Ind vs Pak: మెగా క్రికెట్‌ టోర్నీ షెడ్యూల్‌ విడుదల.. భారత్‌- పాక్‌ మ్యాచ్‌ ఆరోజే

3 Dec, 2023 11:27 IST|Sakshi
భారత్‌ వర్సెస్‌ పాక్‌ మ్యాచ్‌ ఆరోజే (PC: BCCI/PCB)

దాయాదులు భారత్‌- పాకిస్తాన్‌ మరోసారి మెగా క్రికెట్‌ టోర్నీలో పోటీ పడనున్నాయి. ఆసియా మెన్స్‌ అండర్‌-19 వన్డే కప్‌లో భాగంగా డిసెంబరు 10న ముఖాముఖి తలపడనున్నాయి. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌ ఇందుకు వేదిక కానుంది.

కాగా అండర్‌-19 మెన్స్‌ ఆసియా కప్‌-2023కి సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్‌ మండలి శనివారం విడుదల చేసింది. దుబాయ్‌లో వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి శుక్రవారం(డిసెంబరు 8) తెరలేవనుంది.

గ్రూప్‌-ఏలో భాగమైన భారత్‌- అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌తో ఈ ఈవెంట్‌ ఆరంభం కానుంది. అదే రోజు మరో మ్యాచ్‌లో పాకిస్తాన్‌- నేపాల్‌తో తలపడనుంది. గ్రూప్‌ దశలో మ్యాచ్‌లన్నీ ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌, ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌-2లో జరుగనున్నాయి. అయితే, డిసెంబరు 17నాటి ఫైనల్‌కు మాత్రం దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది.

ఇక మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఆరంభం కానున్నాయి. కాగా ఆసియా అండర్‌-19 కప్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. గ్రూప్‌-ఏలో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ సహా పాకిస్తాన్‌, నేపాల్‌, అఫ్గనిస్తాన్‌ పోటీ పడనుండగా.. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌, జపాన్‌, యూఏఈ తలపడనున్నాయి.

భారత జట్టు కెప్టెన్‌గా ఉదయ్‌ సహారన్‌
ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమి కుమార్ పాండే (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాన్షు మొలియా, ముషీర్ ఖాన్, ధనుష్ గౌడ, అవినాష్ రావు (వికెట్ కీపర్), ఎం అభిషేక్, ఇన్నేష్ మహాజన్ (వికెట్ కీపర్), ఆర్ధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ.

ట్రావెలింగ్ రిజర్వ్స్: ప్రేమ్ దేవ్కర్, అన్ష్ గోసాయి, మహ్మద్ అమన్.
నాన్ ట్రావెలింగ్ రిజర్వులు: దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, పి.విఘ్నేష్, కిరణ్ చోర్మాలే.

మరిన్ని వార్తలు