తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌

18 Nov, 2023 21:13 IST|Sakshi

Telangana Assembly Elections Today Minute To Minute  Updates

 • హైదరాబాద్‌లో శ్రీనిధి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌ చైర్మన్ ఇంట్లో ఐటీ సోదాలు
 • రాజేంద్రనగర్‌లో  దొరికిన రూ.7 కోట్ల నగదు అక్కడి నుంచే వచ్చాయని ఆరోపణలు
 • కొనసాగుతున్న ఐటీ సోదాలు

ఎంఆర్పీఎస్‌ ప్రతినిధులతో అమిత్‌ షా రహస్య చర్చలు

 • సికింద్రాబాద్ జువెల్ గార్డెన్‌లో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సమావేశం
 •  హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కిషన్ రెడ్డి
 • స్వాగతం పలికిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
 • తెలంగాణ, ఏపీ, కర్నాటక రాష్ట్రాల నుంచి హాజరైన ప్రతినిధులు
 •  మీడియాను అనుమతించని నిర్వాహకులు
 • రహస్యంగా ఎంఆర్పీఎస్ ప్రతినిదులతో చర్చించిన అమిత్ షా

కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కామెంట్స్

 • ఉపాధి కోసం ఈ ప్రాంతం నుంచి ఎంతోమంది గల్ఫ్ దేశాలకు వెళ్లారు
 • పది సంవత్సరాలుగా ఉద్యోగాలను సీఎం కేసీఆర్ భర్తీ చేయలేదు 
 • నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాడు
 • కామారెడ్డి లో పచ్చని భూములపై కేసీఆర్ కన్నేసి అందుకే కామారెడ్డికి వస్తున్నాడు
 • మన భూములు మన చేతుల్లో ఉండాలంటే కేసీఆర్‌ను బండకేసి కొట్టాలి
 • కేసీఆర్‌ను తెచ్చుకుంటే పామును తీసుకొచ్చి పక్కలో పెట్టుకున్నట్లు అవుతుంది 
 • తెలంగాణ తెచ్చుకునే సమయంలో సీఎం కేసీఆర్ కాపలా కుక్కలా ఉంటా అన్నాడు
 • కానీ వీధి కుక్కలా తయారై మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలకు వెళుతున్నాడు

నాంపల్లి రోడ్‌ షోలో కేటీఆర్‌ కామెంట్స్‌ 

 • కోహ్లీ సెంచరీ కొట్టినట్టు మనం సెంచరీ కొట్టాలంటే నాంపల్లి లో కూడా గెలవాలి
 • తొమ్మిదన్నర ఏళ్లలో ఒక్కరోజు కూడా కర్ఫ్యూ లేదు
 • బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరాయి
 • జన్ దన్ ఖాతా తెరవండి 15 లక్షలు ఇస్తామని మోదీ అన్నాడు అవి ఒక్కరికి కూడా పడలేదు
 • బీజేపీ ప్రభుత్వం ఎక్కడ ఉన్నా కుల మతాల పేరుతో ప్రజల్లో గొడవలు పెడతారు
 • అన్ని మతాలను,కులాలను సమానంగా చూసే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్
 • దేశంలో ఎక్కడా లేనివిధంగా మైనార్టీలకు బడ్జెట్ కేటాయించాం
 • హైదరాబాద్ లాంటి నగరం దేశంలో ఎక్కడా లేదు
 • 24 గంటల కరెంట్ ఇచ్చాం
 • తాగు నీటి సమస్య లేకుండా చూశాం
 • 70 కిలోమీటర్ల మెట్రో పూర్తి చేశాం
 • ఇంకా 400 కిలోమీటర్ల మెట్రో లైన్‌ పూర్తి చేస్తాం

 బీజేపీ మేనిఫెస్టో రిలీజ్‌ చేసిన అమిత్‌ షా

 మేనిఫెస్టోలో హామీలివే..  

 • సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో బీజేపీ మేనిఫెస్టో 
 • 10 అంశాల కార్యాచరణ ప్రకటించిన బీజేపీ 
 • బీసీని ముఖ్యమంత్రి చేస్తామని హామీ 
 • అధికారికంగా సెప్టెంబర్‌ 17 విమోచన ఉత్సవాలు
 • ప్రజలందరికీ సుపరిపాలన, సమర్థవంతమైన పాలన
 • వెనుకబడిన వర్గాల సాధికారత, అందరికీ సమానమైన చట్టం వర్తింపు
 • కూడు -గూడు, అందరికీ  ఆహార, నివాస భద్రత 
 • రైతే రాజు అన్నదాతలకు అందలం
 • విత్తనాల కొనుగోలుకు రూ.2500 ఇన్‌పుట్‌ అసిస్టెన్స్‌
 • మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం 
 • మహిళా రైతుల కోసం మహిళా రైతు కార్పొరేషన్‌
 • యువశక్తి-ఉపాధి..యూపీఎస్సీ తరహాలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణ
 • ఈడబ్ల్యూఎస్‌ కోటాతో సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను 6 నెలల్లో భర్తీ చేస్తాం 
 • వైద్య శ్రీలో భాగంగా అర్హత కలిగిన కుటుంబాలకు ఏడాదికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా
 • జిల్లా స్థాయిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్ణయం 
 • విద్యా శ్రీ కింద నాణ్యమైన విద్య 
 • అన్ని ప్రయివేట్‌ స్కూళ్ల ఫీజులపై పర్యవేక్షణ 
 • గల్ఫ్‌ బాధితుల కోసం నోడల్‌ ఏజెన్సీ 
 • కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ
 • మండల కేంద్రాల్లో నోడల్‌ స్కూళ్ల ఏర్పాటు
 • ధరణికి బదులుగా మీ భూమి యాప్‌
 • వరికి రూ.3100 మద్దతు ధర
 • నిజామాబాద్‌లో టర్మరిక్‌ సిటీ
 • ఆడబిడ్డ భరోసా కింద 21 ఏళ్లు వచ్చేనాటికి రూ.2 లక్షలు అందజేత 
 • ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి 4 గ్యాస్‌ సిలిండర్లు ఫ్రీ
 • సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్ను రీయింబర్స్‌మెంట్‌ 
 • అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు 
 • స్వయం సహాయక బృందాలకు 1 శాతం వడ్డీతోనే రుణాలు 
 • రైతులకు ఉచితంగా దేశీ ఆవులు 
 • రైతులకు ఉచితంగా పీఎం పంటల బీమా 
 • వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ టూర్లు 
 • ఉమ్మడి పౌరస్మృతి కోసం కమిటీ ఏర్పాటు 
 • మేడారం జాతరకు జాతీయ స్థాయిలో గుర్తింపు 
 • నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు
 • బీఆర్‌ఎస్‌ అవినీతిపై విచారణకు కమిటీ 
 • ఎస్సీ వర్గీకరణకు సహకారం 
 • పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గింపు
 • బడ్జెట్‌ స్కూళ్లకు పన్ను మినహాయింపు 
 • నిజాం ఘుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ 
 • పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు
 • మేడారం జాతర జాతీయ స్థాయిలో నిర్వహణ  

600 కోట్లు దాటిన తనిఖీల సొమ్ము..

 • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విసృతంగా కొనసాగుతున్న తనిఖీలు
 • 600కోట్లు దాటిన తనిఖీల్లో దొరికిన సొత్తు
 • ఇప్పటి వరకు 214కోట్ల నగదును పట్టుకున్న పోలీసులు
 • 94 కోట్ల విలువ చేసే మద్యంను సీజ్ చేసిన అధికారులు
 • 34కోట్ల విలువ గల డ్రగ్స్ అండ్ మత్తు పదార్థాలు స్వాధీనం
 • 179 కోట్లు విలువచేసే బంగారం, సిల్వర్ పట్టుకున్న పోలీసులు
 • 78కోట్లు విలువచేసే బియ్యం, చీరలు, మొబైల్స్ సీజ్

 కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు

 • సీఎం కేసీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేసిన జూపల్లి
 • కేసీఆర్ రేపు కొల్లాపూర్ వస్తే చెప్పు తీసుకొని కొడతా ఒక్కొకడ్ని అంటూ ఆగ్రహం
 • కొల్లాపూర్ నియోజకవర్గంలో అక్రమంగా బోగస్‌ ఓట్లు నమోదు చేశారని ఆరోపణ
 • బోగస్ ఓట్లు సృష్టించిన వారిని ఎవరినీ వదిపెట్టనని హెచ్చరిక

రేపు ఉమ్మడి ఆదిలాబాద్‌లో ప్రియాంక గాంధీ బిజీ షెడ్యూల్‌

 • రేపు ప్రియాంక గాంధీ ఖానాపూర్, ఆసిఫాబాద్ ఎస్టీ నియోజక వర్గాలలో ప్రచారం చేస్తారు 
 • నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఉదయం 10.30 కు చేరుకోకున్న ప్రియాంక
 •  ఖానాపూర్ లో గంటసేపు ప్రచారం చేస్తారు 
 •  అక్కడ నుంచి 12 గంటలకు అసిఫాబాద్‌కు  రానున్న ప్రియాంక 
 • 12 గంటల నుంచి 1 వరకు అసిఫాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు 
 •  నాగోబా దేవాలయం సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు
 • అక్కడ మహిళలతో కలిసి గిరిజనుల ప్రత్యేక వంటకాలు వండి భోజనాలు
 •  మహిళలతో కలిసి ఆర్టీసీ బస్ లో ప్రయాణం
 • తిరిగి మద్యాహ్నం ఒంటి గంటకు ఆసిఫాబాద్ నుంచి నాందేడ్ వెళ్లనున్న ప్రియాంక 

మెట్‌పల్లిలో  ధర్మపురి అరవింద్ ప్రెస్ మీట్

 • నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్లాట్లు పెట్టి అమ్మేందుకు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసారు
 • దీనికి  గవర్నమెంట్‌కు సంబంధించిన డైరెక్టర్లు కూడా అంగీకారం చెప్పారని తెలిసింది. 
 • కేసిఆర్ ఇప్పటి వరకు షుగర్ ఫ్యాక్టరీ పై స్పందించలేదు
 • కేసీఆర్‌కు రైతులపట్ల ఎలాంటి ప్రేమ లేదని అర్థం అయింది. 
 • గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల కేసీఆర్‌కు ఓటమి తప్పదు
 • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్‌లో జైలుకు వెళ్లక తప్పదు
 • కాంగ్రెస్ పాతకాలం పార్టీ ఆ పార్టీ వల్ల ఏం ఉపయోగం లేదు

సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావులపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

 • సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై సీఈఓ వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
 • బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలున్నాయని ఫిర్యాదు
 • వరంగల్ బహిరంగ సభలో కాంగ్రెస్‌ను దోకెబాజి పార్టీ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయన్న కాంగ్రెస్‌ 
 • కాంగ్రెస్ మేనిఫెస్టోను 420 మేనిఫెస్టో అంటూ హరీష్ రావు విమర్శలు కోడ్‌ ఉల్లంఘనే అవుతుందని కంప్లయింట్‌ 

