సాధికారతను చాటిన మచిలీపట్నం

29 Nov, 2023 17:56 IST|Sakshi

మచిలీపట్నం(కృష్ణాజిల్లా): మచిలీపట్నంలో సామాజిక సాధికారత నినాదం ఉ‍ప్పొంగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల ‘జై జగన్‌’ నినాదాలతో మచిలీపట్నం  హోరెత్తింది.  నియోజకవర్గంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ ఎదుట బుధవారం నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర సభకు అశేష జనవాహిని తరలివచ్చింది. 

ఈ కార్యక్రమంలో ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పేర్ని నాని, ఎమ్మెల్యేలు కైలే అనిల్‌ కుమార్‌, హఫీజ్‌ ఖాన్‌, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్‌, పోతుల సునీత, కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌ పర్సన్‌ ఉప్పాల హారిక తదితర వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు

మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘గడచిన 75 ఏళ్లల పాలన కంటే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలన భిన్నమైనది. ప్రజల ఆకాంక్షలు,ఆశలు నెరవేర్చాలనేదే సీఎం జగన్‌ తాపత్రయం. ఈ దేశంలో రాజకీయ అవకాశం కల్పించాలని ఎంతోమంది ఉద్యమాలు చేశారు. అన్ని వర్గాలకు అధికారం కట్టబెట్టిన వ్యక్తి  సీఎం జగన్‌.ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేనే ఇలా చేయగలరు. గత ప్రభుత్వంలో మైనార్టీలు,గిరిజనులకు కనీస అవకాళం కల్పించలేదు.  పేదల కన్నీళ్లు తుడిచి ఆకలి తీరుస్తుంటే చంద్రబాబు బాధపడిపోతున్నాడు. డబ్బంతా ఖర్చైపోతోందని గగ్గోలు పెడుతున్నాడు.  ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి  32 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వడం మామూలు విషయం కాదు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏనాడైనా జరిగిందా ఇలా?

12,800 కోట్లు ఖర్చు చేసి పేదలకు ఇంటి స్థలాలు అందించారు.ఊళ్లకు ఊళ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి చంద్రబాబు పేదవాడి కోసం ఒక్క సెంటు స్థలమైనా కొన్నాడా?,పథకాలను ఓట్లతో ముడిపెట్టడం చంద్రబాబుకి అలవాటు. ఈ రాష్ట్రంలో ప్రైవేట్ విద్య ఎదగడానికి ఎవరు కారణం. ప్రైవేట్ విద్య ఎవరి కారణంగా వచ్చింది. సీఎం జగన్‌ వచ్చాక ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం దక్కింది. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు. అధికారంలోకి వచ్చి ఏం చేస్తాడో చంద్రబాబు చెప్పాడా?, ఎందుకు చంద్రబాబుకి ఓటేయాలి.నాలుగేళ్లు ఈ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చంద్రబాబు వేస్ట్ అన్నాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కంటే ఎక్కువ ఎలా ఇస్తానంటున్నాడు’ అని ప్రశ్నించారు.

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ..  ‘ సామాజిక సాధికార యాత్ర ఎందుకో రాష్ట్రమంతా పర్యటించి తెలియజేస్తున్నాం. బీసీలను గుండెల్లో పెట్టుకుని చూస్తానని సీఎం జగన్‌ చెప్పారు. చెప్పిన మాట ప్రకారం ప్రతీ పదవుల్లో 50 శాతం అవకాశం కల్పించారు. 40 ఏళ్లుగా టీడీపీ నేతల గుండెల్లో బీసీలమైన మేము సున్నాలమే. మీ దృష్టిల్లో సున్నాలమైన మమ్మల్ని సీఎం జగన్‌ నాయకులను, మంత్రులను చేశారు. మన తరాలు, తలరాతలు మారాలని, ఆలోచన చేసిన వ్యక్తి సీఎం జగన్‌. 

చంద్రబాబు గతంలో ఎంతమందికి కత్తెరలు,ఇస్త్రీపెట్టెలు ఇచ్చాడు. ఓ పది వేల మందికి కత్తెరలు,ఇస్త్రీపెట్టెలతో మసిపూసి మారేడుకాయ చేశారు. నేను మీకు మంచి చేస్తేనే ఓటేయండని చెప్పే ధైర్యం జగనన్నకు తప్ప ఎవరికైనా ఉందా?, ప్రజలను ముంచేందుకు మళ్లీ తండ్రీ కొడుకులు రెఢీ అవుతున్నారు. చంద్రబాబు మత్స్యకారుడిని తోలుతీస్తానన్నాడు. సీఎం జగన్‌ మత్స్యకారుడిని రాజ్యసభకు పంపించారు రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలో బోట్లు తగలబడితే కేవలం నాలుగు రోజుల్లో వారికి సాయం అందించిన వ్యక్తి సీఎం జగన్‌. 2024 ఎన్నికల్లో మళ్లీ జగన్‌ గెలిపించుకుందాం. 

కులం పేరుతో ఒకాయన పార్టీ పెట్టాడు. చంద్రబాబును సీఎం చేయడానికి పనిచేస్తానంటున్నాడు. కాపులంతా ఆలోచన చేయాలి.రాబోయే ఎన్నికలు బక్కవాడికి...బలిసినోడికి మధ్య యుద్ధం. తండ్రిని అరెస్ట్ చేస్తే ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్.ఆ పప్పు పులకేష్ మనకు అవసరమా ...ప్రజలు ఆలోచన చేయాలి. మచిలీపట్నం నుంచి 2024లో పేర్ని కిట్టుని అంతా ఆశీర్వదించాలి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా నుంచి ఒక్క బీసీ మంత్రి రాలేడు.  కానీ సీఎం జగన్‌ ఒక బీసీనైన నన్ను మంత్రిని చేశారు.’ అని తెలిపారు.

ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ‘మచిలీపట్నంలో  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు డీబీటీ ద్వారా రూ. 615 కోట్లు అందాయి. మచిలీపట్నం పోర్టు నిర్మాణం జరుగుతోంది. మచిలీపట్టణాన్ని పేర్ని నాని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనంత సామాజిక న్యాయాన్ని సీఎం జగన్‌ చేసి చూపించారు.

ఎంపీ అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్ర వర్ణ పేదలకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేసింది. అధికారంలోకి వచ్చాక ఏం చేశామో బస్సుయాత్రలో ప్రజలకు తెలియజేస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన 17 మందికి కేబినెట్‌లో మంత్రులుగా సీఎం జగన్‌ అవకాశం ఇచ్చారు. 13 జెడ్పీ చైర్మన్లలో9 చోట్ల అట్టడుగువర్గాలకు స్థానం కల్పించారు. రాజకీయంగా మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశారు. వైఎస్సార్‌సీపీ నాలుగేళ్ల పాలనలో పేదరికం తగ్గించగలిగాం’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు