ఢిల్లీ క్యాపిటల్స్‌లో కరోనా టెన్షన్‌

7 Sep, 2020 10:23 IST|Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభంకాకముందే ఆయా ఫ్రాంచైజీ సభ్యుల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు అసిస్టెంట్‌ ఫిజియోథెరపిస్ట్‌ కరోనా బారిన పడ్డాడు. దుబాయ్‌కు చేరుకున్నాక అతనికి నిర్వహించిన తొలి రెండు కోవిడ్‌–19 పరీక్షలు నెగెటివ్‌ రాగా... మూడో పరీక్షలో మాత్రం అతనికి పాజిటివ్‌ వచ్చిందని ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఆదివారం తమ అధికారిక ప్రకటనలో తెలిపింది. (చదవండి: ఫ్రస్టేషన్‌‌‌ జొకోవిచ్ కొంపముంచింది..)

అయితే కరోనా సోకిన ఫిజియోథెరపిస్ట్‌ ఇప్పటి వరకు జట్టు సభ్యులతో, ఫ్రాంచైజీ అధికారులతో కలవలేదని... అతను నిబంధనల ప్రకారం దుబాయ్‌లోని ఐపీఎల్‌ ఐసోలేషన్‌ కేంద్రంలో 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటాడని ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం తెలిపింది. ఐపీఎల్‌లో ఆడేందుకు వచ్చిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు చెందిన 13 మంది వ్యక్తులకు, బీసీసీఐ మెడికల్‌ జట్టులోని సభ్యుడికి కరోనా సోకింది.(చదవండి: ఇలా మొదలవుతోంది...)

మరిన్ని వార్తలు