయ్యకండి, నలభై ఏళ్ల పాటు మీరు చేసింది ఇదే. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడు చూడలేదు, ఇది మా కర్మ అనుకుంటున్నాం’ అని అజయ్‌ అన్నారు.  

ఇదీచదవండి.. పువ్వాడ అజయ్‌పై ఈసీకి ఫిర్యాదు చేశా: తుమ్మల

మరిన్ని వార్తలు