పేదలు పేదరికంలో ఉండకూడదనేదే సీఎం జగన్‌ లక్ష్యం

4 Nov, 2023 19:47 IST|Sakshi

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికారిత బస్సుయాత్రలో భాగంగా గుంటూరు ఈస్ట్‌లో నిర్వహించిన సభకు పెద్ద ఎత్తున స్పందన లభించింది. భారీ సంఖ్యలో ప్రజలు వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర సభకు సంఘీభావం తెలిపారు. దీనిలో భాగంగా పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రసంగించారు.

గుంటూరు ఈస్ట్ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ..  ‘ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదవాడిని గొప్పవాడుగా చేశాడు. కులం, మతం, ప్రాంతం, పార్టీ విభేదాలు లేకుండా పథకాలు అందరికీ అందించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు.  ఆశయం ఉన్న వ్యక్తి మంచి చేస్తాడని తెలుసు. నన్ను రెండు సార్లు గెలిపించారు’ అని స్పష్టం చేశారు. 

మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ‘ ఎంతోమంది మేధావులు సామాజిక విప్లవం కోసం ఎన్నో పోరాటాలు చేశారు. కానీ సీఎం జగన్‌ మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు బ్రతకడానికి అవకాశం లేకండా చంద్రబాబు పాలన చేశారు.  అందుకే వారంత కలిసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేశారు.  ఏపీ రాష్ట్రం అంబేద్కర్‌ భావజాలంతో ముందుకెళుతోంది.  అవినీతి చేసి దొరికిపోయిన చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు’ అని పేర్కొన్నారు.

ఎంపీ మోపీదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. ‘ సీఎం జగన్‌ లక్ష్యం ఒక్కటే.. అందుకే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా రాజకీయంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పైకి తీసుకొస్తున్నారు. సంతలో పశువుల్లాగా రాజ్యసభ ఎంపీ పదవులను చంద్రబాబు అమ్ముకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రతిపక్షాలు చేసిన న్యాయం ఏంటో ఆ నేతలు చెప్పాలి.  చంద్రబాబుకు ఏపీలో చెప్పుకోవడానికి చిరునామా లేదు. 

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు ఒక అబద్ధం.. చంద్రబాబు అంటేనే మోసం.  అబద్ధానికి చెక్‌ పెట్టింది సీఎం జగన్‌. పేదరిక పెద్ద రోగమని దాని ఔషధం నవరత్నాలే అని సీఎం జగన్‌ నమ్మారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రక్షకులు సీఎం జగన్‌. ఆయన పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. సీఎం జగన్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీ,  బీసీ, మైనార్టీలు రాజ్యాధికారాన్ని సాధించారు. చంద్రబాబు జడ్జి ముందు కూడా అబద్ధాలు చెప్పాడు. మొన్న ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యి నిన్న డిశ్చార్జ్‌ అయ్యారు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఓటు బ్యాంక్‌గా వాడుకున్నారు.  సీఎం జగన్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి’ అని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే అఫీజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ..  ‘ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. దేశంలోనే సామాజిక న్యాయాన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. గత టీడీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీ సోదరులకు అన్యాయం చేస్తే.. జగన్‌ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసింది’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు