గవర్నర్‌ వెళ్లేదాకా.. ఏరియల్‌ సర్వే గుర్తు రాలేదా? కేసీఆర్‌పై బండి ఫైర్‌

17 Jul, 2022 00:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలు ప డుతున్న బాధలను స్వయంగా తెలుసుకుని సాయం చేయాలనే ఉద్దేశంతో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లాలని నిర్ణయిస్తే.. ఉలిక్కిపడ్డ సీఎం కేసీఆర్‌ ఏరియల్‌ సర్వేకు బయల్దేరిన విషయం వా స్తవం కాదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ప్రశ్నించారు.

వందలాది గ్రామాలు నీట మునిగి లక్షలాది మంది ఇల్లు వాకిలి కోల్పోయి నిరాశ్రయులైతే, వారిని ఎలా ఆదుకోవాలనే ఆలోచన లే కుండా ఎంపీలతో సమావేశం పేరుతో కేంద్రంపై బురద చల్లే రాజకీయాలు చేయ డం కేసీఆర్‌ దివాళాకోరుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. సోమవారం నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన సంజయ్‌ శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు.

ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణ అభివృద్ధి చెందుతోందంటూ సీఎం మాట్లాడటం ఓ వింత అని ఎద్దే వా చేశారు. రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణతో అభివృద్ధి చెందుతుంటే ఉద్యోగులకు జీతాలెందుకు సక్రమంగా ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజన జరిగే నాటికి రూ.390 కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రం.. కేసీఆర్‌ 8 ఏళ్ల పాలనలో రూ.16,500 కోట్ల లోటు బడ్జెట్‌కు దిగజారిందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే కస్తూర్బా విద్యాలయాల ఉద్యోగులకు 60% మాత్రమే జీతాలు చెల్లిస్తూ.. రాష్ట్రం వాటా నిధులను కేటాయించకుండా, వారికి పూర్తి జీతా లివ్వకుండా ఇబ్బంది పెడుతోంది నిజం కాదా? అని సంజయ్‌ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు