కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ ఓటమి

3 Dec, 2023 16:30 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సంచలన విజయం సాధించారు. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి, కేసీఆర్ మూడో స్థానానికి పడిపోయారు.

రాష్ట్రంలోనే వీవీఐపీ సెగ్మెంట్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. కామారెడ్డి కింగ్‌ ఎవరవుతారన్న దానిపై తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే చర్చ జరిగింది. సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలో నిలబడటంతో సీఎంను ఓడిస్తానంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీకి దిగిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్‌, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని ఓడించి బీజేపీ అభ్యర్థి తన సత్తా చాటారు.


 

మరిన్ని వార్తలు