ఇది మోదీ సునామీ: సీఎం రేసులో బీజేపీ రేసు గుర్రాలు

3 Dec, 2023 15:58 IST|Sakshi

రాజస్థాన్‌లో  బీజేపీ ఆధిక్యం అప్రతి హతంగా కొనసాగుతోంది. కీలక నేతలు భారీ మెజారిటీతో  విజయం సాధించి గెలుపు గుర్రాలు నిలిచారు. ముఖ్యంగా  బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి  వసుంధర రాజే ఝల్రాపటన్ అసెంబ్లీ స్థానంలో భారీ మెజారిటీతో  గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కంటే 53,193 ఓట్ల ఆధిక్యంతో  ఆమె విజయం సాధించారు. దీంతో  ఆమె మళ్లీ రాజస్థాన్ ముఖ్యమంత్రి కుర్చీని  అధిరోహించాలని ఆమె మద్దతుదారులు కోరుకుంటున్నారు.  

మరోవైపు బీజేపీ ఎంసీ దియా కుమారి విద్యాధర్ నగర్‌లో 71,368 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సీతారాం అగర్వాల్‌పై విజయం సాధించారు. రాజకుటుంబానికి చెందిన కుమారికూడా సీఎం రేసులో ఉన్న సంగతి తెలిసిందే.  తన విజయం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె దేశవ్యాప్తంగా మోదీ సునామీ  వస్తోందని వ్యాఖ్యానించారు.  ఈ గెలుపు ప్రధాని మోదీ, అమిత్ షా జీ, జేపీ నడ్డా జీ, రాష్ట్ర నాయకులు  పార్టీ కార్యకర్తలకే చెందుతుంతన్నారు. రాజస్థాన్‌తో పాటు ఎంపీ ,ఛత్తీస్‌గఢ్‌లో కూడా మోదీజీ మ్యాజిక్ పనిచేసింది, రాష్ట్రంలో సుపరిపాలన, అభివృద్ధిని అందిస్తాం.. ఇప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతలు కనిపిస్తున్నాయి.. ఇక సీఎం ఎవరనేది పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయిస్తుందని దియా వ్యాఖ్యానించారు.

మాజీ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ జోత్వారా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ చౌదరిపై  ఆయన సునాయాసంగా విజయాన్ని నమోదు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ప్రధాని మోదీ,  బీజేపీ శ్రేణులకు,  జోత్వారా ప్రజలకు  కృతజ్ఞతలు తెలిపారు. తాము చెప్పేది చేసే పార్టీకి చెందిన వారమని ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు