జనసంద్రంతో హోరెత్తిన పెందుర్తి

25 Nov, 2023 17:54 IST|Sakshi

పెందుర్తి(అనకాపల్లిజిల్లా):  అనకాపల్లి జిల్లా పెందుర్తిలో శనివారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికారిత బస్సుయాత్ర జనసంద్రంతో హోరెత్తింది. ఎమ్మెల్యే అదీప్‌రాజు ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సంఘీభావం తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. ‘ రూపాయి లంచం లేకుండా సీఎం జగన్ పాలన చేశారు. కులాలు మతాలు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబులాగా మాట తప్పే వ్యక్తి సీఎం జగన్ కాదు. మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి సీఎం జగన్. నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అని చెప్పిన సీఎంలు గతంలో ఎవరు లేరు. ప్రభుత్వ పాఠాశాలలను కార్పొరేట్ పాటశాలలుగా మార్చిన నాయకుడు సీఎం జగన్.మహిళలు కోసం అమ్మ ఒడి,  చేయూత,  ఆసరా, వసతి దీవెన,  విద్య దీవెన వంటి పథకాలు ప్రవేశపెట్టారు. అధికారంలో ఉన్నపుడు అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు’ అని పేర్కొన్నారు

ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ‘ రాష్ట్ర చరిత్రలో ఏ సీఎం కూడా దైర్యంగా నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అని దైర్యం చెప్పలేదు. ప్రతి కుటుంబం సీఎం జగన్ పథకాలతో బాగుపడింది.పేదల పిల్లలను అగ్ర వర్ణాల పిల్లలతో సమానంగా చదివిస్తున్నారు. బీసీలను ఎస్సీలకు చంద్రబాబు అవమానించారు’ అని తెలిపారు.

ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. ‘ సామాజిక న్యాయం సీఎం వైఎస్ జగన్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమైంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎన్నో పదవులు కట్టబెట్టారు. త్వరలో వైజాగ్ వచ్చే సీఎం వైఎస్ జగన్‌కు స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు..

ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ.. ‘పెందుర్తి సభను చూసి చంద్రబాబుకు వణుకు పుడుతోంది. 2 లక్షల 35 వేల కోట్లు ప్రజలకు రూపాయి అవినీతి లేకుండా ఇచ్చిన గొప్ప నేత సీఎం వైఎస్ జగన్.సంక్షేమ పథకాలు వలన బడుగు బలహీనర్గాలు బాగుపడ్డాయి’అని స్పష్టం చేశారు. 

ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. ‘ బీసీలకు అత్యధిక మంత్రి ఇచ్చారు. దళిత మహిళను హోంమంత్రి చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది. బడుగు బలహీనర్గాల వారిని చంద్రబాబు ముష్టి వారిగా చూశారు. పేదల ఇంగ్లీష్ మీడియంను చంద్రబాబు అడ్డుకున్నారు. ద్రబాబు ఎన్నడూ నీతిగా పాలన చేయలేదు మళ్ళీ జగన్ సీఎం కాకపోతే మన జీవితం 25 ఏళ్లు వెనక్కి పోతుంది. రెండు ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు చంద్రబాబు ఎలా సంపాదించారు?, లేని రోగాలు చెప్పుకొని చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారు.  చంద్రబాబు ఒక దొంగ అని గతంలో పవన్ చెప్పారు. ప్యాకేజీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట మారిపోయింది’ అని మండిపడ్డారు.

స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ‘ జన ప్రవాహాన్ని చూస్తే వేదిక దగ్గరకు వెళ్ళగలనా అనే అనుమానం కలిగింది. సామాజిక సాధికార యాత్రకు ప్రవాహంలా తరలి వస్తున్నారు. సామాజిక సాధికార యాత్ర చూసి ప్రతి పక్ష పార్టీలు కలవర పాటుకు గురవుతున్నాయి. సామాజిక సాధికార యాత్రపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అంబేద్కర్ పూలే అశయాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారు. ఏపీ లో ఉన్న పేదరికాన్ని సీఎం జగన్ పారద్రోలుతున్నారు. పేదరికం ప్రభుత్వ పథకాలకు అనర్హత కాకూడదు అనేది సీఎం జగన్ విధానం.కులాలు మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అణగదొక్కిన కులాలను సీఎం జగన్ ఆదుకున్నారు. క్యాబినెట్ లో బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారు.బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను చట్ట సభలకు పంపించారు.’ అని స్పష్టం చేశారు.

whatsapp channel

మరిన్ని వార్తలు