CWC 2023 IND Vs NZ Semi Finals: ఫుట్‌బాల్‌ను తాకిన క్రికెట్‌ ఫీవర్‌.. భారత్‌-కివీస్‌ సెమీస్‌ మ్యాచ్‌కు విశిష్ట అతిథులు

15 Nov, 2023 11:46 IST|Sakshi

క్రికెట్‌ ఫీవర్‌ యూనివర్సల్‌ గేమ్‌ ఫుట్‌బాల్‌ను కూడా తాకింది. ఇవాళ జరుగనున్న భారత్‌,న్యూజిలాండ్‌ వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ చూసేందుకు దిగ్గజ ఫుట్‌బాలర్‌ డేవిడ్‌ బెక్‌హమ్‌ హాజరుకానున్నాడని తెలుస్తుంది. బెక్‌హమ్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ మ్యాచ్‌ చూసేందుకు క్యూ కట్టనున్నారని సమాచారం.

బాలీవుడ్‌ స్టార్‌, చాక్లెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌, తలైవా రజినీకాంత్‌, బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌, కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ భారత్‌-కివీస్‌ సెమీస్‌ మ్యాచ్‌ చూసేందుకు ముంబైలోని వాంఖడే స్టేడియంకు తరలిరానున్నారని ప్రచారం జరుగుతుంది. 

బెక్‌హమ్‌ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్‌ స్టైలిష్‌ ఫుట్‌బాలర్‌, క్రికెట్‌ పట్ల తనకున్న మక్కువను గతంలో చాలా సందర్భాల్లో చాటుకున్నాడు. అలాగే బెక్‌హమ్‌కు ఇండియా అన్న ఈ దేశ క్రికెటర్లన్నా ప్రత్యేకమైన అభిమానం. ఓ సందర్భంలో అతను విరాట్‌ కోహ్లి పేరు ప్రస్తావించి పొగడ్తలతో ముంచెత్తాడు. ఆటగాడిగా ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాక పలు క్లబ్‌లకు కోచ్‌గా సేవలందించిన బెక్‌హమ్‌.. ప్రస్తుతం ఇంటర్‌ మయామీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ కో ఓనర్‌గా ఉన్నాడు. ఆల్‌టైమ్‌ గ్రేట్‌, అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ ప్రస్తుతం ఈ క్లబ్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 

మరిన్ని వార్తలు