చేర్యాల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ కామెంట్స్‌ 

 • ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి రాలేదు 
 • అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇలాంటి సభలు జరగవు
 • అక్కడ టీవీల్లో చర్చలు పెడతారు 
 • పరిణితి సాధించిన దేశాలు బ్రహ్మాండంగా దూసుకుపోతున్నాయి
 • మనదగ్గర ఎన్నికలు వస్తే నేరాలు ఘోరాలు, అబాంఢాలు
 • ఎవరో చెప్పారని నిర్ణయం తీసుకోవద్దు
 • అన్ని విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి
 • ఎన్నికల్లో అభ్యర్థితో పాటు పార్టీ చరిత్రను పరిశీలించాలి  
 • మనం వేసే ఓటు మన ఐదేళ్ల తలరాతను మారుస్తుంది
 • గెలిచాక కాంగ్రెస్‌ తెలంగాణను మోసం చేసింది
 • ఉన్న తెలంగాణను ముంచిందే కాంగ్రెస్‌
 • బీఆర్‌ఎస్‌ను చీల్చాలని ప్రయత్నం చేసింది
 • ఇప్పుడు బచ్చన్నపేట చెరువు నిండుగా కనిపిస్తుంది
 • రైతులకు రైతు బంధు ఇచ్చిందెవరు 
 • ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న వజజ్రాయుధం ఓటు 
 • బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ కోసం 
 • ఉన్న తెలంగాణను ముంచిందే కాంగ్రెస్‌
 • ఎవరికి పిండం పెట్టాలో ప్రజలు నిర్ణయించాలి 
 • ఆంధ్రోళ్ల బూట్లు మోసిన నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
 • పిచ్చి కుక్కలు మస్తుగా మొరుగుతాయి..పట్టించుకుంటమా 
 • ఉద్యమ సమయంలో రైఫిల్‌ పట్టుకొని తిరిగాడు 
 • అందుకే ఆయనకు రైఫిల్‌ రెడ్డి అని పేరు పెట్టారు
 • ఆనాడు ఆంధ్రోళ్ల చెప్పులు మోశాడు

హైదరాబాద్‌లో అప్పా జంక్షన్‌ దగ్గర భారీగా డబ్బు పట్టివేత 

 • 6 కార్లలో తరలిస్తున్న 6.5 కోట్ల నగదు పట్టుకున్న పోలీసులు
 • ఖమ్మం జిల్లాకు చెందిన ఓనేత డబ్బుగా అనుమానం

నల్లగొండ సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా కామెంట్స్‌

 • కేసీఆర్ కారును, కమీషన్ల ప్రభుత్వాన్ని మోదీ  గ్యారేజ్‌కు పంపాల్సిన  సమయం ఆసన్నమైంది
 • తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సిన అవసరం ఉంది
 • తెలంగాణలో మీరు ఇచ్చే ఓటు ద్వారా బీసీ ముఖ్యమంత్రి కల నెరవేరుస్తాం

అమీర్‌పేటలో ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టిస్తాం : తలసాని  

 • అమీర్‌పేటలో ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టిస్తాం
 • ఎన్టీఆర్‌ మహనీయుడు 
 • నాకు రాజకీయ భిక్ష పెట్టాడు
 • ఆయన నా గుండెల్లో ఎప్పుడూ ఉంటాడు
 • ఎన్నటికీ మరవను 

భైంసాను మైసాగా మారుస్తాం : బండి సంజయ్‌

 • అధికారంలోకి రాగానే..ముథోల్‌ను దత్తత తీసుకుంటా
 • బైంసాను మైసాగా మార్చి తీరుతాం
 • ముథోల్‌ను టెక్స్‌టైల్ పార్క్, పీజీ కాలేజీ, ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తాం
 • రైల్వేలేన్ సహా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
 • బాసర సరస్వతి ఆలయాన్ని అభివృద్ధి చేస్తా
 • ముథోల్ ఎవడి అయ్య జాగీరు కాదు
 • కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసాలను ముస్లిం సమాజం గుర్తించాలి
 • హిందూ సమాజమంతా ఓటుబ్యాంకుగా మారి సత్తా చాటాలి

సెక్రటేరియట్‌కు రాకుండా దేశంలో పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్: భట్టి

 • ముదిగొండ మండలం ఖానాపురంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం.
 • సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్.
 • సెక్రటేరియట్‌కు రాకుండా దేశంలో పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.
 • కేసీఆర్‌కు ప్రజలు ముఖ్యం కాదు.. ధరణి లాంటి కుంభకోణ పథకాలే ముఖ్యం.
 • దశాబ్దాల తరబడి తెలంగాణ ప్రజలు నీళ్ల కోసం పోరాడితే... 
 • కాళేశ్వరం నిర్మాణం పేరిట ఆర్దిక దోపిడీ చేసింది బీఆర్ఎస్ పాలకులు.
 • బీఆర్ఎస్ నిర్మాణం చేసిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులు పనికిరాని పునర్మించాలని వాస్తవాలు బయటపెట్టిన డ్యామ్ సేఫ్టీ అధికారులు..
 • కాళేశ్వరం ప్లాను ప్రకారం చేసిన డిజైన్ ప్రకారం నిర్మాణం జరగలేదు.
 • కాళేశ్వరం మిషన్ భగీరథ పేరిట 1,60,000 కోట్లు దోపిడీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.
 • అలంకారప్రాయంగా మారిన మిషన్ భగీరథ ట్యాంకులు పైపులు..
 • ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన ఏ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లను చూడలేదు.
 • ప్రజా సంపదను లూటీ చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాలేశ్వరంలో ముంచుదాం, దంచుదాం, దించుదామని సునామీల ప్రజల తిరుగుబాటు మొదలైంది
 • రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుంది, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..
 • కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో మధిర నియోజకవర్గం ప్రధాన భూమిక పోషిస్తుంది. 
 • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు విరివిగా తెస్తాం..

ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు 

 • కేటీఆర్‌ను సీఎం చేయడానికి కేసీఆర్‌ ఏమైనా చేస్తారు.
 • 20 ఏళ్లు కేసీఆర్‌ అడుగులో అగుగేసిన నన్ను గెంటేశారు
 • ఏదో ఒకరోజు హరీష్‌​ పరిస్థితి కూడా అంతే 
 • అల్లుడు కాబట్టి ఇన్నాళ్లు సర్దుకున్నాడు.
 • నేను బయటివాడిని కాబట్టి నన్ను గెంటేశారు.

ఆర్మూర్‌  నియోజకవర్గంలో హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం.

 • 200 రూపాయల పెన్షన్‌ను 2 వేలకు పెంచింది కేసీఆర్‌ 
 • మహిళల కోసం మరో పథకాన్ని తీసుకువస్తాం 
 • మహిళా మండలి భవనాలు కట్టిస్తాం
 • కోటి కుటుంబాలకు రైతు బీమా తరహాలో కేసీఆర్‌ బీమా 

నిజామాబాద్ అర్బన్‌లో  మంత్రి హరీశ్ రావు కామెంట్స్..

 • కేసీఆర్ రెండు వేల రూపాయల పించన్ ఇస్తే, బీజేపీ వాళ్ళు బీడీపై జీఎస్టీ వేసింది.
 • నీళ్ల కోసం అనేక కష్టాలు నాడు అనుభవించారు. ఇప్పుడు కష్టాలు లేవు.
 • రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగింది.
 • గణేష్ బిగాల గెలిస్తే ఇక్కడే ఉంటాడు సేవ చేస్తాడు
 • షబ్బీర్ అలీ వచ్చి ఇక్కడ ఉంటాడా..?
 • రాష్ట్రంలో బీజేపీ ఒకటి రెండు స్థానాల్లోనే పరిమితం.
 • కేసీఆర్ ను గెలిపిస్తే అభివృద్ధి కొనసాగుతుంది.
 • రాష్ట్రంలో కారు, నియోజకవర్గంలోనూ కారు ఉంటే.. అభివ్రుది మరింత వేగంగా జరుగుతుంది.

గద్వాల బీజేపీ విజయ సంకల్ప సభలో అమిత్‌షా

 • ఇచ్చిన హామీలు కేసీఆర్‌ నిలబెట్టుకోలేదు.
 • వచ్చే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు.
 • అబద్ధపు మాటలతో సీఎం కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారు.
 • బీఆర్‌ఎస్‌ టైం అయిపోయింది బీజేపీ వచ్చే సమయం వచ్చింది.
 • బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌ ఇచ్చే సమయం వచ్చింది.
 • తెలంగాణలో బీసీ సీఎంను చేస్తాం.
 • తెలంగాణలో బీసీ సీఎం కావాలంటే బీజేపీకి ఓటేయండి.
 • బీసీలకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అనుకున్న స్థాయిలో సీట్లు ఇవ్వలేదు.
 • డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుంది.
 • పెండింగ్‌ ప్రాజెక్టులను కేసీఆర్‌ పూర్తి చేయలేదు.
 • ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు.
 • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు బీసీ వ్యతిరేక పార్టీలు.
 • బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది.
 • పేపర్‌ లీకేజీ కారణంగా ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది.

బీజేపీ బీఆర్‌ఎస్‌ ఒక్కటే అని అర్థమైంది: విజయశాంతి

 • తెర ముందు ఒకటి.. తెర వెనుక ఒకటి మాట్లాడుతున్నారు.
 • కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది.. కేసీఆర్‌ అవినీతిని కక్కిస్తుంది.
 • కేసీఆర్‌ నాటిన విత్తనం బీజేపీలో సంజయ్‌ను మార్చేసింది
 • బండి సంజయ్‌ను మార్చిన తరువాత బీజేపీ గ్రాఫ్‌ పడిపోయింది.

 సీఎం కేసీఆర్‌పై  ఈటల రాజేందర్‌ ఫైర్‌

 • కేసీఆర్‌ అనుమతి లేకుండ చీమ కూడా చిటుక్కుమనది.
 • గతంలో నేను ఆర్ధిక మంత్రిగా ఉన్నా సొంత ఇర్ణయాలు తీసుకునే అవకాశం లేదు.
 • కేసీఆర్‌ను కాదని పనిచేసే సత్తా  మంత్రి హరీష్‌రావుకు ఉందా?
 • కేసీఆర్‌ మంత్రులంతా అతని బానిసలు, స్వతంత్రంగా పనిచేయలేరు.

