Telangana Assembly Elections Today Minute To Minute Updates
- హైదరాబాద్‌లో శ్రీనిధి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ ఇంట్లో ఐటీ సోదాలు
- రాజేంద్రనగర్‌లో దొరికిన రూ.7 కోట్ల నగదు అక్కడి నుంచే వచ్చాయని ఆరోపణలు
- కొనసాగుతున్న ఐటీ సోదాలు
ఎంఆర్పీఎస్ ప్రతినిధులతో అమిత్ షా రహస్య చర్చలు
- సికింద్రాబాద్ జువెల్ గార్డెన్లో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సమావేశం
- హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి
- స్వాగతం పలికిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
- తెలంగాణ, ఏపీ, కర్నాటక రాష్ట్రాల నుంచి హాజరైన ప్రతినిధులు
- మీడియాను అనుమతించని నిర్వాహకులు
- రహస్యంగా ఎంఆర్పీఎస్ ప్రతినిదులతో చర్చించిన అమిత్ షా
కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కామెంట్స్
- ఉపాధి కోసం ఈ ప్రాంతం నుంచి ఎంతోమంది గల్ఫ్ దేశాలకు వెళ్లారు
- పది సంవత్సరాలుగా ఉద్యోగాలను సీఎం కేసీఆర్ భర్తీ చేయలేదు
- నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాడు
- కామారెడ్డి లో పచ్చని భూములపై కేసీఆర్ కన్నేసి అందుకే కామారెడ్డికి వస్తున్నాడు
- మన భూములు మన చేతుల్లో ఉండాలంటే కేసీఆర్‌ను బండకేసి కొట్టాలి
- కేసీఆర్‌ను తెచ్చుకుంటే పామును తీసుకొచ్చి పక్కలో పెట్టుకున్నట్లు అవుతుంది
- తెలంగాణ తెచ్చుకునే సమయంలో సీఎం కేసీఆర్ కాపలా కుక్కలా ఉంటా అన్నాడు
- కానీ వీధి కుక్కలా తయారై మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలకు వెళుతున్నాడు
నాంపల్లి రోడ్ షోలో కేటీఆర్ కామెంట్స్
- కోహ్లీ సెంచరీ కొట్టినట్టు మనం సెంచరీ కొట్టాలంటే నాంపల్లి లో కూడా గెలవాలి
- తొమ్మిదన్నర ఏళ్లలో ఒక్కరోజు కూడా కర్ఫ్యూ లేదు
- బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరాయి
- జన్ దన్ ఖాతా తెరవండి 15 లక్షలు ఇస్తామని మోదీ అన్నాడు అవి ఒక్కరికి కూడా పడలేదు
- బీజేపీ ప్రభుత్వం ఎక్కడ ఉన్నా కుల మతాల పేరుతో ప్రజల్లో గొడవలు పెడతారు
- అన్ని మతాలను,కులాలను సమానంగా చూసే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్
- దేశంలో ఎక్కడా లేనివిధంగా మైనార్టీలకు బడ్జెట్ కేటాయించాం
- హైదరాబాద్ లాంటి నగరం దేశంలో ఎక్కడా లేదు
- 24 గంటల కరెంట్ ఇచ్చాం
- తాగు నీటి సమస్య లేకుండా చూశాం
- 70 కిలోమీటర్ల మెట్రో పూర్తి చేశాం
- ఇంకా 400 కిలోమీటర్ల మెట్రో లైన్ పూర్తి చేస్తాం
బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన అమిత్ షా
మేనిఫెస్టోలో హామీలివే..
- సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో బీజేపీ మేనిఫెస్టో
- 10 అంశాల కార్యాచరణ ప్రకటించిన బీజేపీ
- బీసీని ముఖ్యమంత్రి చేస్తామని హామీ
- అధికారికంగా సెప్టెంబర్ 17 విమోచన ఉత్సవాలు
- ప్రజలందరికీ సుపరిపాలన, సమర్థవంతమైన పాలన
- వెనుకబడిన వర్గాల సాధికారత, అందరికీ సమానమైన చట్టం వర్తింపు
- కూడు -గూడు, అందరికీ ఆహార, నివాస భద్రత
- రైతే రాజు అన్నదాతలకు అందలం
- విత్తనాల కొనుగోలుకు రూ.2500 ఇన్పుట్ అసిస్టెన్స్
- మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం
- మహిళా రైతుల కోసం మహిళా రైతు కార్పొరేషన్
- యువశక్తి-ఉపాధి..యూపీఎస్సీ తరహాలో గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల నిర్వహణ
- ఈడబ్ల్యూఎస్ కోటాతో సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను 6 నెలల్లో భర్తీ చేస్తాం
- వైద్య శ్రీలో భాగంగా అర్హత కలిగిన కుటుంబాలకు ఏడాదికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా
- జిల్లా స్థాయిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్ణయం
- విద్యా శ్రీ కింద నాణ్యమైన విద్య
- అన్ని ప్రయివేట్ స్కూళ్ల ఫీజులపై పర్యవేక్షణ
- గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ
- కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ
- మండల కేంద్రాల్లో నోడల్ స్కూళ్ల ఏర్పాటు
- ధరణికి బదులుగా మీ భూమి యాప్
- వరికి రూ.3100 మద్దతు ధర
- నిజామాబాద్‌లో టర్మరిక్ సిటీ
- ఆడబిడ్డ భరోసా కింద 21 ఏళ్లు వచ్చేనాటికి రూ.2 లక్షలు అందజేత
- ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ
- సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్ను రీయింబర్స్మెంట్
- అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు
- స్వయం సహాయక బృందాలకు 1 శాతం వడ్డీతోనే రుణాలు
- రైతులకు ఉచితంగా దేశీ ఆవులు
- రైతులకు ఉచితంగా పీఎం పంటల బీమా
- వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ టూర్లు
- ఉమ్మడి పౌరస్మృతి కోసం కమిటీ ఏర్పాటు
- మేడారం జాతరకు జాతీయ స్థాయిలో గుర్తింపు
- నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు
- బీఆర్ఎస్ అవినీతిపై విచారణకు కమిటీ
- ఎస్సీ వర్గీకరణకు సహకారం
- పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గింపు
- బడ్జెట్ స్కూళ్లకు పన్ను మినహాయింపు
- నిజాం ఘుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ
- పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు
- మేడారం జాతర జాతీయ స్థాయిలో నిర్వహణ
600 కోట్లు దాటిన తనిఖీల సొమ్ము..
- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విసృతంగా కొనసాగుతున్న తనిఖీలు
- 600కోట్లు దాటిన తనిఖీల్లో దొరికిన సొత్తు
- ఇప్పటి వరకు 214కోట్ల నగదును పట్టుకున్న పోలీసులు
- 94 కోట్ల విలువ చేసే మద్యంను సీజ్ చేసిన అధికారులు
- 34కోట్ల విలువ గల డ్రగ్స్ అండ్ మత్తు పదార్థాలు స్వాధీనం
- 179 కోట్లు విలువచేసే బంగారం, సిల్వర్ పట్టుకున్న పోలీసులు
- 78కోట్లు విలువచేసే బియ్యం, చీరలు, మొబైల్స్ సీజ్
కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు
- సీఎం కేసీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేసిన జూపల్లి
- కేసీఆర్ రేపు కొల్లాపూర్ వస్తే చెప్పు తీసుకొని కొడతా ఒక్కొకడ్ని అంటూ ఆగ్రహం
- కొల్లాపూర్ నియోజకవర్గంలో అక్రమంగా బోగస్ ఓట్లు నమోదు చేశారని ఆరోపణ
- బోగస్ ఓట్లు సృష్టించిన వారిని ఎవరినీ వదిపెట్టనని హెచ్చరిక
రేపు ఉమ్మడి ఆదిలాబాద్‌లో ప్రియాంక గాంధీ బిజీ షెడ్యూల్
- రేపు ప్రియాంక గాంధీ ఖానాపూర్, ఆసిఫాబాద్ ఎస్టీ నియోజక వర్గాలలో ప్రచారం చేస్తారు
- నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఉదయం 10.30 కు చేరుకోకున్న ప్రియాంక
- ఖానాపూర్ లో గంటసేపు ప్రచారం చేస్తారు
- అక్కడ నుంచి 12 గంటలకు అసిఫాబాద్‌కు రానున్న ప్రియాంక
- 12 గంటల నుంచి 1 వరకు అసిఫాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు
- నాగోబా దేవాలయం సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు
- అక్కడ మహిళలతో కలిసి గిరిజనుల ప్రత్యేక వంటకాలు వండి భోజనాలు
- మహిళలతో కలిసి ఆర్టీసీ బస్ లో ప్రయాణం
- తిరిగి మద్యాహ్నం ఒంటి గంటకు ఆసిఫాబాద్ నుంచి నాందేడ్ వెళ్లనున్న ప్రియాంక
మెట్పల్లిలో ధర్మపురి అరవింద్ ప్రెస్ మీట్
- నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్లాట్లు పెట్టి అమ్మేందుకు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసారు
- దీనికి గవర్నమెంట్‌కు సంబంధించిన డైరెక్టర్లు కూడా అంగీకారం చెప్పారని తెలిసింది.
- కేసిఆర్ ఇప్పటి వరకు షుగర్ ఫ్యాక్టరీ పై స్పందించలేదు
- కేసీఆర్‌కు రైతులపట్ల ఎలాంటి ప్రేమ లేదని అర్థం అయింది.
- గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల కేసీఆర్‌కు ఓటమి తప్పదు
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్‌లో జైలుకు వెళ్లక తప్పదు
- కాంగ్రెస్ పాతకాలం పార్టీ ఆ పార్టీ వల్ల ఏం ఉపయోగం లేదు
సీఎం కేసీఆర్, హరీశ్‌రావులపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
- సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై సీఈఓ వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
- బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలున్నాయని ఫిర్యాదు
- వరంగల్ బహిరంగ సభలో కాంగ్రెస్‌ను దోకెబాజి పార్టీ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయన్న కాంగ్రెస్
- కాంగ్రెస్ మేనిఫెస్టోను 420 మేనిఫెస్టో అంటూ హరీష్ రావు విమర్శలు కోడ్ ఉల్లంఘనే అవుతుందని కంప్లయింట్
చేర్యాల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కామెంట్స్
- ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి రాలేదు
- అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇలాంటి సభలు జరగవు
- అక్కడ టీవీల్లో చర్చలు పెడతారు
- పరిణితి సాధించిన దేశాలు బ్రహ్మాండంగా దూసుకుపోతున్నాయి
- మనదగ్గర ఎన్నికలు వస్తే నేరాలు ఘోరాలు, అబాంఢాలు
- ఎవరో చెప్పారని నిర్ణయం తీసుకోవద్దు
- అన్ని విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి
- ఎన్నికల్లో అభ్యర్థితో పాటు పార్టీ చరిత్రను పరిశీలించాలి
- మనం వేసే ఓటు మన ఐదేళ్ల తలరాతను మారుస్తుంది
- గెలిచాక కాంగ్రెస్ తెలంగాణను మోసం చేసింది
- ఉన్న తెలంగాణను ముంచిందే కాంగ్రెస్
- బీఆర్ఎస్ను చీల్చాలని ప్రయత్నం చేసింది
- ఇప్పుడు బచ్చన్నపేట చెరువు నిండుగా కనిపిస్తుంది
- రైతులకు రైతు బంధు ఇచ్చిందెవరు
- ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న వజజ్రాయుధం ఓటు
- బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం
- ఉన్న తెలంగాణను ముంచిందే కాంగ్రెస్
- ఎవరికి పిండం పెట్టాలో ప్రజలు నిర్ణయించాలి
- ఆంధ్రోళ్ల బూట్లు మోసిన నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
- పిచ్చి కుక్కలు మస్తుగా మొరుగుతాయి..పట్టించుకుంటమా
- ఉద్యమ సమయంలో రైఫిల్ పట్టుకొని తిరిగాడు
- అందుకే ఆయనకు రైఫిల్ రెడ్డి అని పేరు పెట్టారు
- ఆనాడు ఆంధ్రోళ్ల చెప్పులు మోశాడు
హైదరాబాద్‌లో అప్పా జంక్షన్ దగ్గర భారీగా డబ్బు పట్టివేత
- 6 కార్లలో తరలిస్తున్న 6.5 కోట్ల నగదు పట్టుకున్న పోలీసులు
- ఖమ్మం జిల్లాకు చెందిన ఓనేత డబ్బుగా అనుమానం
నల్లగొండ సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా కామెంట్స్
- కేసీఆర్ కారును, కమీషన్ల ప్రభుత్వాన్ని మోదీ గ్యారేజ్‌కు పంపాల్సిన సమయం ఆసన్నమైంది
- తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సిన అవసరం ఉంది
- తెలంగాణలో మీరు ఇచ్చే ఓటు ద్వారా బీసీ ముఖ్యమంత్రి కల నెరవేరుస్తాం
అమీర్‌పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిస్తాం : తలసాని
- అమీర్‌పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిస్తాం
- ఎన్టీఆర్ మహనీయుడు
- నాకు రాజకీయ భిక్ష పెట్టాడు
- ఆయన నా గుండెల్లో ఎప్పుడూ ఉంటాడు
- ఎన్నటికీ మరవను
భైంసాను మైసాగా మారుస్తాం : బండి సంజయ్
- అధికారంలోకి రాగానే..ముథోల్‌ను దత్తత తీసుకుంటా
- బైంసాను మైసాగా మార్చి తీరుతాం
- ముథోల్‌ను టెక్స్టైల్ పార్క్, పీజీ కాలేజీ, ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తాం
- రైల్వేలేన్ సహా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
- బాసర సరస్వతి ఆలయాన్ని అభివృద్ధి చేస్తా
- ముథోల్ ఎవడి అయ్య జాగీరు కాదు
- కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసాలను ముస్లిం సమాజం గుర్తించాలి
- హిందూ సమాజమంతా ఓటుబ్యాంకుగా మారి సత్తా చాటాలి
సెక్రటేరియట్‌కు రాకుండా దేశంలో పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్: భట్టి
- ముదిగొండ మండలం ఖానాపురంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం.
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్.
- సెక్రటేరియట్‌కు రాకుండా దేశంలో పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.
- కేసీఆర్‌కు ప్రజలు ముఖ్యం కాదు.. ధరణి లాంటి కుంభకోణ పథకాలే ముఖ్యం.
- దశాబ్దాల తరబడి తెలంగాణ ప్రజలు నీళ్ల కోసం పోరాడితే...
- కాళేశ్వరం నిర్మాణం పేరిట ఆర్దిక దోపిడీ చేసింది బీఆర్ఎస్ పాలకులు.
- బీఆర్ఎస్ నిర్మాణం చేసిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులు పనికిరాని పునర్మించాలని వాస్తవాలు బయటపెట్టిన డ్యామ్ సేఫ్టీ అధికారులు..
- కాళేశ్వరం ప్లాను ప్రకారం చేసిన డిజైన్ ప్రకారం నిర్మాణం జరగలేదు.
