Danish Kaneria Fires On BCCI: 'కోహ్లికి కనీస గౌరవం ఇవ్వకుండానే తొలగించారు': పాక్‌ మాజీ క్రికెటర్‌

11 Dec, 2021 13:45 IST|Sakshi

Ex- Cricketer Danish Kaneria Slams BCCI.. టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లిని తొలగించి మూడురోజులు కావొస్తుంది. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట కోహ్లిని కెప్టెన్సీ పదవి నుంచి తప్పించడంపై చర్చ జరుగుతూనే ఉంది. కోహ్లి స్థానంలో రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా ఎంపికచేయడంపై కొందరు విమర్శిస్తే.. మరికొందరు నిర్ణయం సరైందేనంటూ మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ దానిష్‌ కనేరియా కోహ్లి విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరును తప్పుబట్టాడు. తన యూట్యూబ్‌ చానెల్‌ లో కనేరియా మాట్లాడాడు. 

చదవండి: "విరాట్‌ కోహ్లిని తప్పించి బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుంది"

“కోహ్లీతో బీసీసీఐ సరిగా వ్యవహరించిందా అంటే? అలా జరగలేదని నా అభిప్రాయం. బీసీసీఐ కోహ్లికి కనీస గౌరవం ఇవ్వలేదు.  అతను కెప్టెన్‌గా భారత్‌కు 65 విజయాలు సాధించాడు. టీమిండియాకు అత్యధిక విజయాలు కట్టబెట్టిన భారత నాలుగో సారథిగా నిలిచాడు. రికార్డుల పరంగా చూస్తే అతన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. కెప్టెన్‌గా ఐసీసీ ట్రోఫీలను గెలవకపోవచ్చు.. కానీ కెప్టెన్‌గా టీమిండియాను అతను నడిపించిన మార్గం అసాధారణమైనది.

ఇక ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఉన్న ఇద్దరు సూపర్‌స్టార్లు మాత్రమే నాకు కనిపిస్తున్నారు. ఒకరు విరాట్ కోహ్లీ అయితే ఇంకొకరు బాబర్ అజమ్‌. మీరు సూపర్‌స్టార్‌లను గౌరవించాలి. కోహ్లీకి తెలియజేయకుండా బీసీసీఐ అతనిని తొలగించడంలో కఠినంగా వ్యవహరించింది. సౌరవ్ గంగూలీ గొప్ప వ్యక్తి, మాజీ కెప్టెన్ కూడా… అతను మేము రోహిత్‌ని కెప్టెన్‌గా చేయాలనుకుంటున్నామని విరాట్‌కు ముందే చెప్పాల్సింది. అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: బలమైన జట్టును తయారు చేయడం కష్టం.. కానీ నాశనం చేయడం ఈజీ కదా

మరిన్ని వార్తలు