మధిరలో భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం

 • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని దించుదాం
 • ప్రజలకు సంపద పంచుదాం
 • ఈ ప్రభుత్వంలో ఒక్కరికి రేషన్‌ కార్డు రాలేదు
 • తెలంగాణలో సంపదను ప్రజలకు పంచలేదు

కేసీఆర్‌ వస్తే కామారెడ్డి రూపురేఖలే మారిపోతాయి: కేటీఆర్‌

 • మూడు గంటలు కరెంట్‌ చాలని పీసీసీ అధ్యక్షుడు అంటున్నారు.
 • మూడు గంటల విద్యుత్‌తో మూడెకరాలు పారుతుందా?
 • రైతుల 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకోవాలని రేవంత్‌ సలహా ఇస్తున్నాడు.
 • కేసీఆర్‌ వస్తే కామారెడ్డి రూపురేఖలే మారిపోతాయి.

కాంగ్రెస్‌లో చేరితే ఇబ్బందులుంటాయని తెల్సు: పొంగులేటి

 • భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేటలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశం
 • పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జారే ఆదినారాయణ 
 • కార్యకర్తలను ఉద్దేశించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. 
 • మనకి ఓటు పడే ఏ ఒక్క అవకాశం వదలద్దు
 • పాత కాంగ్రెస్ వారితో ఐక్యత తో ముందుకు వెళదాం.
 • బుల్లెట్ దిగిందా? లేదా? అనేది చూపిద్దాం
 • జోరేడ్ల బండిలా తుమ్మల గారు నేను మీకు వుంటాము
 • కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరి  కష్టంలోను మా ప్రతినిధిగా జారేని నిలబెడుతున్నాము.
 • ప్రత్యర్థులు గుండెనొప్పి అని పడిపోయి ఓట్ల కోసం నాటకాలు ఆడచ్చు ..ఏది నమ్మద్దు
 • బూత్ స్థాయిలో ప్రతి యాభై కుటుంబాలకు ఒక్కో ఏజెంట్ కష్టపడాలి.
 • మ్యాజిక్ ఫిగర్ 60 లో మొదటిది అశ్వారావుపేట
 • మేము ఇరువురం కాంగ్రెస్ పార్టీ లో  లేనపుడు కాంగ్రెస్ జెండా మోసి పార్టీ ని ముందుకు నడిపించిన మి అందరికీ ధన్యవాదాలు.
 • కాంగ్రెస్ లో చేరితే ఇబ్బందులు వుంటాయని ముందే తెలుసు. అయినా నిస్వార్థంగా ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చాం
 • రాష్ట్రంలో కొద్ది మంది స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారినవారిని వదిలేయండి.
 • డిసెంబర్ 9 కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే అందరికీ పదవులు వస్తాయి..
 • కొత్త బిచ్చగాళ్ల మాటలు పట్టించుకోవద్దు..
 • తుమ్మల, నేను ఇద్దరం ఒక్కటే
 • ఏఐసీసీ నుండి ఎవరో ఒకరిని తీసుకువస్తాం
 • మీకు అందుబాటులోనే వుంటాం
 • డబ్బు, అధికార మదంతో వున్న అధికార పార్టీ, ఆ పార్టీ నాయకుల పప్పులు ఇక వుడకవు.
 • మనకి డబ్బు, పదవులు లేవు కానీ మన ప్రజా బలం ముందు ఏది నిలవదు..
 • ప్రతి ఒక్కరూ ఒక తుమ్మల, ఒక పొంగులేటి లా ప్రచారం చేసి జారే అదినారాయణని గెలిపించండి.

బేగంపేటకు చేరుకున్న అమిత్‌ షా 

 • హైదరాబాద్‌కు చేరుకున్న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా
 • గద్వాల సభకు బయల్దేరనున్న షా
 • గద్వాల తర్వాత నల్లగొండ, వరంగల్‌ సభలో పాల్గొననున్న షా
 • సాయంత్రం బీజేపీ మేనిఫెస్టో విడుదల

ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత

 • రాయికల్‌ మండలం ఇటిక్యాల గ్రామంలో రోడ్‌షోలో కల్వకుంట్ల కవిత ఎన్నికల ప్రచారం
 • సంజయ్‌ కుమార్‌కు మద్దతుగా కవిత ప్రచారం
 • ప్రచార వాహనంలో స్పృహతప్పి పడిపోయిన ఎమ్మెల్సీ కవిత
 • సపర్యలు చేసిన బీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తలు
 • ప్రాథమిక చికిత్స అందించిన గ్రంధాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్
 • ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించిన చంద్రశేఖర్‌
 • కోలుకుని కాసేపటికి మళ్లీ ప్రచారం ప్రారంభించిన కవిత

మళ్లీ అధికారంలోకి వస్తే సన్న బియ్యం ఇస్తాం: హరీష్‌ రావు
►ఓటువేసే ముందు ఆలోచించాలి.
►రూ. 200 పెన్షన్‌ను 4 వేలకు పెంచుకున్నాం.
►రైతు చనిపోతే రూ. 5లక్షల బీమా ఇస్తున్నాం.
►కాంగ్రెస్‌ వస్తే కర్ణాటక లెక్క మనం కూడా ఆగమైతం.
►బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను కాంగ్రెస్‌ కాపీ కొట్టింది.
►కాంగ్రెస్‌ పార్టీది ఒక జూటా మేనిఫెస్టో.

