చిత్రలేఖనంలో మెరిసిన ‘సింగూరు’ విద్యార్థులు

29 Mar, 2023 04:00 IST|Sakshi
చిత్రలేఖనంలో బహుమతులు సాధించిన విద్యార్థులు

పుల్‌కల్‌(అందోల్‌): అంతర్జాతీయ చిత్రలేఖన పోటీల్లో సింగూరు గురుకుల విద్యార్థులు సత్తాచాటారని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ తెలిపారు. ఈ నెల 5న ముంబాయికి చెందిన ఓ సంస్థ రంగోత్సవ్‌ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో పాల్గొన్న గురుకుల విద్యార్థులు 11 మంది బహుమతులు గెలుచుకున్నారు. కార్టున్‌ మేకింగ్‌ విభాగంలో మాలిక్‌ సోయం, గ్రీటింగ్‌ కార్డు విభాగంలో చందు, కె.నితీశ్‌, మహేందర్‌, అక్షయరాజ్‌, (హ్యండ్‌ రైటింగ్‌), సజయ్‌దత్‌(టాటు మేకింగ్‌), సుశాంత్‌(కార్టున్‌ మేకింగ్‌), ప్రవీణ్‌కుమార్‌, కార్తీక్‌(కలరింగ్‌), కౌషిక్‌(స్కెచ్చింగ్‌), అంతేకాకుండా గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణకు ఇండియన్‌ ఆర్ట్‌ మార్ట్‌ అవార్డు, చిత్రకళ ఉపాధ్యాయుడు శ్రీపాద్‌కు ఇండియన్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ ఆవార్డు లభించిందని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు