చంద్రబాబు, లోకేష్‌లకు మతి భ్రమించింది: జూపూడి

5 Sep, 2021 11:57 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: సామాజిక​ న్యాయానికి ప్రతి రూపం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, అన్ని వర్గాలకు ఆయన సమ న్యాయం చేశారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత జూపూడి ప్రభాకర్‌ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కార్పొరేషన్‌ డైరెక్టర్లలో 52 శాతం మహిళలకు ఇచ్చారన్నారు. నామినేటెడ్‌ పదవుల్లోనూ సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయం చేశారన్నారు. టీడీపీ శ్రేణులు కావాలని విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

దళితులకు చంద్రబాబు హయాంలో ఏం న్యాయం జరిగిందని జూపూడి ప్రశ్నించారు. బలహీన వర్గాలను ముందుకు తీసుకెళ్లడమే సీఎం జగన్‌ లక్ష్యమన్నారు. సామాజిక న్యాయం చేసి చూపించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌లకు మతి భ్రమించింది. బాబు ఎప్పుడూ బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగానే చూశారని దుయ్యబట్టారు. బలహీనవర్గాలను చంద్రబాబు ఎప్పుడూ చులకనగానే చూశారని జూపూడి ధ్వజమెత్తారు. ఎస్టీ అధికారి సవాంగ్‌పై టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సామాజిక న్యాయాన్ని చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని జూపూడి ప్రభాకర్‌ దుయ్యబట్టారు.

ఇవీ చదవండి:
విద్యార్థి మృతిపై లోకేశ్‌ తప్పుడు ప్రచారం
టీడీపీ అప్పులతోనే తిప్పలన్నీ..

మరిన్ని వార్తలు