అలా అనలేదు.. బీఆర్‌ఎస్సే 420 పార్టీ: ఉత్తమ్‌

 • సాక్షితో కాంగ్రెస్‌ ఎంపీ, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్‌చాట్‌
 • నేను రైతు బంధు ఆపమని ఎక్కడా అనలేదు
 • నామినేషన్ ల పర్వం కు ముందే రైతు బంధు విడుదల చేయాలని చెప్పాం..
 • భయంతో కేసీఆర్ నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు
 • బీఆర్ఎస్ 420  పార్టీ
 • అవినీతి సొమ్ముతో బీఆర్ఎస్ నేతలు విర్రవీగుతున్నారు
 • ఉచిత కరెంట్ పేటెంట్ మాది..ఓటమి భయం తో కరెంటు పై మాపై అసత్య ప్రచారం చేస్తున్నారు
 • రాహుల్ గాంధీ పై మాట్లాడే స్థాయి బీఆర్ఎస్ నేతలకు లేదు
 • కాంగ్రెస్ 75 పైగా స్థానాలతో అధికారంలోకి రావడం ఖాయం

అర్బన్‌ ఓటర్లకు కేటీఆర్‌ విజ్ఞప్తి

 • అర్బన్‌ ఓటర్లను ఉద్దేశించి ట్వీట్‌ చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌
 • గణాంకాల ప్రకారం.. పట్టణాల్లో 50 శాతం కంటే తక్కువగా ఓటింగ్‌ నమోదు అవుతోందని ఆవేదన
 • నవంబర్‌ 30వ తేదీన ఓటు హక్కున్నంత వాళ్లంతా పోలింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి
 • ఎవరికి ఓటేస్తారనేది పక్కన పెట్టి.. ఓటేయాలని కోరిన కేటీఆర్‌ 
 • ఓటు అనే పవర్‌ను ఉపయోగించుకోవాలని సందేశం
 • పౌర విధిగా తోటి వాళ్లను ప్రొత్సహించాలని కోరిన కేటీఆర్‌
   

బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తేనే అభివృద్ధి: కవిత

 • జగిత్యాల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్నికల ప్రచారం
 • బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమని ప్రసంగం
 • సంజయ్‌ కుమార్‌ను తిరిగి గెలిపించాలని ఓటర్లకు కవిత విజ్ఞప్తి

నా మీద కేసీఆర్‌ 74 కేసులు పెట్టారు: బండి

 • కరీంనగర్‌లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఎన్నికల ప్రచారం
 • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు 
 • కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగా తనపై కేసులు పెట్టించారని మండిపాటు

గజ్వేల్‌లో ఈటల ప్రచారం

 • ఇవాళ గజ్వేల్‌లో ప్రచారం చేయనున్న ఈటల రాజేందర్‌
 • గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీకి దిగిన ఈటల
 • నియోజకవర్గంలో ర్యాలీ, సభల ద్వారా ఇవాళ ప్రజలతో మమేకం అయ్యే అవకాశం

కేసీఆర్‌ సభకు భారీగా జనసమీకరణ

 • జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాల పట్టణంలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వద సభ
 • పాల్గొని ప్రసంగించనున్న కేసీఆర్‌
 • భారీగా జనసమీకరణ చేపట్టిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు
 • నియోజకవర్గ పరిధిలోని ఎనమిది మండలాల నుండి ప్రజల్ని సభకు తరలింపు
 • అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.. లోకల్‌ లీడర్లు

కేటీఆర్‌ నియోజకవర్గ ప్రచారంలో ఉద్రిక్తత

 • సిరిసిల్ల నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో నెలకొన్న ఉద్రిక్తత
 • ఎల్లారెడ్డిపేట మండలం అక్కపెల్లిలో బీజేపీ ప్రచారాన్ని అడ్డుకున్న బీఆర్ఎస్ ఉపసర్పంచ్ గోగూరి ప్రదీప్ రెడ్డి..
 • బీజేపీ అభ్యర్థి రాణీరుద్రమ ప్రచారం చేస్తుండగా ఘటన
 • డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎక్కడ ఇచ్చారో చూపెట్టాలంటూ ఉప సర్పంచ్ ను నిలదీసిన రాణీరుద్రమ
 • 2 బీహెచ్‌కే ఇచ్చామంటూ ఉప సర్పంచ్ ప్రదీప్ రెడ్డి సమాధానం
 • బీజేపీ ప్రచారాన్ని అడ్డుకుంటే ఒక్క సైగ చేస్తే  వీపులు పగిలిపోతాయంటూ బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు
 • చేతనైతే మంత్రి కేటీఆర్ ను ఊళ్లల్లో తిప్పండంటూ వాగ్వాదం
 • ప్రచారాన్ని అడ్డుకున్న ఉప సర్పంచ్ ను అక్కడి నుంచి పంపించివేసిన పోలీసులు.

ట్విట్టర్‌లో ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసిన కల్వకుంట్ల కవిత

 • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వీడియో
 • ధాన్యపు రాశుల తెలంగాణను ప్రతిబింబించేలా తాను స్వయంగా వీడియోను చిత్రీకరించినట్లు ఎక్స్‌లో పోస్టింగ్‌ 
 • ఎన్నికల ప్రచారానికి గాను నిజామాబాద్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో ఆర్మూర్ లోని సిద్దులగుట్ట వద్ద రోడ్డుకు ఇరువైపులా రైతులు వడ్లను ఆరబెట్టిన దృశ్యాల్ని చిత్రీకరించిన కవిత
 • "ధాన్యపు రాశుల తెలంగాణ. అప్పుడు ఎట్లుంది తెలంగాణ..!! ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ !!" అని పోస్టులో పేర్కొన్న కవిత.

