IPL 2022: కేఎల్‌ రాహుల్‌ జట్టులోకి ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌..

24 Mar, 2022 09:14 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022 ఆరంభానికి ముందు కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ మార్క్ వుడ్‌ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్క్ వుడ్‌ స్ధానంలో ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై తో లక్నో సూపర్ జెయింట్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని లక్నో ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా వేదికగా ధ్రువీకరించింది. ఇక ఐపీఎల్‌ మెగా వేలంలో భాగంగా రూ.7.5కోట్లకు వుడ్‌ను లక్నో కొనుగోలు చేసింది.

అయితే వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో వుడ్‌ గాయపడ్డాడు. దీంతో విండీస్‌తో టెస్టులకు,ఐపీఎల్‌కు వుడ్‌ దూరమయ్యాడు. ఇక ఐపీఎల్‌-2022 మెగా వేలంలో కోటి రూపాయల కనీస ధరతో టై తన పేరు నమోదు చేసుకున్నాడు. కానీ అతడి పట్ల ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపకపోవడంతో అమ్ముడు పోకుండా మిగిలిపోయాడు. ఇప్పడు అతడిని కనీస ధర కోటి రూపాయలకే లక్నో కొనుగోలు చేసింది.

ఇక 2018 లో పంజాబ్‌ కింగ్స్‌(కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌) కు ప్రాతినిధ్యం వహించిన టై..  పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 27 మ్యాచ్‌లు ఆడిన టై.. 40 వికెట్ల పడగొట్టాడు. ఇక మార్చి 26 నుంచి  ఐపీఎల్‌-2022 ప్రారంభం కానుంది.   లక్నో సూపర్ జెయింట్స్‌ మార్చి 28 న గుజరాత్‌ టైటాన్స్‌ను ఢీకొట్టనుంది.

చదవండి: IPL 2022: చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌.. స్టార్‌ ఆటగాడు దూరం!

మరిన్ని వార్తలు