- కాళేశ్వరం మిషన్ భగీరథ పేరిట 1,60,000 కోట్లు దోపిడీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.
- అలంకారప్రాయంగా మారిన మిషన్ భగీరథ ట్యాంకులు పైపులు..
- ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన ఏ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లను చూడలేదు.
- ప్రజా సంపదను లూటీ చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాలేశ్వరంలో ముంచుదాం, దంచుదాం, దించుదామని సునామీల ప్రజల తిరుగుబాటు మొదలైంది
- రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుంది, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..
- కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో మధిర నియోజకవర్గం ప్రధాన భూమిక పోషిస్తుంది.
- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు విరివిగా తెస్తాం..
ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
- కేటీఆర్‌ను సీఎం చేయడానికి కేసీఆర్ ఏమైనా చేస్తారు.
- 20 ఏళ్లు కేసీఆర్ అడుగులో అగుగేసిన నన్ను గెంటేశారు
- ఏదో ఒకరోజు హరీష్ పరిస్థితి కూడా అంతే
- అల్లుడు కాబట్టి ఇన్నాళ్లు సర్దుకున్నాడు.
- నేను బయటివాడిని కాబట్టి నన్ను గెంటేశారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం..
- 200 రూపాయల పెన్షన్‌ను 2 వేలకు పెంచింది కేసీఆర్
- మహిళల కోసం మరో పథకాన్ని తీసుకువస్తాం
- మహిళా మండలి భవనాలు కట్టిస్తాం
- కోటి కుటుంబాలకు రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా
నిజామాబాద్ అర్బన్‌లో మంత్రి హరీశ్ రావు కామెంట్స్..
- కేసీఆర్ రెండు వేల రూపాయల పించన్ ఇస్తే, బీజేపీ వాళ్ళు బీడీపై జీఎస్టీ వేసింది.
- నీళ్ల కోసం అనేక కష్టాలు నాడు అనుభవించారు. ఇప్పుడు కష్టాలు లేవు.
- రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగింది.
- గణేష్ బిగాల గెలిస్తే ఇక్కడే ఉంటాడు సేవ చేస్తాడు
- షబ్బీర్ అలీ వచ్చి ఇక్కడ ఉంటాడా..?
- రాష్ట్రంలో బీజేపీ ఒకటి రెండు స్థానాల్లోనే పరిమితం.
- కేసీఆర్ ను గెలిపిస్తే అభివృద్ధి కొనసాగుతుంది.
- రాష్ట్రంలో కారు, నియోజకవర్గంలోనూ కారు ఉంటే.. అభివ్రుది మరింత వేగంగా జరుగుతుంది.
గద్వాల బీజేపీ విజయ సంకల్ప సభలో అమిత్‌షా
- ఇచ్చిన హామీలు కేసీఆర్ నిలబెట్టుకోలేదు.
- వచ్చే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు.
- అబద్ధపు మాటలతో సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేశారు.
- బీఆర్ఎస్ టైం అయిపోయింది బీజేపీ వచ్చే సమయం వచ్చింది.
- బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చింది.
- తెలంగాణలో బీసీ సీఎంను చేస్తాం.
- తెలంగాణలో బీసీ సీఎం కావాలంటే బీజేపీకి ఓటేయండి.
- బీసీలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో సీట్లు ఇవ్వలేదు.
- డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుంది.
- పెండింగ్ ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేయలేదు.
- ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు.
- కాంగ్రెస్, బీఆర్ఎస్లు బీసీ వ్యతిరేక పార్టీలు.
- బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది.
- పేపర్ లీకేజీ కారణంగా ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది.
బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని అర్థమైంది: విజయశాంతి
- తెర ముందు ఒకటి.. తెర వెనుక ఒకటి మాట్లాడుతున్నారు.
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. కేసీఆర్ అవినీతిని కక్కిస్తుంది.
- కేసీఆర్ నాటిన విత్తనం బీజేపీలో సంజయ్‌ను మార్చేసింది
- బండి సంజయ్‌ను మార్చిన తరువాత బీజేపీ గ్రాఫ్ పడిపోయింది.
సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ ఫైర్
- కేసీఆర్ అనుమతి లేకుండ చీమ కూడా చిటుక్కుమనది.
- గతంలో నేను ఆర్ధిక మంత్రిగా ఉన్నా సొంత ఇర్ణయాలు తీసుకునే అవకాశం లేదు.
- కేసీఆర్‌ను కాదని పనిచేసే సత్తా మంత్రి హరీష్‌రావుకు ఉందా?
- కేసీఆర్ మంత్రులంతా అతని బానిసలు, స్వతంత్రంగా పనిచేయలేరు.
మధిరలో భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం
- బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించుదాం
- ప్రజలకు సంపద పంచుదాం
- ఈ ప్రభుత్వంలో ఒక్కరికి రేషన్ కార్డు రాలేదు
- తెలంగాణలో సంపదను ప్రజలకు పంచలేదు
కేసీఆర్ వస్తే కామారెడ్డి రూపురేఖలే మారిపోతాయి: కేటీఆర్
- మూడు గంటలు కరెంట్ చాలని పీసీసీ అధ్యక్షుడు అంటున్నారు.
- మూడు గంటల విద్యుత్‌తో మూడెకరాలు పారుతుందా?
- రైతుల 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకోవాలని రేవంత్ సలహా ఇస్తున్నాడు.
- కేసీఆర్ వస్తే కామారెడ్డి రూపురేఖలే మారిపోతాయి.
కాంగ్రెస్‌లో చేరితే ఇబ్బందులుంటాయని తెల్సు: పొంగులేటి
- భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేటలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశం
- పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జారే ఆదినారాయణ
- కార్యకర్తలను ఉద్దేశించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..
- మనకి ఓటు పడే ఏ ఒక్క అవకాశం వదలద్దు
- పాత కాంగ్రెస్ వారితో ఐక్యత తో ముందుకు వెళదాం.
- బుల్లెట్ దిగిందా? లేదా? అనేది చూపిద్దాం
- జోరేడ్ల బండిలా తుమ్మల గారు నేను మీకు వుంటాము
- కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరి కష్టంలోను మా ప్రతినిధిగా జారేని నిలబెడుతున్నాము.
- ప్రత్యర్థులు గుండెనొప్పి అని పడిపోయి ఓట్ల కోసం నాటకాలు ఆడచ్చు ..ఏది నమ్మద్దు
- బూత్ స్థాయిలో ప్రతి యాభై కుటుంబాలకు ఒక్కో ఏజెంట్ కష్టపడాలి.
- మ్యాజిక్ ఫిగర్ 60 లో మొదటిది అశ్వారావుపేట
- మేము ఇరువురం కాంగ్రెస్ పార్టీ లో లేనపుడు కాంగ్రెస్ జెండా మోసి పార్టీ ని ముందుకు నడిపించిన మి అందరికీ ధన్యవాదాలు.
- కాంగ్రెస్ లో చేరితే ఇబ్బందులు వుంటాయని ముందే తెలుసు. అయినా నిస్వార్థంగా ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చాం
- రాష్ట్రంలో కొద్ది మంది స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారినవారిని వదిలేయండి.
- డిసెంబర్ 9 కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే అందరికీ పదవులు వస్తాయి..
- కొత్త బిచ్చగాళ్ల మాటలు పట్టించుకోవద్దు..
- తుమ్మల, నేను ఇద్దరం ఒక్కటే
- ఏఐసీసీ నుండి ఎవరో ఒకరిని తీసుకువస్తాం
- మీకు అందుబాటులోనే వుంటాం
- డబ్బు, అధికార మదంతో వున్న అధికార పార్టీ, ఆ పార్టీ నాయకుల పప్పులు ఇక వుడకవు.
- మనకి డబ్బు, పదవులు లేవు కానీ మన ప్రజా బలం ముందు ఏది నిలవదు..
- ప్రతి ఒక్కరూ ఒక తుమ్మల, ఒక పొంగులేటి లా ప్రచారం చేసి జారే అదినారాయణని గెలిపించండి.
బేగంపేటకు చేరుకున్న అమిత్ షా
- హైదరాబాద్‌కు చేరుకున్న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా
- గద్వాల సభకు బయల్దేరనున్న షా
- గద్వాల తర్వాత నల్లగొండ, వరంగల్ సభలో పాల్గొననున్న షా
- సాయంత్రం బీజేపీ మేనిఫెస్టో విడుదల
ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత
- రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో రోడ్‌షోలో కల్వకుంట్ల కవిత ఎన్నికల ప్రచారం
- సంజయ్ కుమార్‌కు మద్దతుగా కవిత ప్రచారం
- ప్రచార వాహనంలో స్పృహతప్పి పడిపోయిన ఎమ్మెల్సీ కవిత
- సపర్యలు చేసిన బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు
- ప్రాథమిక చికిత్స అందించిన గ్రంధాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్
- ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించిన చంద్రశేఖర్
- కోలుకుని కాసేపటికి మళ్లీ ప్రచారం ప్రారంభించిన కవిత
మళ్లీ అధికారంలోకి వస్తే సన్న బియ్యం ఇస్తాం: హరీష్ రావు
►ఓటువేసే ముందు ఆలోచించాలి.
►రూ. 200 పెన్షన్‌ను 4 వేలకు పెంచుకున్నాం.
►రైతు చనిపోతే రూ. 5లక్షల బీమా ఇస్తున్నాం.
►కాంగ్రెస్ వస్తే కర్ణాటక లెక్క మనం కూడా ఆగమైతం.
►బీఆర్ఎస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టింది.
►కాంగ్రెస్ పార్టీది ఒక జూటా మేనిఫెస్టో.
అలా అనలేదు.. బీఆర్ఎస్సే 420 పార్టీ: ఉత్తమ్
- సాక్షితో కాంగ్రెస్ ఎంపీ, హుజూర్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్‌చాట్
- నేను రైతు బంధు ఆపమని ఎక్కడా అనలేదు
- నామినేషన్ ల పర్వం కు ముందే రైతు బంధు విడుదల చేయాలని చెప్పాం..