కాంగ్రెస్‌లో చేరనున్న పాల్వాయి రజనీ

 • హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ నేత పాల్వాయి రజిని
 • కాంగ్రెస్‌లోలో చేరేందుకు రంగం సిద్ధం
 • తుంగతుర్తి నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ రజిని

అది 420 మేనిఫెస్టో

 • కాంగ్రెస్‌ మేనిఫెస్టో అభయ హస్తంపై బీఆర్‌ఎస్‌ సెటైర్లు 
 • ఆచరణ సాధ్యం కాని హామీలు కాంగ్రెస్ ఇస్తోంది అంటూ బీఆర్ఎస్ నేతల కౌంటర్
 • కర్ణాటక లో ఇచ్చిన హామీలు గాలికొదిలిన కాంగ్రెస్ తెలంగాణ లో ఏ విధంగా ఇస్తారంటు ఎదురుదాడి
 • మేం కూడా చాలానే హామీలు ఇవ్వొచ్చు కానీ మేం చేసేదే ఇస్తామని ప్రజలకు చెప్తున్న బీ ఆర్ ఎస్
 • ఇచ్చిన హామీలు అమలు చేయలేక కర్ణాటక లో  ఖజానా ఖాళీ 
 • ఆరునెలలకే కర్ణాటక లో.కాంగ్రెస్ పరిస్తితి ఆగమయ్యిందని బీ ఆర్ ఎస్ నేతల కౌంటర్

రేపు తెలంగాణకు ప్రియాంక గాంధీ

 • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రియాంక గాంధీ
 • అసిఫాబాద్, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం


నల్లగొండ జిల్లా చిట్యాలలో చిరుమర్తి ప్రచారం 

 • చిట్యాల మండలం లోని 9, 10 వార్డుల్లో ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య,
 • బీఆర్‌ఎస్‌ నేతలు గుత్తా అమిత్ రెడ్డి, పార్టీ శ్రేణుల సహా ప్రచారం

చేర్యాలకు కేసీఆర్‌ 

 • నేడు చేర్యాలలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ
 • ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ  సభలో పాల్గొనున్న సీఎం కేసీఆర్‌

ముదిగొండలో మల్లు ప్రచారం నేడు

 • ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో నేడు మల్లు భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం
 • మధిర కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో ఉన్న మల్లు భట్టి విక్రమార్క

మందమర్రిలో విన్నూత్న ప్రచారం

 • మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఓయూ జేఏసీ విద్యార్థుల విన్నూత్న ప్రచారం
 • బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేస్తే నిరుద్యోగులకు ఉరితాడు వేసినట్లేనని నినాదాలు 
 • చంపినట్లేనని మెడలో ఉరి తాళ్ళు వేసుకొని ప్రచారం నిర్వహించిన ఓయూ జేఏసీ నేతలు.

ఆరేళ్ల తర్వాత మళ్లీ అమిత్‌ షా..

 • ఇవాళ నల్లగొండలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన
 • 2017 తర్వాత తొలిసారి నల్లగొండకు వస్తోన్న అమిత్ షా
 • ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్న బీజేపీ అగ్రనేత
 • మేకల అభినవ్ స్టేడియంలో మధ్యాహ్నం జరిగే సభకు హాజరు
 • 2:55 గంటల నుంచి 3:30 గంటల వరకు సభలో పాల్గొని ప్రసంగించనున్న అమిత్ షా. 
 • షా పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి‌న అధికార యంత్రాంగం 
 • భారీ జన సమీకరణపై దృష్టి పెట్టిన బీజేపీ నేతలు

ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై విజయశాంతి స్పందన

 • వ్యక్తుల్ని విమర్శించే సంస్కారం మాకు అటల్ జీ, అద్వానీ జీ, నాటి బీజేపీ నేర్పలేదు
 • బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని తెలంగాణ సమాజం అంటున్నది
 • అందుకు సమాధానం చెప్తే ఎంతో కొంతైనా సమంజసం కావొచ్చు 
 • నన్ను బాధపెట్టే మాటలతో విమర్శించడం సరికాదు
 • విజయశాంతి బీజేపీలోనుంచి వెళ్లిపోయినందుకు పీడపోయిందన్న నిజామాబాద్ ఎంపీ అర్వింద్
 • ప్రజల్లో ఉన్నవాళ్లంతా బీజేపీలోనే ఉన్నారని.. పాపులారిటీ లేకుండా రాజకీయాలు చేసేవారే ఇతర పార్టీల్లోకి వెళ్తారంటూ విజయశాంతిని ఉద్దేశించి ప్రకటన
 • విజయశాంతి పార్టీ వదిలినంత మాత్రాన పార్టీకి ఏమాత్రం ఇబ్బంది లేదని వ్యాఖ్య  

ఇరకాటంలో కాంగ్రెస్

 • మానుతున్న గాయం పై పెట్రోల్ పోసిన కాంగ్రెస్‌ సీనియర్‌ చిదంబరం 
 • తెలంగాణ ఆత్మహత్యలు అని చిదంబరం స్టేట్‌మెంట్‌
 • చిదంబరం వాఖ్యల నేపథ్యంలో​ కాంగ్రెస్ పై కొనసాగుతున్న  ఫ్లెక్సీ వార్ 
 • నిన్న రాహుల్ గాంధీ పర్యటనలో వెలిసిన ఫ్లెక్సీలు
 • ఇవాళ.. ఉద్యమకారులను బలిగొన్న కాంగ్రెస్ను బతకనీయద్దు అంటూ హైదరబాద్‌ నగరంలో పలు చోట్ల వెలసిన ఫ్లెక్సీలు 
 • శ్రీకాంత చారి ఫోటోతో పాటు పలువురి ఫొటోలతో ఫ్లెక్సీ

బండిని తప్పించాక బ్రేకులు పడింది వాస్తవమే: కేంద్ర మంత్రి

 • దివాళీ మిలన్‌ సందర్భంగా మీడియాతో బీజేపీ అగ్రనేతలు
 • తెలంగాణలో దూసుకెళ్తున్నాం: ప్రధాని మోదీ
 • బీజేపీ సర్కారు ఏర్పాటు దిశగా పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి: ప్రధాని మోదీ
 • తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది: అమిత్‌ షా
 • బండి సంజయ్‌ను తప్పించాక పారీ్టకి బ్రేక్‌లు పడ్డమాట వాస్తవమే: అనురాగ్‌ ఠాగూర్‌
 • గతంలో సంజయ్‌ సారథ్యంలో దూకుడు మీదున్న బీజేపీ : అనురాగ్‌ ఠాగూర్‌
 • కొన్ని నిర్ణయాలను పార్టీకే వదిలేయాలి .. ఇంతకంటే ఏం చెప్పలేను: అనురాగ్‌ ఠాగూర్‌

వరంగల్‌పై ప్రధాన పార్టీల ఫోకస్
నేడు వరంగల్‌లో అమిత్ షా సభ
ఖిలా వరంగల్ మైదానంలో సభ
నిన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పాదయాత్ర 
తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో నేడు అమిత్ షా సభ
సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి
పలువురు స్థానిక నేతలు దగ్గరుండి పనులు పర్యవేక్షణ

నేడు బీజేపీ మేనిఫెస్టో 
విడుదల చేయనున్న అమిత్‌ షా
మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు అమిత్‌షా
12.50 గంటలకు గద్వాల చేరుకుని అక్కడ బీజేపీ ఎన్నికల బహిరంగసభలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 2.45 గంటలకు గద్వాల నుంచి నల్లగొండకు బయలుదేరుతారు
సాయంత్రం 4.20 గంటలకు వరంగల్‌ చేరుకుని అక్కడి బహిరంగసభలో ప్రసంగిస్తారు.
సాయంత్రం 6 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు.
సాయంత్రం 6.10 గంటలకు హోటల్‌ కత్రియలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను అమిత్‌ షా విడుదల చేస్తారు.
సాయంత్రం 6.45 నుంచి 7.45 గంటల వరకు క్లాసిక్‌ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్‌ ముఖ్యనేతలతో సమావేశంలో
రాత్రి 8 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.

కాళేశ్వరం కంటే ధరణి పెద్ద కుంభకోణం: ప్రకాశ్‌ జవదేకర్‌ 
బీఆర్‌ఎస్‌ సర్కార్‌ అతిపెద్ద మోసం 
బీజేపీ అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం 
ధరణి బాధితులకు న్యాయం చేస్తాం 

మంత్రి మల్లారెడ్డి అఫిడవిడ్‌లో తప్పులు 
తిరస్కరించాలని హైకోర్టులో పిటిషన్‌ 
మంత్రి మల్లారెడ్డి తన ఎన్నికల అఫిడవిట్‌లో విద్యార్హతకు సంబంధించి తప్పుడు సమాచారం
ఆయన నామినేషన్‌ తిరస్కృతికి రిటర్నింగ్‌ అధికారిని ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్‌
కీసర మండలం రామపల్లి దాయరకు చెందిన అంజిరెడ్డి పిటిషన్‌
2014, 2018లో పేర్కొన్న విద్యార్హతలు.. తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్‌ పేర్కొన్న విద్యార్హతకు తేడా
ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఇది చట్టవిరుద్ధం
ఈ పిటిషన్‌పై ఒకటి రెండు రోజుల్లో హైకోర్టు విచారణ

ఆర్వోల నిర్ణయమే అంతిమం: డిప్యూటీ సీఈఓ సత్యవాణి  
వారి నిర్ణయాలను పునఃసమీక్షించే అధికారం ఈసీకి కూడా ఉండదు 
20లోగా బ్యాలెట్‌ పత్రాల ముద్రణ పూర్తి..
3 రోజుల పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ నిర్వహణ 

ఈసారి పర్యాటక మంత్రిగా ఉంటా: బీఎన్‌ఐ సదస్సులో కేటీఆర్‌
అవసరమైతే కేసీఆర్‌ను బతిమాలుకుంటా 
కొత్త రిజర్వాయర్ల పరిసరాల్లో ఎన్నో ఉపాధి అవకాశాలు 
తెలంగాణ ‘3.ఓ వర్షన్‌’ డెవలప్‌మెంట్‌కు ఐకాన్‌గా నిలుస్తుంది

అర్దరాత్రి ఓల్డ్ సిటీలో కేటీఆర్‌ సందడి 

 • సాదాసీదా గా పాతబస్తీ లోని ఓ హోటల్ కి వెళ్ళిన కేటీఆర్
 • బిర్యానీ,పలు రకాల వంటకాలను ఆస్వాదించిన కేటీఆర్
 • ఎలాంటి హడావిడి లేకుండా సడెన్ గా వెళ్లిన కేటీఆర్
 • ఐస్ క్రీమ్ తో పాటు మరో హోటల్ లో టీ తాగిన కేటీఆర్
 • కేటీఆర్ రావడంతో సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం

మరిన్ని వార్తలు