నేను ఇంకా ఎక్కడికీ వెళ్లడం లేదు: ధోని

17 Oct, 2021 06:05 IST|Sakshi

ప్రతీ ఫైనల్‌ ప్రత్యేకమే. ఫైనల్లో ఎక్కువసార్లు ఓడిన జట్టు కూడా మాదే. అయితే పడ్డ ప్రతీసారి కోలుకొని పైకి లేవడం అన్నింటికంటే ముఖ్యం. మేం ఆటగాళ్లను మారుస్తూ వచ్చాం. ప్రతీసారి ఒక మ్యాచ్‌ విన్నర్‌ బయటకు వచ్చి అద్భుతాలు చేశారు. నిజాయితీగా చెప్పాలంటే జట్టు సమావేశాల్లో మేం పెద్దగా మాట్లాడుకోం. ఏమైనా ఉంటే ఒక్కొక్కరితో విడిగా చెప్పడమే. మేం ఎక్కడ ఆడినా మాకు అండగా నిలిచే చెన్నై అభిమానులకు కృతజ్ఞతలు. ఇప్పుడు కూడా చెన్నైలో ఆడుతున్నట్లే అనిపించింది.

వచ్చేసారి రెండు కొత్త జట్లు వస్తున్నాయి కాబట్టి ఆటగాళ్లను కొనసాగించడం గురించి ఏమీ చెప్పలేను. నేను ఇదే జట్టుతో కొనసాగుతానా లేదా అనేది సమస్య కాదు.  ఫ్రాంచైజీ కోసం ఒక పటిష్టమైన జట్టును తయారు చేయడం ముఖ్యం. సరిగ్గా చెప్పాలంటే వచ్చే 10 ఏళ్లు జట్టును నడిపించగల ప్రధాన బృందాన్ని ఎంచుకోవడం ముఖ్యం. నా వైపు నుంచి గొప్ప ఘనతలు ఇచ్చి వెళుతున్నానని అంటున్నారు. కానీ నేను ఇప్పుడే పోతే కదా. –ఎమ్మెస్‌ ధోని, (చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌)

మరిన్ని వార్తలు