- భయంతో కేసీఆర్ నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు
- బీఆర్ఎస్ 420 పార్టీ
- అవినీతి సొమ్ముతో బీఆర్ఎస్ నేతలు విర్రవీగుతున్నారు
- ఉచిత కరెంట్ పేటెంట్ మాది..ఓటమి భయం తో కరెంటు పై మాపై అసత్య ప్రచారం చేస్తున్నారు
- రాహుల్ గాంధీ పై మాట్లాడే స్థాయి బీఆర్ఎస్ నేతలకు లేదు
- కాంగ్రెస్ 75 పైగా స్థానాలతో అధికారంలోకి రావడం ఖాయం
అర్బన్ ఓటర్లకు కేటీఆర్ విజ్ఞప్తి
- అర్బన్ ఓటర్లను ఉద్దేశించి ట్వీట్ చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్
- గణాంకాల ప్రకారం.. పట్టణాల్లో 50 శాతం కంటే తక్కువగా ఓటింగ్ నమోదు అవుతోందని ఆవేదన
- నవంబర్ 30వ తేదీన ఓటు హక్కున్నంత వాళ్లంతా పోలింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి
- ఎవరికి ఓటేస్తారనేది పక్కన పెట్టి.. ఓటేయాలని కోరిన కేటీఆర్
- ఓటు అనే పవర్‌ను ఉపయోగించుకోవాలని సందేశం
- పౌర విధిగా తోటి వాళ్లను ప్రొత్సహించాలని కోరిన కేటీఆర్
బీఆర్ఎస్ను గెలిపిస్తేనే అభివృద్ధి: కవిత
- జగిత్యాల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్నికల ప్రచారం
- బీఆర్ఎస్ను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమని ప్రసంగం
- సంజయ్ కుమార్‌ను తిరిగి గెలిపించాలని ఓటర్లకు కవిత విజ్ఞప్తి
నా మీద కేసీఆర్ 74 కేసులు పెట్టారు: బండి
- కరీంనగర్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎన్నికల ప్రచారం
- బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా తనపై కేసులు పెట్టించారని మండిపాటు
గజ్వేల్‌లో ఈటల ప్రచారం
- ఇవాళ గజ్వేల్‌లో ప్రచారం చేయనున్న ఈటల రాజేందర్
- గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీకి దిగిన ఈటల
- నియోజకవర్గంలో ర్యాలీ, సభల ద్వారా ఇవాళ ప్రజలతో మమేకం అయ్యే అవకాశం
కేసీఆర్ సభకు భారీగా జనసమీకరణ
- జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాల పట్టణంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వద సభ
- పాల్గొని ప్రసంగించనున్న కేసీఆర్
- భారీగా జనసమీకరణ చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు
- నియోజకవర్గ పరిధిలోని ఎనమిది మండలాల నుండి ప్రజల్ని సభకు తరలింపు
- అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.. లోకల్ లీడర్లు
కేటీఆర్ నియోజకవర్గ ప్రచారంలో ఉద్రిక్తత
- సిరిసిల్ల నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో నెలకొన్న ఉద్రిక్తత
- ఎల్లారెడ్డిపేట మండలం అక్కపెల్లిలో బీజేపీ ప్రచారాన్ని అడ్డుకున్న బీఆర్ఎస్ ఉపసర్పంచ్ గోగూరి ప్రదీప్ రెడ్డి..
- బీజేపీ అభ్యర్థి రాణీరుద్రమ ప్రచారం చేస్తుండగా ఘటన
- డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎక్కడ ఇచ్చారో చూపెట్టాలంటూ ఉప సర్పంచ్ ను నిలదీసిన రాణీరుద్రమ
- 2 బీహెచ్‌కే ఇచ్చామంటూ ఉప సర్పంచ్ ప్రదీప్ రెడ్డి సమాధానం
- బీజేపీ ప్రచారాన్ని అడ్డుకుంటే ఒక్క సైగ చేస్తే వీపులు పగిలిపోతాయంటూ బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు
- చేతనైతే మంత్రి కేటీఆర్ ను ఊళ్లల్లో తిప్పండంటూ వాగ్వాదం
- ప్రచారాన్ని అడ్డుకున్న ఉప సర్పంచ్ ను అక్కడి నుంచి పంపించివేసిన పోలీసులు.
ట్విట్టర్లో ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసిన కల్వకుంట్ల కవిత
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వీడియో
- ధాన్యపు రాశుల తెలంగాణను ప్రతిబింబించేలా తాను స్వయంగా వీడియోను చిత్రీకరించినట్లు ఎక్స్‌లో పోస్టింగ్
- ఎన్నికల ప్రచారానికి గాను నిజామాబాద్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో ఆర్మూర్ లోని సిద్దులగుట్ట వద్ద రోడ్డుకు ఇరువైపులా రైతులు వడ్లను ఆరబెట్టిన దృశ్యాల్ని చిత్రీకరించిన కవిత
- "ధాన్యపు రాశుల తెలంగాణ. అప్పుడు ఎట్లుంది తెలంగాణ..!! ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ !!" అని పోస్టులో పేర్కొన్న కవిత.
