రాక్షస అనకొండ..అలా.. ఎలా సామీ: వైరల్‌ వీడియో

20 Nov, 2023 17:14 IST|Sakshi

మామూలు  పాము అంటేనే ఆమడ దూరం పారిపోతాం. ఇక అనకొండను  చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. వన్య ప్రాణ సంరక్షణ కార్యకర్తలు, జూ సంరక్షకులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు.  ఎంతటి క్రూర మృగాలైనా వాటిని మచ్చిక చేసుకుని, వాటితో స్నేహంగా ఉంటారు.  కానీ ఒక  భారీ అనకొండను  నిర్భయంగా ఉత్తి చేతులతో అలా అలవోకగా,  మేనేజ్‌ చేసిన వీడియో  తాజాగా నెట్టింట్‌ సందడి చేస్తోంది. అతని అసాధారణ సాహసానికి,  నైఫుణ్యానికి  నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ విడియో వైరల్‌గా మారింది. 


ఫ్లోరిడాలోని మియామికి చెందిన జూ కీపర్ మైక్ హోల్‌స్టన్ Instagramలో ఈ వీడియోను పోస్ట్‌  చేశారు. తనను తాను ది రియల్ టార్జాన్,  ది కింగ్ ఆఫ్ ది జంగిల్ అని చెప్పుకునే హోల్‌స్టన్  తరచుగా వన్యప్రాణులకు సంబంధించిన చాలా  ఆసక్తికరమైన వీడియోలను చాలా షేర్‌ చేస్తూ ఉంటాడు. ఇది కూడా అలాంటిదే. నీటిలో దాగి వున్న ఈ  భారీ అనకొండను జాగ్రత్తగా  సమీపించి, మెల్లిగా వెళ్లి, చటుక్కున దాని తలను ఒడిసిపట్టుకోవడంతో ఈ వీడియో మొదలవుతుంది. సాధారణంగా అనకొండ ఎంత బలిష్టమైన వారినైనా తన పట్టుతో లొంగదీసుకుంటుంది. కానీ తన నైపుణ్యంతో బలీయమైన అనకొండను పట్టుకోవడం, దానిపై నియంత్రణ సాధించడం,చివర్లో దాని ముద్దు పుట్టుకోవడం  విశేషంగా నిలిచింది. దీన్ని లొంగదీసుకున్న వైనం  అందర్నీ షాక్‌కు  గురిచేస్తుంది.  ఈ వీడియోను ఆ సాంతం గుడ్లప్పగించి, ఉత్కంఠగా చూస్తారు.  

వాట్ యాన్ ఎక్స్‌పిడిషన్  వెనిజులాకు మాన్‌స్టర్‌ అనకొండను విజయవంతంగా పట్టుకున్నాం అనే క్యాప్షన్‌తో దీన్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.  ఇన్‌స్టాగ్రామ్‌లో 5 రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో 11.2 మిలియన్లకు పైగా  వ్యూస్‌లను సాధించింది. మూడు లక్షలకు కమెంట్లను సాధించింది.  బహుశా ఈ గ్రహం మీద అత్యంత ధైర్యవంతుడు అంటూ కమెంట్లు వెల్లువెత్తాయి.

A post shared by Mike Holston (@therealtarzann)

మరిన్ని వార్తలు