IND Vs ENG 5th Test: ఎంత పని చేశావు విహారి.. ఆ ఒక్క క్యాచ్‌ పట్టి ఉంటే..!

5 Jul, 2022 18:47 IST|Sakshi

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ 2-2లో సమమైంది. కాగా 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్‌ విజయంలో బెయిర్‌ స్టో(114), రూట్‌(142) పరుగులతో కీలక పాత్ర పోషించారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌, బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ భారత్‌ తీవ్రంగా నిరాశ పరిచింది.

ఇంగ్లండ్‌ విజయంలో హీరోగా నిలిచిన జానీ బెయిర్‌ స్టో ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను.. సెకెండ్‌ స్లిప్‌లో హనుమా విహారి జారవిడిచాడు. ఈ తప్పిదానికి భారత్‌ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 14 పరుగుల వ్యక్తిగత  స్కోర్‌ వద్ద బతికిపోయిన బెయిర్‌ స్టో.. ఏకంగా సెంచరీతో చెలరేగాడు. ఇక సులభమైన క్యాచ్‌ విడిచి పెట్టిన విహారిపై భారత అభిమానులు మండిపడుతున్నారు. ట్విటర్‌ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. "ఎంత పనిచేశావు  విహారి.. క్యాచ్‌ పట్టి ఉంటే మ్యాచ్‌ ఫలితం మరో విధంగా ఉండేది" అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ ఐదో టెస్టు స్కోర్ వివరాలు..
టీమిండియా తొలి ఇన్నింగ్స్‌: 416 ఆలౌట్‌
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 284 ఆలౌట్‌
టీమిండియా రెండో ఇన్నింగ్స్‌: 245 ఆలౌట్‌
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 378/3
ఫలితం: భారత్‌పై ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చదవండి: IND Vs ENG 5th Test: భారత్‌పై ఇంగ్లండ్‌ సూపర్ విక్టరీ.. సిరీస్‌ సమం

మరిన్ని వార్తలు