చంద్రబాబు అబద్ధం.. జగన్ నిజం.. పాలకొల్లు సభలో మంత్రి వేణు

8 Nov, 2023 17:47 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా: పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని,  సంక్షేమ పథకాలతో వారి ఎదుగుదలకు ఆలోచన చేసిన నాయకుడు సీఎం జగన్‌ అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శ్రీహరి గోపాలరావు (గోపి) ఆధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహించారు. పాలకొల్లు బైపాస్ రోడ్డు రామచంద్ర గార్డెన్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. అనంతరం పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వరకు బస్సుయాత్ర సాగింది. గాంధీ బొమ్మల సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో మంత్రులు కొట్టు సత్యనారాయణ, విశ్వరూప్, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, ఇజ్రాయెల్ పాల్గొన్నారు.

మంత్రి వేణు మాట్లాడుతూ, గతంలో అబద్ధం అధికారంలో ఉంది.. ఆ అబద్ధమే చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. ‘‘ఎన్నికల సమయంలో నాలుగు మాయమాటలు చెప్పి అధికారం పొందాలని గత పాలకులు అనుకుంటున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 90 శాతం అమలు చేసిన నాయకుడు సీఎం జగన్‌. 139 బీసీ కులాలను గుర్తించి వారి సామాజిక స్థితి పెరగడానికి అండగా నిలిచారు. బీసీ వర్గాలను అణచివేసిన వ్యక్తి చంద్రబాబు. పేదరికంపై యుద్ధం చేయాలంటే ఆయుధం విద్య అని అంబేద్కర్ చెప్పారు. ఆయనకు నిజమైన వారసుడిగా విద్యకు సీఎం జగన్‌ ప్రాధాన్యత ఇచ్చారు’’ అని మంత్రి వేణు పేర్కొన్నారు.

‘‘విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన.. వంటి పథకాలతో అందరిని ద్రాక్షగా ఉన్న చదువును పేదలకు చేరువచేశారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌కు కోతలు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా జబ్బున్న వారిని జల్లెడ పట్టి వారికి అండగా నిలిచారు. గతంలో చంద్రబాబు బీసీలు వెళ్లి అడిగితేనే తోకలు కత్తిరిస్తా అన్నాడు. మంత్రి మండలిలో సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు సీఎం జగన్‌ ప్రాధాన్యత ఇచ్చారు.. బీసీ కులాలకు ఆత్మ గౌరవాన్ని నింపిన వ్యక్తి సీఎం జగన్‌.’’ అని మంత్రి చెప్పారు.

మూడు ప్రాంతాల్లో జరుగుతున్న వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికారిక యాత్ర బహిరంగసభలు ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సీఎం జగన్‌ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీల అగ్రవర్ణ పేదల ప్రభుత్వం. సామాజిక సాధికారత జగనన్నకే సాధ్యమైందని పాలకొల్లు సభ ద్వారా తెలుపబోతున్నాం. రెండు లక్షల 38 వేల కోట్లు అవినీతికి ఆస్కారం లేకుండా దళారీ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేరింది. అందులో ఒక లక్ష 78 వేల కోట్లు బీసీ సంక్షేమ శాఖ ద్వారా అణగారినవర్గాలకు చేరింది.  సీఎం జగన్‌ పాలన అణగారిన వర్గాల్లో మనోధైర్యం నింపింది’’ అని మంత్రి వేణు తెలిపారు.
చదవండి: ‘వెనుకబడిన వర్గాలకు అండగా సీఎం జగన్‌’ 

సామాజిక న్యాయం తుంగలో తొక్కిన ఘనత చంద్రబాబుది: మంత్రి విశ్వరూప్‌
ప్రజలను ఎలా మోసం చేయాలో చంద్రబాబుకి తెలిసినట్టు ఎవ్వరికీ తెలీదంటూ మంత్రి విశ్వరూప్ ఎద్దేవా చేశారు. చెప్పింది చెప్పినట్టు నెరవేర్చే ఒకే ఒక్కడు జగన్ మాత్రమే.. చంద్రబాబు ఇచ్చే హామీలు ఎన్నికలు ముగిసేవరకు మాత్రమే.. సామాజిక న్యాయం తుంగలో తొక్కిన ఘనత చంద్రబాబుది. దేశంలో అత్యుత్తమ పాలన జగన్ అందిస్తున్నారు. పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్ సైతం పింఛన్ విడతల వారీగా పెంచుతామని అన్నారు. 1లక్ష 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది. చంద్ర బాబు హయాంలో ఎస్సీ, మైనారిటీలకు ఒక్క మంత్రి పదవి లేదు. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన నాయకుడు సీఎం జగన్‌’’ అని మంత్రి కొనియాడారు.


 

మరిన్ని వార్తలు