ఐదో టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. బట్లర్‌, లీచ్‌ రీ ఎంట్రీ

7 Sep, 2021 20:39 IST|Sakshi

లండన్: టీమిండియాతో ఈ నెల 10 నుంచి ప్రారంభంకానున్న చివరి టెస్ట్‌ కోసం 16 మంది సభ్యులతో కూడిన ఇంగ్లండ్ జట్టును ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) మంగళవారం ప్రకటించింది. వ్యక్తిగత కారణాల చేత ఓవల్‌ టెస్ట్‌కు దూరమైన వికెట్ కీపర్ జోస్ బట్లర్, ఆఫ్ స్పిన్నర్ జాక్ లీచ్ తిరిగి జట్టులోకి రాగా, సామ్ బిల్లింగ్స్‌పై వేటు పడింది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌ వేదికగా జరుగనున్న చివరి టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ తుది జట్టులో రెండు మార్పులు జరిగే ఆస్కారం ఉంది.

జానీ బెయిర్‌స్టో, మొయిన్‌ అలీ స్థానాల్లో జోస్‌ బట్లర్‌, జాక్‌ లీచ్‌ ఫైనల్‌ ఎలెవెన్‌లో ఆడే అవకాశం ఉంది. మరోవైపు టీమిండియా సైతం ఓ మార్పు చేసేలా కనిపిస్తుంది. వరుసగా విఫలమవుతున్న జడేజా స్థానంలో అశ్విన్‌ను ఆడించాలని కోహ్లి భావిస్తున​ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఓవల్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో దారుణంగా విఫలమైన ఇంగ్లండ్ 157 పరుగుల తేడాతో టీమిండియా చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఫలితంగా 5 టెస్ట్‌ల సిరీస్‌లో కోహ్లీ సేన 2-1 ఆధిక్యంలోని దూసుకెళ్లింది. 

ఇంగ్లండ్ జట్టు:  జో రూట్ (కెప్టెన్) మెయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టో, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, సామ్ కరన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, డేవిడ్ మలాన్, క్రెయిగ్ ఓవర్టన్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, క్రిస్ వోక్స్, మార్క్‌ వుడ్
చదవండి:  టీమిండియా టెస్ట్‌ల్లో గొప్పే కావచ్చు.. వైట్‌ బాల్‌ క్రికెట్‌లో కాదు

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు