కోమటిరెడ్డి రాజీనామా ఆమోదం.. మనుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధం

8 Aug, 2022 11:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు.  కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా లేఖను స్పీకర్‌ ఆమోదించారు. రాజీనామా సమర్పించిన కొన్ని నిమిషాలకే స్పీకర్‌ ఆమోదం తెలిపారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. నేడు ఈసీకి స్పీకర్‌ కార్యాలయం సమాచారం ఇ‍వ్వనుంది. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటు మునుగోడు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.

కాగా ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి.. తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 21న అమిత్‌ షా సమక్షంలో అధికారంగా బీజేపీలో చేరనున్నారు. అదే రోజు కోమటిరెడ్డిని మునుగోడు అభ్యర్థిగా బీజేపీ ప్రకటించనుంది.
సంబంధిత వార్త: స్పీకర్‌కు రాజీనామా సమర్పణ.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు