ప్రభాస్‌తో సినిమా.. రన్‌ టైమ్‌ ఎంతో చెప్పేసిన సందీప్‌ రెడ్డి వంగా

29 Nov, 2023 15:52 IST|Sakshi

సందీప్‌ రెడ్డి వంగా.. ఇండియన్‌ సినిమా బిగ్గెస్ట్‌ డైరెక్టర్‌ జాబితాలో ఆయన ఎప్పుడో చేరిపోయాడు.. ఇప్పటి వరకు ఆయన చేసిన చిత్రాలు కేవలం రెండు మాత్రమే.. అర్జున్‌ రెడ్డి, యానిమల్‌. అర్జున్‌ రెడ్డి రీమేక్‌ కబీర్‌ సింగ్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు సందీప్‌. ఇప్పుడు యానిమల్‌తో డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కానీ ఆయన డైరెక్ట్‌ చేసిన రెండు చిత్రాల రన్‌ టైమ్‌ 3 గంటలకు పైగానే ఉంటుంది. ఇంత నిడివి ఉన్న సినిమాను ఈ కాలం ఆడియన్స్ భరించగలరా అనే ప్రశ్నకు సందీప్‌ చెప్పిన సమాదానం ఇదే..

కథ బాగుంటే సినిమాకు భారీ రన్ టైమ్ పెద్ద ఇబ్బంది కాదు. అర్జున్ రెడ్డి 3 గంటల 6 నిమిషాలుంది. అది ఒక అమ్మాయి అబ్బాయి కథే. యానిమల్‌లో ఒక కుటుంబం, ప్రత్యర్ధులు ఇలా చాలా లేయర్స్ ఉన్నాయి. అర్జున్ రెడ్డి కంటే కేవలం 15 నిమిషాలే ఎక్కువ రన్‌ టైమ్‌ ఉందని చెప్పిన సందీప్‌ రెడ్డి.. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో  సందీప్‌ కూడా ఒక సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ సినిమా రన్‌ టైమ్‌ ఎంత ఉంటుందో రివీల్‌ చేశాడు సందీప్‌. దీనికి స్పిరిట్‌ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతుందని సందీప్‌ తెలిపాడు.

ఇప్పటికే కథ దాదాపు పూర్తి అయిందని తాజా ఇంటర్వ్యూలో చెప్పిన సందీప్‌.. ఈ సినిమా రన్‌ టైమ్‌ సుమారుగా 3 గంటలు ఉంటుందని ఆయన ప్రకటించాడు. ఒకవేళ కథలో మార్పులు జరిగితే మాత్రం 2:45 గంటలు ఉండవచ్చని చెప్పాడు. ప్రభాస్‌తో తీస్తున్న సినిమాపై ఎవరెన్నీ భారీ అంచనాలు పెట్టుకున్న ఎలాంటి ఇబ్బందిలేదని, అందుకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని సందీప్‌ చెప్పడం విశేషం. 2024లో ప్రారంభం చేసి 2025లో ప్రభాస్‌ సినిమా విడుదల కావచ్చని చెప్పాడు. 
 

మరిన్ని వార్తలు