Parliament Security Breach: ‘దేశద్రోహిని కాదో.. అవునో.. వాళ్లే చెబుతారు’

24 Dec, 2023 16:02 IST|Sakshi

మైసూర్‌: పార్లమెంట్‌లో చోటు చేసుకున్న అలజడి ఘటనలోని నిందితులు మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహ కార్యాలయం నుంచి పార్లమెంట్‌ సందర్శన పాసులు పొందిన విషయం తెలిసిదే. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా ప్రతిపక్షాలు.. బీజేపీ ఎంపీ ప్రతాప్‌ను సస్పెండ్‌ చేయాలని నిరసన తెలిపారు. 

కాంగ్రెస్‌ కార్యకర్తలు కర్ణాటకలో ఏకంగా అతనిపై దేశద్రోహి ముద్రవేసి పోస్టర్లు కూడా అంటించారు. అయితే ఆ పోస్టర్లపై మొదటిసారి ఎంపీ ప్రతాప్‌ సింహ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నేను ఏంటో నా నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా తెలుసు. దాన్ని బట్టి ప్రజలు 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో తీర్పు ఇస్తారు’ అని అ‍న్నారు.

‘దేవతా చాముండేశ్వరీ, కావేరీ మాత, 20 ఏళ్ల నుంచి నా వ్యాసాలు చదివే ప్రజలకు తాను ఏంటో తెలుసు. గత 20 ఏళ్ల నుంచి సేవ చేస్తున్న మైసూరు, కొడుగు ప్రాంత ప్రజలు.. నేను దోశద్రోహినో లేదా దేశభక్తుడినో తేల్చుతారు. అదే విషయాన్ని 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో సైతం స్పష్టంగా చూపిస్తారు. నేను దోశద్రోహినో.. దేశ భక్తుడనో ప్రజలు తీర్పు ఇస్తారు’ అని ఎంపీ ప్రతాప్‌ పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ కార్యకర్తలు బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహపై నిరసనగా ఏర్పాటు చేసిన పోస్టర్లను మైసూరు పోలీసులు తొలిగించిన విషయం తెలిసిందే.

పార్లమెంట్‌ ఘటన అనంతరం ప్రతాప్‌ సింహ లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి నిందితులల్లో ఒకరైన సాగర్‌ శర్ తండ్రిది తన నియోజవర్గమైన మైసూర్‌ అని తెలియజేశారు. కొత్త పార్లమెంట్‌ సందర్శించడానికి పాస్‌ ఇవ్వాల్సిందిగా తన కార్యాలయంలో సాగర్‌ శర్మ తండ్రి విజ్ఞప్తి చేశారని పేర్కొన్న విషయం తెలిసిందే.

చదవండి:  2023 Roundup: సుప్రీంకోర్టు వెలువరించిన టాప్‌-10 జడ్జ్‌మెంట్స్‌

>
మరిన్ని వార్తలు