కాంగ్రెస్‌లో చేరనున్న పాల్వాయి రజనీ
- హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ నేత పాల్వాయి రజిని
- కాంగ్రెస్లోలో చేరేందుకు రంగం సిద్ధం
- తుంగతుర్తి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ రజిని
అది 420 మేనిఫెస్టో
- కాంగ్రెస్ మేనిఫెస్టో అభయ హస్తంపై బీఆర్ఎస్ సెటైర్లు
- ఆచరణ సాధ్యం కాని హామీలు కాంగ్రెస్ ఇస్తోంది అంటూ బీఆర్ఎస్ నేతల కౌంటర్
- కర్ణాటక లో ఇచ్చిన హామీలు గాలికొదిలిన కాంగ్రెస్ తెలంగాణ లో ఏ విధంగా ఇస్తారంటు ఎదురుదాడి
- మేం కూడా చాలానే హామీలు ఇవ్వొచ్చు కానీ మేం చేసేదే ఇస్తామని ప్రజలకు చెప్తున్న బీ ఆర్ ఎస్
- ఇచ్చిన హామీలు అమలు చేయలేక కర్ణాటక లో ఖజానా ఖాళీ
- ఆరునెలలకే కర్ణాటక లో.కాంగ్రెస్ పరిస్తితి ఆగమయ్యిందని బీ ఆర్ ఎస్ నేతల కౌంటర్
రేపు తెలంగాణకు ప్రియాంక గాంధీ
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రియాంక గాంధీ
- అసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం
నల్లగొండ జిల్లా చిట్యాలలో చిరుమర్తి ప్రచారం
- చిట్యాల మండలం లోని 9, 10 వార్డుల్లో ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య,
- బీఆర్ఎస్ నేతలు గుత్తా అమిత్ రెడ్డి, పార్టీ శ్రేణుల సహా ప్రచారం
చేర్యాలకు కేసీఆర్
- నేడు చేర్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ
- ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం కేసీఆర్
ముదిగొండలో మల్లు ప్రచారం నేడు
- ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో నేడు మల్లు భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం
- మధిర కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో ఉన్న మల్లు భట్టి విక్రమార్క
మందమర్రిలో విన్నూత్న ప్రచారం
- మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఓయూ జేఏసీ విద్యార్థుల విన్నూత్న ప్రచారం
- బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేస్తే నిరుద్యోగులకు ఉరితాడు వేసినట్లేనని నినాదాలు
- చంపినట్లేనని మెడలో ఉరి తాళ్ళు వేసుకొని ప్రచారం నిర్వహించిన ఓయూ జేఏసీ నేతలు.
ఆరేళ్ల తర్వాత మళ్లీ అమిత్ షా..
- ఇవాళ నల్లగొండలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన
- 2017 తర్వాత తొలిసారి నల్లగొండకు వస్తోన్న అమిత్ షా
- ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్న బీజేపీ అగ్రనేత
- మేకల అభినవ్ స్టేడియంలో మధ్యాహ్నం జరిగే సభకు హాజరు
- 2:55 గంటల నుంచి 3:30 గంటల వరకు సభలో పాల్గొని ప్రసంగించనున్న అమిత్ షా.
- షా పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగం
- భారీ జన సమీకరణపై దృష్టి పెట్టిన బీజేపీ నేతలు
ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై విజయశాంతి స్పందన
- వ్యక్తుల్ని విమర్శించే సంస్కారం మాకు అటల్ జీ, అద్వానీ జీ, నాటి బీజేపీ నేర్పలేదు
- బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని తెలంగాణ సమాజం అంటున్నది
- అందుకు సమాధానం చెప్తే ఎంతో కొంతైనా సమంజసం కావొచ్చు
- నన్ను బాధపెట్టే మాటలతో విమర్శించడం సరికాదు
- విజయశాంతి బీజేపీలోనుంచి వెళ్లిపోయినందుకు పీడపోయిందన్న నిజామాబాద్ ఎంపీ అర్వింద్
- ప్రజల్లో ఉన్నవాళ్లంతా బీజేపీలోనే ఉన్నారని.. పాపులారిటీ లేకుండా రాజకీయాలు చేసేవారే ఇతర పార్టీల్లోకి వెళ్తారంటూ విజయశాంతిని ఉద్దేశించి ప్రకటన
- విజయశాంతి పార్టీ వదిలినంత మాత్రాన పార్టీకి ఏమాత్రం ఇబ్బంది లేదని వ్యాఖ్య
ఇరకాటంలో కాంగ్రెస్
- మానుతున్న గాయం పై పెట్రోల్ పోసిన కాంగ్రెస్ సీనియర్ చిదంబరం
- తెలంగాణ ఆత్మహత్యలు అని చిదంబరం స్టేట్మెంట్
- చిదంబరం వాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పై కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్
- నిన్న రాహుల్ గాంధీ పర్యటనలో వెలిసిన ఫ్లెక్సీలు
