ఎమ్మెల్యే రోజా సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేతలు

10 Jan, 2022 11:50 IST|Sakshi

నగరి(చిత్తూరు జిల్లా) : నిండ్ర మండలం పాదిరి గ్రామం, నగరి మండలం కృష్ణారామాపురం, ఓజీకుప్పం, నగరి పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే ఆర్‌కే రోజా సమక్షంలో ఆమె నివాస కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీలో చేరారు. పాదిరి గ్రామం నుంచి వైస్‌ సర్పంచ్‌ ఎం.సౌందర్‌రాజన్, బీసీ కాలనీ బాబు ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు సురేష్, నాగార్జున, రాఖీ, దిలీప్, రవి బాబు, యశోదమ్మ, భాస్కర్, రేవతి, రేష్మా వెంకటేశులు, మునస్వామి, సెల్వం, ప్రదీప్, భాస్కర్‌ వీరితో పాటు 40 మంది, నగరి మండల నాయకులు హరిరెడ్డి, రంగనాథంల ఆధ్వర్యంలో కృష్ణారామాపురం నుంచి సురేష్, ఓజీ కుప్పం నుంచి సతీష్, ప్రకాష్, సురేష్‌ ధరణి, కొత్తపేట గోవర్ధన్, నగరి ఫాజుల్, అరుణ్‌కుమార్‌లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 

వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి శ్యామ్‌లాల్, నిండ్ర మండల అధ్యక్షులు వేణురాజు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు