Harbhajan Singh: కుమారుడి పేరేంటో తెలుసా?

26 Jul, 2021 16:04 IST|Sakshi

టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్ సింగ్, నటి గీతా బస్రా ఇటీవల జన్మించిన తమ కుమారుడికి పేరు పెట్టారు. ఈ నెల జన్మించిన తమ ముద్దుల తనయుడికి జోవన్‌ వీర్‌గా నామకరణం చేసినట్లు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు గీతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు ద్వారా తెలియజేశారు. ఇందులో కూతురు హినయ తన తమ్ముడిని అప్యాయంగా చేతులోకి తీసుకున్నఫోటోను షేర్‌ చేస్తూ.. ‘పరిచయం చేస్తున్నాం మా హీర్‌ కా వీర్‌ జోవన్‌ వీర్‌ సింగ్‌ ప్లాహా’ అని కామెంట్‌ చేశారు. ఇక ఈ పోస్టుపై అభిమానులు స్పందిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

కాగా గత నెలలో హర్భజన్‌ మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఆయన భార్య గీతా బస్రా మగపిల్లాడికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హర్భజన్ సింగ్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశాడు. తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చినట్లు.. తల్లి బిడ్డా క్షేమంగా తెలిపాడు. అయితే హర్భజన్, గీత దంపతులకు ఇప్పటికే ఓ కుమార్తె ఉంది. 2016 లో ఈ దంపతులు మొదటిసారిగా తల్లిదండ్రులయ్యారు. ఆ పాపకు హీర్ ప్లాహా అనే పేరు పెట్టారు. గీతా బాలీవుడ్ లో ‘దిల్ దియా హై’, ‘ది ట్రైన్’ వంటి పలు సినిమాల్లో నటించింది. గీత, హర్భజన్ లు ప్రేమించుకుని 2015 లో పెళ్లి చేసుకున్నారు.

A post shared by Geeta Basra (@geetabasra)

మరిన్ని వార్తలు