- ఇవాళ.. ఉద్యమకారులను బలిగొన్న కాంగ్రెస్‌ను బతకనీయద్దు అంటూ హైదరబాద్ నగరంలో పలు చోట్ల వెలసిన ఫ్లెక్సీలు
- శ్రీకాంత చారి ఫోటోతో పాటు పలువురి ఫొటోలతో ఫ్లెక్సీ
బండిని తప్పించాక బ్రేకులు పడింది వాస్తవమే: కేంద్ర మంత్రి
- దివాళీ మిలన్ సందర్భంగా మీడియాతో బీజేపీ అగ్రనేతలు
- తెలంగాణలో దూసుకెళ్తున్నాం: ప్రధాని మోదీ
- బీజేపీ సర్కారు ఏర్పాటు దిశగా పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి: ప్రధాని మోదీ
- తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది: అమిత్ షా
- బండి సంజయ్‌ను తప్పించాక పారీ్టకి బ్రేక్‌లు పడ్డమాట వాస్తవమే: అనురాగ్ ఠాగూర్
- గతంలో సంజయ్ సారథ్యంలో దూకుడు మీదున్న బీజేపీ : అనురాగ్ ఠాగూర్
- కొన్ని నిర్ణయాలను పార్టీకే వదిలేయాలి .. ఇంతకంటే ఏం చెప్పలేను: అనురాగ్ ఠాగూర్
వరంగల్‌పై ప్రధాన పార్టీల ఫోకస్
►నేడు వరంగల్‌లో అమిత్ షా సభ
►ఖిలా వరంగల్ మైదానంలో సభ
►నిన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పాదయాత్ర
►తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో నేడు అమిత్ షా సభ
►సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి
►పలువురు స్థానిక నేతలు దగ్గరుండి పనులు పర్యవేక్షణ
నేడు బీజేపీ మేనిఫెస్టో
►విడుదల చేయనున్న అమిత్ షా
►మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు అమిత్‌షా
►12.50 గంటలకు గద్వాల చేరుకుని అక్కడ బీజేపీ ఎన్నికల బహిరంగసభలో పాల్గొంటారు.
►మధ్యాహ్నం 2.45 గంటలకు గద్వాల నుంచి నల్లగొండకు బయలుదేరుతారు
►సాయంత్రం 4.20 గంటలకు వరంగల్ చేరుకుని అక్కడి బహిరంగసభలో ప్రసంగిస్తారు.
►సాయంత్రం 6 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు.
►సాయంత్రం 6.10 గంటలకు హోటల్ కత్రియలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేస్తారు.
►సాయంత్రం 6.45 నుంచి 7.45 గంటల వరకు క్లాసిక్ గార్డెన్లో ఎమ్మార్పీఎస్ ముఖ్యనేతలతో సమావేశంలో
►రాత్రి 8 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.
కాళేశ్వరం కంటే ధరణి పెద్ద కుంభకోణం: ప్రకాశ్ జవదేకర్
►బీఆర్ఎస్ సర్కార్ అతిపెద్ద మోసం
►బీజేపీ అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం
►ధరణి బాధితులకు న్యాయం చేస్తాం
మంత్రి మల్లారెడ్డి అఫిడవిడ్‌లో తప్పులు
►తిరస్కరించాలని హైకోర్టులో పిటిషన్
►మంత్రి మల్లారెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో విద్యార్హతకు సంబంధించి తప్పుడు సమాచారం
►ఆయన నామినేషన్ తిరస్కృతికి రిటర్నింగ్ అధికారిని ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్
►కీసర మండలం రామపల్లి దాయరకు చెందిన అంజిరెడ్డి పిటిషన్
►2014, 2018లో పేర్కొన్న విద్యార్హతలు.. తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్ పేర్కొన్న విద్యార్హతకు తేడా
►ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఇది చట్టవిరుద్ధం
►ఈ పిటిషన్‌పై ఒకటి రెండు రోజుల్లో హైకోర్టు విచారణ
ఆర్వోల నిర్ణయమే అంతిమం: డిప్యూటీ సీఈఓ సత్యవాణి
►వారి నిర్ణయాలను పునఃసమీక్షించే అధికారం ఈసీకి కూడా ఉండదు
►20లోగా బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తి..
►3 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహణ
ఈసారి పర్యాటక మంత్రిగా ఉంటా: బీఎన్ఐ సదస్సులో కేటీఆర్
►అవసరమైతే కేసీఆర్‌ను బతిమాలుకుంటా
►కొత్త రిజర్వాయర్ల పరిసరాల్లో ఎన్నో ఉపాధి అవకాశాలు
►తెలంగాణ ‘3.ఓ వర్షన్’ డెవలప్మెంట్కు ఐకాన్‌గా నిలుస్తుంది
అర్దరాత్రి ఓల్డ్ సిటీలో కేటీఆర్ సందడి
- సాదాసీదా గా పాతబస్తీ లోని ఓ హోటల్ కి వెళ్ళిన కేటీఆర్
- బిర్యానీ,పలు రకాల వంటకాలను ఆస్వాదించిన కేటీఆర్
- ఎలాంటి హడావిడి లేకుండా సడెన్ గా వెళ్లిన కేటీఆర్
- ఐస్ క్రీమ్ తో పాటు మరో హోటల్ లో టీ తాగిన కేటీఆర్
- కేటీఆర్ రావడంతో సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం