ప్చ్‌.. తెలంగాణలో జెండా కూలీలుగా మారిన తెలుగు తమ్ముళ్లు

10 Nov, 2023 21:30 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట: తెలంగాణలో తెలుగు దేశం పార్టీ ముసుగు తొలగించింది. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన పార్టీ.. ఇప్పుడు కాంగ్రెస్‌ కోసం ప్రచారంలోకి దిగింది. తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసిన కొన్ని గంటలకే.. తన ప్రియ శిష్యుడి కోసం రంగంలోకి దిగాలంటూ టీడీపీ శ్రేణుల్ని నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు సమాచారం.

తెలంగాణలో తెలుగు దేశం పార్టీ.. కాంగ్రెస్‌ పార్టీ ప్రచారానికి బహిరంగ మద్దతు ప్రకటించింది. పొత్తులో ఉన్నట్లు, కనీసం మద్దతు ఇస్తున్నట్లు ప్రకటనలు చేయకుండానే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తన ప్రియ శిష్యుడు రేవంత్‌రెడ్డి(టీపీసీసీ చీఫ్‌) కోసం పని చేయాలని చంద్రబాబు ఆదేశించడం.. ఆ ఆదేశాల్ని టీడీపీ నేతలు పాటించడం చకచకా జరిగిపోయాయి. శుక్రవారం కోదాడలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిని పద్మావతి ప్రచారం చేశారు. ప్రచార ర్యాలీలో పద్మావతి భర్త ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీ శివకుమార్‌, ఏపీ మాజీ మంత్రి రఘువీరారెడ్డి పాల్గొన్నారు. 

అయితే ర్యాలీ కొనసాగే క్రమంలో.. కాంగ్రెస్‌ జెండాల మధ్య టీడీపీ జెండాలు కనిపించాయి. కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసిపోయి మరీ టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు జోష్‌గా ఆ ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్లలో కొందరు తమను వేరే జెండా కూలీలుగా మార్చేశారంటూ అసహనం ప్రదర్శించడం స్పష్టంగా కనిపించింది. ఏపీలో టీడీపీ కోసం జనసేన కార్యకర్తలకు పట్టిన గతే.. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పట్టిందని, ఇదంతా కర్మ ఫలితమేనని కామెంట్లు చేస్తున్నారు మరికొందరు.

 మళ్లీ 'ఓటుకు కోట్లు'?

మరిన్ని వార్తలు